వనవాసి కల్యాణ ఆశ్రమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వనవాసి కల్యాణ ఆశ్రమం
Founder(s)Balasaheb Deshpande
Typeగిరిజనాభివ్రుద్ధి
Foundedడిసెంబెర్ 1952
Headquartersజష్ పూర్ నగర్, ఇండియా
Area servedకనీస సవుకర్యాలు కల్పించడం
Focusవెనుక పడిన వర్గాల అభివ్రుద్ధి
Mottoనగరవాసులు, గ్రామవాసులు, వనవాసులు- అందరూ భారతీయులె

అఖిల భారత వనవాసి కళ్యాణ ఆశ్రమం ఒక సేవాసంస్థ. దేశంలో 27 రాష్ట్రాల్లో 10 కోట్ల వనవాసీలు (గిరిజనులు/ఆదివాసులు) ఉన్నారు. వీరు 435 తెగలుగా విభజించబడి మాలుమూల ప్రాంతాల్లో నేటికీ కనీస అవసరాలు కూడా నోచుకోకుండా నిరక్ష్యరాస్యత, అనారోగ్యం, పేదరికములో జీవిస్తున్నారు. ఆధునిక ప్రగతి ఫలాలు వారికి చేరడం లేదు. వారిలో చైతన్యం తీసుకొస్తే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు సఫలమవుతాయి. ఈ ఉద్దేశంతో 1952 డిసెంబెర్ 26న వనవాసి కళ్యాణ ఆశ్రమాన్ని జష్ పూర్ రాజా అయిన శ్రీ రాజా విజయ్ భూషణ్ జుడావో సహకారంతో కర్మయోగి శ్రీ రమాకాంత్ దేశ్ పాండే ప్రారంభించారు. అప్పటి మధ్యప్రదేశ్, ప్రస్తుత చత్తీస్ ఘడ్ రాష్ట్రం జష్ పూర్ నగరంలో ప్రారంభించారు. ఈ వనవాసి కళ్యాణ ఆశ్రమం కేవలం 13 మంది బాలుర ఆవాస విద్యాలయంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సంస్థ దేశం లోని 375 జిల్లాల్లో విస్తరించి ఉంది. 2013లో ఆశ్రమం స్థాపకులు శ్రీ రమాకాంత్ దేశ్ పాండే శత జయంతిని జరుపుకున్నారు. ప్రతి ఏటా సుమారుగా 7000 మంది గిరిజన విద్యార్థుల ఈ ఆశ్రమం యొక్క వసతి గృహములలో నివసిస్తూ పలు కళాశాలల్లో విద్య నభ్యసిస్తున్నారు. ఇదే కాకుండా గిరిజనాభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ తోటి గిరిజనులను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఇందులో ఉండి విద్య పూర్తి చేసిన విద్యార్థులు భారత సైన్యం, నావికా దళం, సివిల్ సర్వీసెస్ మొదలగు ప్రతిష్ఠాత్మక కొలువులలో చోటు దక్కించుకుంటున్నారు. ఈ సంస్థ యొక్క ఆసుపత్రులలో ప్రతి సంవత్సరం సుమారుగా 12 లక్షల మంది చికిత్స పొందుతున్నారు.

విస్తరణ [మార్చు]

1952లో ప్రారంభించిన ఈ కళ్యాణ ఆశ్రమం సేవా కార్యక్రమాలు, ఈ రోజుకి దేశంలో 312 జిల్లాలకు విస్తరించాయి. ప్రస్తుతం 17,726 సేవా కేంద్రాలతో మారుమూల వనవాసుల సర్వతోముఖ అభ్యున్నతి కొరకు కృషి చేస్తోంది. ఈ కార్యక్రమాల వలన 51,022 గ్రామాలు లబ్ధి పొందుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 35 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వీరిలో 26 తెగలు ఉన్నాయి. 1978లో స్వర్గీయ శ్రీధర్ విశాఖపట్నం జిల్లా పాడేరు ప్రాంతంలో మఠం గ్రామంలో వనవాసి కళ్యాణ ఆశ్రమాన్ని ప్రారంభించారు . నేడు రెండు రాష్ట్రాల్లో 512 గ్రామాల్లో భజన మండళ్ళు, బాల సంస్కార కేంద్రాలు, వైద్య శిబిరాలు, వసతి గృహాలు, క్రీడా కేంద్రాలు, హిత రక్షా వనయాత్ర, విద్యార్థినీ, విద్యార్థులకు భవిష్యత్ కోసం మార్గదర్శక తరగతులు నిర్వహించడం జరుగుతుంది.

వనవాసి కళ్యాణ ఆశ్రమం కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా నిస్వార్ధంగాను, దేశ భక్తితోనూ, త్యాగ భావం కలిగిన 1203 మంది పూర్తి సమయ కార్యకర్తలు, దీనికి 10 రెట్లు అంశ కాలీన కార్యకర్తలు పనిచేస్తున్నారు.

లక్ష్యాలు[మార్చు]

వనవాసీల సర్వతోముఖ అభివృద్ధికి ఈ దిగువ ఆశయములతో వనవాసి కళ్యాణ ఆశ్రమం పని చేస్తోంది.

  • వనవాసీల అంతర్గత సంఘటనా శక్తిని ఉద్దీపింప చేయుట
  • వారి వారసత్వపు విలువలను జాగృతం చేయుట
  • జాతీయ భావాలతో కూడిన నిస్వార్ధమైన సామాజిక స్పృహను రేకెత్తించే నాయకులను తయారు చేయుట
  • సమాజంలోని అన్నిరంగాల వారూ కలిసి పని చేయగలుగుట

నినాదం[మార్చు]

వనవాసి కళ్యాణ ఆశ్రమం నినాదాలు

  • సంస్కృతిని కోల్పోతే మన అస్తిత్వాన్ని కోల్పోయినట్టే
  • వానవాసుల సంక్షేమమే భారత సంక్షేమం

విద్యాభివృద్ధి[మార్చు]

వనవాసి కళ్యాణ ఆశ్రమం గిరజన ప్రాంతాలలో పాఠశాలలు ప్రారంభించింది.వివేకానంద చెప్పిన సూక్తి నుండి ఈ ఆశ్రమం స్ఫూర్తి పొందింది. అనేక మంది గిరిజనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో సేవలు అందిస్తున్నారు. నాగాలాండ్ లోని హిందీ అధ్యాపకులలో సుమారు 90% మంది కళ్యాణ ఆశ్రమం యొక్క విద్యార్థులే. చాలామంది విద్యార్థులు రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు.

సాంస్కృతిక పరిరక్షణ[మార్చు]

ఆదివాసీయులు బ్రిటిష్ వారి యొక్క విభజించు-పాలించు సిద్ధాంతానికి భాదితులయ్యారు. వారు ఆటవికులుగా పిలువబడ్డారు. అలాంటి ప్రదేశాలలో వనవాసి కళ్యాణ ఆశ్రమం తన కార్యక్రమాలు ప్రారంభించింది. ఆదివాసీలలో ఆత్మస్థ్యైర్యాన్ని పెంచి, సమానత్వ భావాన్ని పెంపొదించింది. మహిళలు, పిల్లలు కోసం సంస్కార కేంద్రాలు, పాఠశాలలు, వసతి గృహాలు, ఉచిత ఆసుపత్రులు ప్రారంభిచారు. ఈ ఆశ్రమం గిరిజనుల యొక్క సాంస్కృతిక పరిరక్షణకు కూడా తోడ్పడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజనుల సాంస్కృతిక నృత్యాలైన చెక్కభజన, కోలాటం, ధింసా మొదలగు వాటిని వెలుగు లోకి తీసుకువస్తున్నారు.

మూలాలు, బయటి లింకులు[మార్చు]

  1. https://en.wikipedia.org/wiki/Vanavasi_Kalyan_Ashram
  2. https://web.archive.org/web/20141217230512/http://kalyanashram.in/
  3. www.kalyanashram.in/
  4. http://www.theforthright.com/vanvasi-kalyan-ashram-rss-product-changing-lives-tribals/ Archived 2015-01-11 at the Wayback Machine