కె.బి.హెడ్గేవార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా.హెడ్గేవార్

కేశవ్ బలీరాం హెడ్గేవార్ (ఏప్రిల్ 1, 1889 - జూన్ 21, 1940) హిందూ జాతీయవాద సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.యస్.యస్.) వ్యవస్థాపకులు. హిందూ జాతి లేక హిందుత్వ భావనను వ్యాప్తి చేయుట కొరకు హెడ్గేవార్ ఆర్.యస్.యస్.ను మహారాష్ట్ర లోని నాగపూర్ పట్టణంలో 1925వ సంవత్సరంలో స్థాపించారు. స్వామి వివేకానంద, అరబిందో వంటి హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్తల ప్రభావానికి లోనై ఈయన ఆర్.యస్.యస్. మౌలిక భావజాలాన్ని నిర్మించారు.హెడ్గేవార్ వైద్యవిద్యను అభ్యసించుటకు కోల్ కతా వెళ్ళినపుడు బెంగాల్ లోని నాటి రహస్య విప్లవ సంస్థలైనటువంటి అనుశీలన సమితి, జుగాంతర్ మొదలైనవాటి ప్రభావానికి లోనయ్యారు. ఈయన 1929 వరకు హిందూ మహాసభలో సభ్యునిగా ఉన్నారు. హెడ్గేవార్ బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో 1921లో ఒక సంవత్సరం మరలా 1930లో 9 నెలలు జైలు శిక్ష ననుభవించారు.

ప్రారంభ జీవితం[మార్చు]

డా.హెడ్గేవార్ 1889లో మరాఠీ నూతన సంవత్సర పర్వదినాన నాగపూర్ లోని ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.[1] హెడ్గేవార్ పూర్వీకులు తెలంగాణ లోని మహారాష్ట్ర సరిహద్దుకు సమీపానగల బోధన్ తాలూకాలోని కందకుర్తి అనే చిన్న గ్రామానికి చెందినవారు. ఈ గ్రామం వద్ద గోదావరిలో మంజీర, హరిద్ర నదులు కలసి త్రివేణి సగమం ఏర్పడుతుంది.

ఆర్.యస్.యస్. నేపథ్యం[మార్చు]

ఆర్.యస్.యస్. స్థాపన[మార్చు]

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదటిసారిగా 1925లో నాగపూర్ లోని ఒక చిన్న మైదానంలో విజయదశమి పర్వదినాన ఐదారుగురు సభ్యుల బృందంతో సమావేశమైనది. ఆర్.యస్.యస్. ప్రాథమికస్థాయి నిర్మాణాన్ని శాఖ అంటారు. దీనిద్వారా ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఒక బహిర్ మైదానంలో ప్రతిరోజూ ఒక గంట సమయం ఆ శాఖ లోని స్వయంసేవకులంతా సమావేశమై డ్రిల్లు, వ్యాయామం నిర్వహించి నినాదాలు ఉచ్చరిస్తారు.

ఆర్.యస్.యస్. స్థాపన సమయంలో హెడ్గేవార్ను అనుసరించి ఉన్నవారిలో భయ్యాజి దాణె, భావురావ్ దేవరస్, బాలసాహెబ్ దేవరస్, వ్యంకప్ప పాట్కి, అప్పాజి జోషి ముఖ్యులు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. The Hindu Nationalist Movement in India By Christophe Jaffrelot పేజీ.45 [1]

బయటి లింకులు[మార్చు]

ఆర్.యస్.యస్.అధికారిక వెబ్ సైటు