Jump to content

బాంబ్లేశ్వరి దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 21°10′46″N 80°45′9″E / 21.17944°N 80.75250°E / 21.17944; 80.75250
వికీపీడియా నుండి
బాంబ్లేశ్వరి దేవాలయం
భౌగోళికం
భౌగోళికాంశాలు21°10′46″N 80°45′9″E / 21.17944°N 80.75250°E / 21.17944; 80.75250
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
జిల్లారాజ్‌నంద్‌గావ్ జిల్లా
స్థలండోంగర్‌ఘర్‌

బాంబ్లేశ్వరి దేవాలయం, ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో డోంగర్‌ఘర్‌లో ఉన్న హిందూ దేవాలయం. 1600 అడుగుల కొండపై ఉన్న ఈ దేవాలయాన్ని బడి బాంబ్లేశ్వరి అంటారు. ఇక్కడికి 1/2 కి.మీ. దూరంలో మరొక దేవాలయం ఉంది. దానిని ఛోట్టి బాంబ్లేశ్వరి అంటారు. ఈ దేవాలయాలను ఛత్తీస్‌గఢ్‌లోని లక్షలాది మంది ప్రజలు పూజిస్తారు. నవరాత్రులలో (దసరా సమయంలో), చైత్ర (శ్రీరామనవమి సమయంలో) ఇక్కడికి వస్తారు. నవరాత్రులలో జ్యోతి కలశాన్ని వెలిగించే సంప్రదాయం ఇక్కడ ఉంది.

ప్రదేశం

[మార్చు]
కొండపై ఉన్న మా బమలేశ్వరి దేవాలయం నుండి డోంగర్‌ఘర్ ఏరియల్ వ్యూ

మరాఠీ భాషలో డోంగర్ అంటే పర్వతాలు, ఘర్ అంటే కోట అని అర్థం. పురాణాల ప్రకారం, సుమారు 2200 సంవత్సరాల క్రితం, స్థానిక రాజు రాజా వీర్సేన్‌కు సంతానం లేకపోవడంతో రాజ పూజారుల సూచనల మేరకు దేవతలకు పూజలు చేసాడు.[1] సంవత్సరంలోపు, రాణి ఒక కొడుకుకు జన్మనిచ్చింది, అతనికి వారు మదన్‌సేన్ అని పేరు పెట్టారు. రాజా వీర్సేన్ దీనిని శివుడు, పార్వతిల ఆశీర్వాదంగా భావించి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాడు. డోంగర్‌ఘర్ దేవాలయంలో, రాజు విక్రమాదిత్య ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళగా దేవి బమలేశ్వరి ప్రత్యక్షమై అతనిని కాపాడింది. కొండ పైకి చేరుకోవడానికి 1000 మెట్లు ఉన్నాయి. రాయ్‌పూర్ నుండి భిలాయ్, దుర్గ్, రాజ్‌నంద్‌గావ్ మీదుగా డోంగర్‌ఘర్ 107 కిలోమీటర్ల దూరంలో ఉంది. కలకత్తా-ముంబై జాతీయ రహదారి (NH #6) నుండి దట్టమైన పచ్చని వృక్షాలు, తేలికపాటి అడవుల గుండా ఇరుకైన వంకరగా ఉండే రహదారి మార్గం ఉంది. జిల్లా ప్రధాన కార్యాలయం రాజ్‌నంద్‌గావ్ నుండి డోంగర్‌గర్‌కి 40 కి.మీ. దూరం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. దేవాలయ కొండపై ఉన్న రోప్-వే[2] నగరంలోని పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన ఏకైక రోప్-వే ఇది. దాంతో ఇక్కడకి అనేకమంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.

రోప్‌వే ప్రమాదం

[మార్చు]

2016 ఫిబ్రవరి 29న జరిగిన రోప్‌వే ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు.[3][4] 2021 ఫిబ్రవరి 18న జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించాడు.[5][6]

ఆన్‌లైన్ సౌకర్యాలు

[మార్చు]

దేవాలయం ఆన్‌లైన్ రోప్‌వే టికెట్ బుకింగ్, ఆన్‌లైన్ జ్యోతి కలశ్ బుకింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Bamleshwari Mata Temple - Travel News India". travelnewsindia.com. 2017-01-28. Archived from the original on 2022-04-01. Retrieved 2022-06-20.
  2. "Maa Bamleshwari Devi Temple Dongargarh - Ropeway Ride". The Backpack Diaries. 2018-04-14. Archived from the original on 2021-11-08. Retrieved 2022-06-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "1 dead in Chhattisgarh ropeway mishap". The Times of India (in ఇంగ్లీష్). February 29, 2016. Retrieved 2022-06-20.
  4. "Ropeway mishap at Dongargarh near Nagpur; woman killed, 3 injured; Maintenance flaws alleged". Nagpur Today : Nagpur News. 2016-03-01. Retrieved 2022-06-20.
  5. "Chhattisgarh: Labourer died in a rope-way trolley accident in Rajnandgaon". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-02-19. Retrieved 2022-06-20.
  6. "डोंगरगढ़ मंदिर में बड़ा हादसा: रोपवे की ट्रॉली टूटकर पहाड़ में गिरी, सवार मजदूर की मौके पर मौत". Patrika News (in hindi). Retrieved 2022-06-20.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

[మార్చు]