బందిపోటు (1963 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బందిపోటు
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
నిర్మాణం సుందర్ లాల్ నహతా,
డూండీ
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణ కుమారి,
రాజనాల,
రేలంగి,
నాగయ్య,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రమణారెడ్డి
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, పి.లీల
గీతరచన సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్య, కొసరాజు రాఘవయ్య
నిర్మాణ సంస్థ రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్
భాష తెలుగు

బందిపోటు 1963, ఆగష్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. బి.విఠలాచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, రేలంగి, గుమ్మడి, రాజనాల, నాగయ్య, రమణారెడ్డి, కృష్ణకుమారి, ఇ.వి.సరోజ, గిరిజ, పుష్పవల్లి, మీనాకుమారి, మిక్కిలినేని, బాలకృష్ణ, వంగర, రామకోటి, సత్యం, రాజబాబు, కాశీనాథ్ లు నటించారు.[1]

చిత్రం వివరాలు[మార్చు]

కథ[మార్చు]

గాంధార రాజ్యంలో సత్యసేన భూపతి అనే అశక్తుడైన మహారాజు ఉంటాడు. అతనికి మందారమాల అనే అహంకారియైన కూతురు. శూరసింహుడనే దుష్ట సేనాపతి. ఇతను రాజుగారి బావమరిది కూడా. రాజ్యం మీదా రాజకన్య మీదా ఇతని కన్నుపడుతుంది. పంట లెత్తుకుపోవడం, బల్లేలకి పసి పిల్లల్ని మిడుతల్లా గుచ్చి ఆనందించడం, ఆడవాళ్ళని చెరచడం, మగవాళ్ళని చంపడం వంటి అకృత్యాలతో రాజుకి చాలా చెడ్డ పేరు తెస్తూంటాడు.

అసహాయ శూరుడనే వాడు ఇతడి బాధితుడు. ఇతను ముసుగు దొంగలా ఖజానాని దోచి పేదలకి పంచి పెడుతూంటాడు. కీచక రాజభటుల్ని వధిస్తూంటాడు. ఈ అవకాశంతో శూరసింహుడు తన దురాగతాల్ని ఇతడికే అంటగట్టి, రాజుకి ఫిర్యాదు చేస్తూంటాడు. ఒకసారి నరసింహ అనే యువ రైతు అసహాయశూరుడ్ని అటకాయిస్తే, ఇతను తన చిన్నాన్నే అని తెలిసిపోతుంది. అటు రాజుకి కూడా ఈ రహస్యం తెలిసిపోయి, ఆ అసహాయశూరుడ్ని విచారణకి తన ఎదుట ప్రవేశపెట్టాల్సిందిగా అతడి అన్న ధర్మనాయకుణ్ణి ఆదేశిస్తాడు. ఈలోపు నిజాలు బయట పడకూడదని శూరసింహుడు అసహాయశూరుడ్ని చంపించేస్తాడు. ఈ అఘాయిత్యానికి గుండె పగిలిచస్తాడు ధర్మనాయకుడు. కుటుంబంలో ఒకేసారి ఇలా ఈ ఉత్పాతాలకి నరసింహ ఖిన్నుడై, తేరుకుని శూరసింహుడి మీద పగబడ్తాడు.

పగ బట్టిన నరసింహ బందిపోటు వేషంలో మరో కార్యం కూడా సాధిస్తాడు. తను ప్రేమించిన రాకుమారి అహంకారాన్నణచడం. తన పోరాటంలో చివరికి ఉరి కంబమెక్కుతాడు. అటువైపు దుష్టనాయకుడు శూరసింహుడు, రాజుని బంధించి తన పట్టాభిషేక సంబరాల్ని ఘనంగా జరుపుకుంటూంటాడు.

అప్పుడు తప్పించు కొచ్చిన బందిపోటు నరసింహ, ఆ పట్టాభిషేక ఉత్సవాల్లో భారీ యెత్తున సర్కస్ విన్యాసాలతో కనువిందు చేస్తాడు. గానా బజానాతో మైమరపిస్తాడు. ఇదంతా ప్రదర్శించడం అయ్యాక, కత్తి తీసుకుని ఆ కంటకుడిని అంతమొందిస్తాడు.[2]

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
అంతా నీకోసం అందుకే ఈ వేషం చీకటిలో ఏదొ కన్నాను డా॥ సి.నారాయణరెడ్డి ఘంటసాల ఘంటసాల, పి.లీల
ఊహలు గుసగుసలాడే నాహృదయం ఊగిసలాడే, ప్రియా ఆరుద్ర ఘంటసాల పి.సుశీల, ఘంటసాల
ఓ అంటే తెలియని ఓ దేవయ్యా సరసాల నీకేల పో కొసరాజు ఘంటసాల పి.సుశీల, ఘంటసాల బృందం
మంచితనము కలకాలము నిలచియుండుని ఇక దాశరథి ఘంటసాల ఘంటసాల, పి.సుశీల బృందం
మల్లియల్లో మల్లియల్లో మల్లియల్లో మళ్ళివస్తావు దాశరథి ఘంటసాల ఘంటసాల, పి.లీల బృందం
వగలరాణివి నీవే సొగసుకాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే డా॥సి.నారాయణరెడ్డి ఘంటసాల ఘంటసాల
వయసున్నది ఉన్నది సొగసున్నది ఉన్నది అన్నివున్నా ఉలకదు సింగిరెడ్డి నారాయణరెడ్డి ఘంటసాల పి.లీల బృందం

విశేషాలు[మార్చు]

  • ఇదే చిత్రాన్ని కన్నడభాషలో రాజ్‌కుమార్ హీరోగా వీరకేసరి పేరుతో తెలుగుతో పాటు ఒకే సమయంలో నిర్మించారు. ఈ చిత్రానికి విలియం షేక్‌స్పియర్ నాటకం ది టేమింగ్ ఆఫ్ ష్ర్యూకు దగ్గర పోలికలున్నాయని సినిమా విమర్శకులు భావించారు[3].
  • ఈ చిత్రం క్లైమాక్స్‌ను ఈస్ట్‌మన్ కలర్‌లో చిత్రించారు.

మూలాలు[మార్చు]

  1. సినీజోష్. "NTR's 'Bandipotu' Blockbuster Story". www.cinejosh.com. Retrieved 4 August 2017.
  2. సికిందర్ (1 October 2009). "ఆనాటి సినిమా .. విఠలుడి సమాజ దర్పణం!". సాక్షి దినపత్రిక. Retrieved 7 May 2018.[permanent dead link]
  3. https://www.thehindu.com/news/cities/bangalore/shakespeare-influenced-kannada-films-too/article8510212.ece
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.