Jump to content

ప్రెసిడెంటు గారి పెళ్ళాం

వికీపీడియా నుండి
(ప్రెసిడెంట్ గారి పెళ్ళాం నుండి దారిమార్పు చెందింది)
ప్రెసిడెంటు గారి పెళ్ళాం
దర్శకత్వంఎ. కోదండరామిరెడ్డి
రచనతోటపల్లి మధు (మాటలు)
స్క్రీన్ ప్లేఎ. కోదండరామిరెడ్డి
కథబలభద్రపాత్రుని రమణి
మధు
నిర్మాతవి. దొరస్వామిరాజు
తారాగణంనాగార్జున, మీనా
ఛాయాగ్రహణంవి. ఎస్. ఆర్. స్వామి
కూర్పుఎ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విఎంసి ప్రొడక్షన్స్ [1]
విడుదల తేదీ
30 అక్టోబరు 1992 (1992-10-30)
సినిమా నిడివి
138 ని
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు7 కోట్లు

ప్రెసిడెంటు గారి పెళ్ళాం 1992 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా. విఎంసి ప్రొడక్షన్స్ పతాకంపై వి. దొరస్వామి రాజు నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున, మీనా ప్రధాన పాత్రధారులు. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.

చంద్రయ్య (చంద్రమోహన్), రాజా (నాగార్జున) అన్నదమ్ములు. చంద్రయ్య ఆ వూరి ప్రెసిడెంటు అయిన దేవుడు (కైకాల సత్యనారాయణ) దగ్గర పనిచేస్తుంటాడు. చంద్రయ్యకు దేవుడంటే నిజంగా దేవుడితో సమానం. కానీ రాజాకు మాత్రం ఆయనంటే పడదు. ఇదే విషయమై అన్నదమ్ములిద్దరూ అప్పుడప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. దేవుడి కూతురు స్వప్న (మీనా) పట్నంలో చదువుకుంటూ ఉంటుంది. తన అహంకారంతో రాజాతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఒకసారి స్వప్న ఎడ్లబండి ఎక్కి రాజా జొన్న చేను నాశనం చేస్తుంది. రాజా ఆమెను అవమానించి ఆమె తండ్రి చేత నష్ట పరిహారం పొందుతాడు. ఆ అవమానంతో తన అన్న నరేంద్ర (శ్రీకాంత్) చేత రాజాను కొట్టించాలని చూస్తుంది. కానీ అతను వెళ్ళి రాజా చేతిలో దెబ్బలు తిని వస్తాడు. దేవుడు తెలివిగా చంద్రయ్య ద్వారా రాజా సాగు చేస్తున్న పొలాన్ని కొనేస్తాడు. స్వప్న వెళ్ళి రాజాను అవమానించి వస్తుంది. రాజా చాలా మంచి మనిషనీ, అతన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పమని ఆమె తల్లి కోరుతుంది. స్వప్న రాజాను ప్రేమిస్తున్నట్లు నటించి అతను తనని పాడుచేయడానికి ప్రయత్నించాడని అతనికి పంచాయితీలో కొరడా దెబ్బల శిక్ష విధిస్తుంది. రాజా మనసు తీవ్రంగా గాయపడుతుంది.

పంచాయితీ ఎన్నికల్లో రాజా దేవుడికి ప్రత్యర్థిగా నిలబడతాడు. తాను గెలిస్తే కూతురినిచ్చి పెళ్ళి చేయమని పందెం కడతాడు. రాజా ఓడిపోతే ఊరు విడిచి వెళ్ళిపోతానని చెబుతాడు. రాజా ఎన్నికల్లో గెలుస్తాడు.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  • నువ్వు మల్లె తీగ , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • పరువాల కోడి , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • మండూరి ఆంబోతు , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఆ వడ్డు ఈ వడ్డు, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఉమ్మ కావాలి , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • కందిరీగ నడుము దాని , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

మూలాలు

[మార్చు]
  1. "President Gari Pellam(1992)". cineradham.com. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 5 October 2014.