కటకము (వస్తువు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కటకము లలో రకములు

ప్రకాశ పారదర్శకమై కాంతిని వక్రీభవనం చెందించగల ఒక జత (గోళాకారపు) వక్ర ఉపరితలాలు గలిగిన యానకాన్ని కటకం (ఆంగ్లం:lens) అందురు. వాటి ఉపరితలాల ఆకారమును బట్టి కటకములు ఐదురకములు. అవి

 1. ద్వికుంభాకార కటకం (Biconvex lens) సమతల కుంభాకార
 2. ద్విపుటాకార కటకం (Biconcave lens)
 3. సమతల కుంభాకార కటకం (Plano convex)
 4. సమతల పుటాకార కటకం (Plano convave)
 5. కుంభాకార పుటాకార కటకం (convex-concave)

వివరణ[మార్చు]

 • ఒక కుంభాకార కటకం యొక్క మధ్య భాగం మందంగాను,అంచులు పల్చగాను ఉంటాయి.
 • ఒక పుటాకార కటకం యొక్క మధ్య భాగం పల్చగాను, అంచులు మందంగాను వుంటాయి.

కుంభాకార కటకం[మార్చు]

ద్వికుంభాకార కటకము
 • దీని గుండా చూసిన వస్తువులు పెద్దవిగా కనిపిస్తాయి.
 • కటకం చలించిన దిశకు వ్యతిరేక దిశలో వస్తువులు చలించినట్లు కనిపిస్తుంది.
 • వక్రీభవనం చెందిన తర్వాత అన్ని కిరణలు కేంద్రీకరింపబడతాయి.

పుటకార కటకం[మార్చు]

 • దీని గుండా చూసిన వస్తువులు కుచించుకు పోయినట్లు చిన్నవిగా కనిపిస్తాయి.
 • కటకం చలించిన దిశలోనే వస్తువులు చలించునట్లు కనిపిస్తుంది.
 • వక్రీభవనం చెందిన తర్వాత అన్ని కిరణాలు విముఖీకరణం చెందుతాయి.

ఉపయోగాలు[మార్చు]

కెమెరా కటకం[మార్చు]

కెమెరాలలో ఉపయోగించే కటకము యొక్క విశేషాలు ఈ వ్యాసంలో చదవండి.