సూక్ష్మదర్శిని
సూక్ష్మదర్శిని (ఆంగ్లం Microscope) సామాన్యంగా కంటికి కనిపించని అతి సూక్ష్మమైన పదార్ధాలను చూడడానికి ఉపయోగపడే దృక్ సాధనము. దీనికి 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది. అన్ని రకాలైన సూక్ష్మదర్శినులు కటకాలను ఉపయోగించి తయారుచేయబడతాయి. ఈ కటకాలు సామాన్య కాంతిని తమగుండా ప్రసరింపజేయగలిగి యానకంగా పనిచేస్తాయి. అందువలన దీనిని కాంతి సూక్ష్మదర్శిని (Light Microscope) sk----fayaz--from-guntur--.
సూక్ష్మదర్శిని రెండు దశలలో వస్తువు యొక్క ప్రతిబింబాన్ని అధికతరం చేస్తుంది. దీని కొరకు వస్తు కటకం (Objective lens), నేత్ర కటకం (Eye lens) తోడ్పడతాయి. వస్తు కటకాలు వివిధ పరిమాణాలలో ఉంటాయి. అవి 4x, 10x, 40x, 60x, 100x రెట్లు అధికతరం చేసే కటాకాలు. వీటి మూలంగా అల్ప శక్తి విధానంలో 100 రెట్లు, అధిక శక్తి విధానంలో 400 రెట్లు అధికరణను సాధిస్తుంది. ఆయిల్ ఇమ్మర్షన్ కటకం సాధారణంగా 1000 రెట్లు అధికరణ సాధిస్తుంది. ఇంతకన్నా అధికరణ ఎక్కువచేస్తే అస్పష్టత అధికమవుతుంది. అంతకన్నా ఎక్కువ అధికరణ కావాల్సివచ్చినప్పుడు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని ఉపయోగిస్తారు.
సూక్ష్మదర్శిని నిర్మాణంలో వేదిక కింది భాగాన్ని అంటిపెట్టుకొని కుంభాకార కటకంతో కూడి కండెన్సర్ ఉంటుంది. ఇది దిగువన ఉండే దర్పణం నుంచి పరావర్తనమైన కాంతి కిరణాలను కేంద్రీకరింపజేస్తుంది. రెండు కన్నులతో ఒకేసారి చూడటానికి వీలున్న దానిని బైనాక్యులర్ సూక్ష్మదర్శిని అంటారు. ఇవి ఎక్కువసేపు పరీక్షించవలసి వచ్చినప్పుడు కంటికి శ్రమను తగ్గించడానికి అనువుగా ఉంటాయి. వీటిలో నేత్ర కటకాలు రెండు ఉంటాయి.
Microscope Gallery
[మార్చు]-
Laboratory microscope
-
Binocular laboratory microscope
-
Microscope binoviewers
-
Stereo-microscope
-
Microscope objectives
-
Microscope objectives
-
Microscope objectives
-
Microscope eyepieces
-
Microscope measuring eyepiece
-
Stereo-microscope eyepiece
-
Microscope eyepiece
-
Microscope eyepiece
Mechanical part of microscope
[మార్చు]మూలాలు
[మార్చు]- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, ఆంధ్ర ప్రదేశ్.