దృక్ సాధనాలు
Jump to navigation
Jump to search
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
పూర్వం సూక్ష్మ దర్శనులు, దూరదర్శనులను దృక్ సాధనాలనేవారు. కాని ఇప్పుడు ప్రతి బింబాలను ఏర్పరచే దర్పణాలు, కటకాల మీద ఆధారపడే సాధనాలను దృక్ సాధనాలంటారు. వానిని మూడు రకాలుగా విభజించ వచ్చు.[1]
- . సూక్ష్మ దర్శనులు, దూరదర్శనులవంటి దృశ్య సాధనాలు.
- .కెమెరాలు, దృక్ లాంతరుల వంటి ఫోటో గ్రాఫింగ్, ప్రక్షేపక సాధనాలు.
- .వర్ణపట గ్రాహకం వర్ణ పటామాపకాల వంటి విశ్లేషణ్ సాధనాలు.
దృక్ సాధనాలైన దూరదర్శనులు, సూక్ష్మ దర్శనుల గురించి తెలుసుకోవాలంటే ఈ కింద ఇచ్చిన నిర్వచనాలు ముందుగా అవగాహన చేసుకోవాలి.
- і. ఏదైనా వస్రువును స్పష్టంగా చూడటానికి కావలసిన కనిష్ఠ అవధిని కంటి యొక్క సమీప బిందువు అంటారు.
- іі. కంటి నుంచి సమీప బిందువు దూరాన్ని స్పష్ట దృష్టి కనిష్ఠ దూరం అంటారు. ఏ దోషం లేని కంటికి ఇది 25 cm. దీని గుర్తు D.
- ііі.స్పష్ట దృష్టికి ఉండవలసిన గరిష్ఠ అవధిని దూర బిందువు అంటారు.
దృశ్య కోణం
[మార్చు]వస్తువు కంటి వద్ద ఏర్పరచే కోణాన్ని దృశ్యకోణం అంటారు. వస్తువు స్పష్ట దృష్టి కనిష్ఠ దూరంలో ఉన్నప్పడు అది కంటి వద్ద గరిష్ఠ కోణం చేస్తుంది. సమీప బిందువు వద్ద ఉంచిన వస్తువు ఎత్తు h అయితే, దృశ్యకోణం
- θ0=h/D
మూలాలు
[మార్చు]- ↑ ఇంటర్మిడియట్ రెండవ సంవత్సరం భౌతికశాస్త్రం పాఠ్య పుస్తకం