గరాటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వంటగదిలో వాడే గరాటు.

గరాటు (జర్మన్ Trichter, ఫ్రెంచ్ Entonnoir, ఆంగ్లం funnel, స్పానిష్ embudo, పోర్చుగీసు funil) ప్రయోగశాల పరికరము, గృహోపకరణము. దీనికి సన్నని నాళం ఉండి ఒక వైపు వెడల్పాటి భాగం ఉంటుంది. వీనిని ద్రవాలు లేదా సన్నని పొడి లాంటి పదార్ధాలను సన్నని మూతి కలిగిన డబ్బాలలోనికి పోయడానికి ఉపయోగిస్తారు. ఇవి లేకపోతే చాలా పదార్ధాలు వ్యర్ధం అవుతాయి.

గరాట్లు సామాన్యంగా స్టీలు, గాజు, అల్యూమినియం లేదా ప్లాస్టిక్ తో తయారవుతాయి. రసాయనికంగా కొన్ని పదార్ధాలు చర్య జరపకుండా ప్రయోగశాలలో గాజు గరాట్లు ఉపయోగిస్తే, వంటగదిలో సామాన్యంగా ప్లాస్టిక్ వి ఉపయోగంలో ఉన్నాయి. గరాటులో వడపోత కాగితం ఉంచి కొన్ని ద్రవాల్ని వడపోయడానికి ఉపయోగిస్తారు. డ్రాపర్ గరాట్లు (dropper funnels) ద్రవాల ప్రవాహాన్ని నియంత్రించే విధంగా కవాటాలు కలిగివుంటాయి.

ఈ గరాటు తయారీకి ఉపయోగించే పదార్థం అందు బదిలీ చేయబడిన పదార్థం బరువును తట్టుకొనే విధంగా గట్టిగా ఉండాలి. అది అందులో బదిలీ చేయబడిన పదార్థంతో చర్య జరపకూడదు. డీసెల్ ను ఒక పాత్ర నుండి వేరొక పాత్రలోకి బదిలీ చేయడానికి స్టెయిన్‌లెస్ స్టీలు లేదా గాజు గరాటును వాటుతారు. వంట గదిలో ప్లాస్టిక్ గరాటును వాడుతారు. కొన్ని సందర్భాలలో పునర్వినియోగం చేయలేని కాగితపు గరాటును వాడుతారు. పదార్థం బదిలీ చేసినపుడు తగినంత శుభ్రం చేయలేనంత కష్టంగా ఉన్న సందర్భాలలో ఈ కాగితం గరాటులు ఉపయోగిస్తారు.(ఉదాహరణకు కారులో ఇంజన్ ఆయిల్ వేయునపుడు) ప్రయోగశాలలలో ప్లాస్టిక్ లేదా గాజు గరాటులనుపయోగిస్తారు.

ప్రయోగశాల గరాటులు

[మార్చు]

ప్రయోగశాలలో ప్రత్యేకమైన అనువర్తనాల కోసం అనేక రకాల గరాటులనుపయోగిస్తారు. అవి ఫిల్టర్ గరాటు, థిసెల్ గరాటు, డ్రాపింగ్ గరాటు. థిసెల్ గరాటులో పెద్ద గాజు గొట్టం క్రింది భాగంలో ఉండి పైన చిన్న థిసెల్ పుష్పం ఆకారంలో బల్బు ఉంటుంది. డ్రాపింగ్ గరాటులో స్టాప్ కాక్ ఉంటుంది. దీనితో ద్రవాలను ఎంత పరిమాణంలో కావాలంటే అంత పరిమాణాన్ని బదిలీ చేయవచ్చు. ఘన పదార్థాల చూర్ణాల బదిలీ కోసం చిన్న కాండంతో కూడిన పొడి గరాటు సరైనది.

ఒక విజాతీయ ద్రావణంలో ఘనపదార్థ కణాలను తొలగించడానికి వడపోత విధానం ఉపయోగిస్తారు. ఈ విధానంలో గరాటులో వడపోత కాగితాన్ని మడచి ఉంచుతారు. అందులో ద్రావణాన్ని పోసినపుడు అందలి కణాలు తొలగించబడతాయి. రెండు అమిశ్రణీయ ద్రవాలను (నూనె + నీరు) వేరుచేయడానికి వేర్వాటు గరాటును వాడుతారు.[1]

వడపోత కాగితంతో ఉపయోగించినప్పుడు, ఫిల్టర్ ఫన్నెల్స్, బుచ్నర్, హిర్ష్ ఫన్నెల్స్ వడపోత అనే ప్రక్రియలో ద్రవ నుండి చక్కటి కణాలను తొలగించడానికి ఉపయోగించవచ్చు. మరింత డిమాండ్ ఉన్న అనువర్తనాల కోసం, తరువాతి రెండింటిలోని వడపోత కాగితాన్ని సైనర్డ్ గ్లాస్ ఫ్రిట్‌తో భర్తీ చేయవచ్చు. ద్రవ-ద్రవ వెలికితీతలలో వేరు వేరు గరాటులను ఉపయోగిస్తారు. టల్గ్రెన్ గరాటు మొక్కల లిట్టర్ లేదా ఇలాంటి పదార్థాల నుండి ఆర్థ్రోపోడ్లను సేకరించడానికి ఉపయోగిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. A Dictionary of Entomology. CABI. 2011. p. 172. ISBN 184593542X. Retrieved 9 July 2013.

బాహ్య లంకెలు

[మార్చు]

Media related to Funnel shaped objects at Wikimedia Commons
Media related to Funnels (ship part) at Wikimedia Commons

"https://te.wikipedia.org/w/index.php?title=గరాటు&oldid=3982871" నుండి వెలికితీశారు