బ్యూరెట్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
బ్యూరెట్ (burette or buret) ఒక స్తూపాకారంలోని ప్రయోగశాల పరికరం. దీని మీద ద్రవపదార్థాల ఘనపరిమాణాన్ని కొలవడానికి అనువుగా గీతలు గీసివుంటాయి.[1] క్రింది భాగంలో స్టాప్ కాక్ (stopcock) ఉండి ద్రవాల ప్రవాహాన్ని నియంత్రించడానికి అనువుగా ఉంటుంది. దీనిని వివిధ ప్రయోగాలలో ద్రవాలను కొలవడానికి తద్వారా ఒక రసాయనిక చర్యలో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.[2] అంశమాపనం (titration) ప్రయోగాలలో ఇది తప్పనిసరి.బ్యూరెట్ నుపయోగించి ద్రవాల (ఆమ్లాల, క్షారాల) నార్మాలిటి, మోలారిటి లను పామాణికరించడం/దృవీకరించడం (Standardization చేయుదురు.) ఘనపరిమాణత్మక విశ్లేషణలో (volumetric analysis) వుపయోగించు ఆమ్ల, క్షార ద్రవాలు కచ్చితమైన నార్మాలిటి, మొలారిటి కలిగి వుండాలి. ఆమ్ల ద్రవాల నార్మాలిటిని నిర్ణయించుటకు ఆమ్ల ద్రవాలను క్షారాల తోను, క్షారద్రవాల నార్మాలిటి నిర్ణయించుటకు ఆమ్లద్రవాలతోని అంశమాపనం (Titration) చేసి వాటి నార్మాలిటి లేదా మొలారిటిని దౄవికరించడం/ప్రామాణికరణించడం చెయుదురు[3].
బ్యూరెట్ లు సాధారణంగా 25 లేదా 50 మి.లీ.ల సైజువి ఎక్కువగా వాడకంలో ఉన్నాయి. బ్యూరెట్ లోని ద్రవం స్పష్టంగా కంపించుటకై పారదర్శకమైన గాజుతో (బొరొసిలికెట్) చేయుదురు. బ్యూరెట్ పైభాగం ఒక మి.మీ. మందం కలిగి ఎకరీతి వ్యాసం కలిగివుండును. గొట్టం క్రీంద వ్యాసం తగ్గింపబడి దానికి ఒక స్టాప్ కాక్ (stop cock) వుండును.ఈ స్టాప్ కాక్ ను నెమ్మదిగా తెరవడం, మూయడం వలన బ్యూరెట్ లోని ద్రవం క్రిందికి కావలసిన ప్రమాణంలో వదలుటకు అనుకూలం. కాక్ క్రిందవున్న తక్కువ వ్యాసమున్న గొట్టం చివర దగ్గరగా నొక్కబడివుండును. ఇలా దగ్గరగా నొక్కడం వలన బ్యురెట్ నుండి ద్రవం సన్నని ధారగా, లేదా చిన్న బొట్లు (చుక్కలు/బిందువులు) గా వదులుటకు వీలుంటుంది. బ్యూరెట్ లో విభజన రేఖలు పైనుండి క్రొందికి మార్కు చెయ్యబడి వుందును. అనగా సున్నస్దానం పైనవుండి, దిగువకు వెళ్ళెకొలది విలువ/కొలత పెరుగుతుంది. కొలజాడి (measuring cylinder), కొనికల్ ఫ్లాస్కు, బీకరులలో కొలతలు దిగువనుండి పైకి వుండును.
బ్యూరెట్ ను ఉపయోగించుటకు ముందు దానిని డిస్టిల్ వాటరుతో రెండు మూడు సార్లు రింస్/వాష్ చెయుదురు. తరువాత బ్యూరెట్ లో నింప వలసిన ద్రవాన్ని కొన్ని మి.లీ నింపి, పై తెరచివున్న భాగాన్ని వేలితో మూసి బ్యూరెట్ను తలక్రిందులుగా చేసి పైకి, క్రిందికి, పక్కలకువంచి కుదిపి ఆతరువాత ఆద్రావాణన్ని తీసివేయుదురు. ఇప్పుడు బ్యూరెట్ లో గాలిబుడగలు లేకుండ ద్రవాన్ని నింపాలి. మొదట సున్న స్దానంకన్న 5-6 మి.లీ ఎక్కువ ద్రవాన్ని నింపి గాలిబుడగలున్న బ్యురెట్ ను పక్కకు వంచి తొలగించాలి. ఇప్పుడు బ్యూరెట్ కాక్ ను నెమ్మదిగా ఒపన్ చేసి ద్రవం సున్న స్దానం వద్దకు రాగానే కాక్ ను మూసి చెయ్యాలి. మొదట బ్యూరెట్ ను నింపినప్పుడు బ్యూరెట్ కాక్ క్రింద వున్న గొట్టం కాలీగా వుండును. ఇలా ఎక్కువ ద్రంవం తీసుకొని సున్నకు సరిచెయ్యడం వలన కాక్ క్రిందనున్న గొట్టంలో ద్రవం నిండును, గొట్టంచివరి రంధ్రం సన్నగా వుండటం వలన ద్రవం క్రిందకు ప్రవహించకుండ నిలచి వుండును.
మూలాలు
[మార్చు]- ↑ Pradyot Patnaik (2003). "Specifications for volumetric ware". Dean's Handbook of Analytical Chemistry, 2nd Edition. McGraw-Hill. ISBN 978-0071410601.
- ↑ మూస:VogelQuantitative6th Section 3.12, p.79, "Burettes"
- ↑ Redman, H. N. (1963). "An improved type of weight burette for use in volumetric analysis". Analyst. 88: 654–655. doi:10.1039/AN9638800654.
బయటి లింకులు
[మార్చు]- Using a Burette from ChemLab at Dartmouth College
- https://web.archive.org/web/20110514131534/http://core.ecu.edu/chem/chemlab/equipment/images/burette.jpg
- Use of the Buret
- Digital burette and selecting the right digital burette
- Margin of error for volumetric measuring instruments[permanent dead link]