తెలుగువీర లేవరా (పాట)
"తెలుగువీర లేవరా" | |
---|---|
సంగీతం | ఆదినారాయణరావు |
సాహిత్యం | శ్రీరంగం శ్రీనివాసరావు |
ప్రచురణ | 1974 |
భాష | తెలుగు |
రూపం | దేశభక్తి గీతం |
తెలుగువీర లేవరా 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు సినిమాలోని దేశభక్తి గీతం. దీనిని ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు రచించారు. భారత స్వాతంత్ర్య సమరస్పూర్తితో ఘంటసాల వెంకటేశ్వరరావు, వి.రామకృష్ణ బృందం ఈ గీతాన్ని చక్కగా ఆలపించారు. దర్శకుడు రామచంద్రరావు ఘట్టమనేని కృష్ణ, ఇతర నటులపై చిత్రీకరించారు.
నేపథ్యం
[మార్చు]అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దొరతనాన్ని ఎదిరిస్తూ చేస్తున్న పోరాటానికి మన్యం ప్రజలను "తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా" అని పిలిచి, వారనుభవిస్తున్న కష్టాల్ని తెలియజేస్తాడు. వారినుండి పూజలందుకుంటాడు. అందుకు మన్యం ప్రజలంతా ఏకకంఠంతో సంఘీభావాన్ని తెలియజేస్తున్న సంఘటనను ఈ పాట ప్రతిబింబిస్తుంది. చివరగా వారంతా రాజుకు తోడుగా నిలుస్తామని బాస చేస్తారు.
పాట
[మార్చు]తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా ||| తెలుగువీర లేవరా |||
దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా ||| దారుణ |||
నీతిలేని శాసనాలు నేటినుంచి రద్దురా ||| నీతిలేని |||
నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా ||| నింగి నీకు ||| ||| తెలుగువీర లేవరా |||
ఎవడువాడు ఎచటివాడు ఇటువచ్చిన తెల్లవాడు ||| ఎవడువాడు |||
కండబలం, కొండఫలం కబళించే దుండగీడు
మానధనం, ప్రాణధనం దోచుకునే దొంగవాడు ||| ఎవడువాడు |||
తగినశాస్తి చేయరా తరిమి తరిమి కొట్టరా ||| తగినశాస్తి ||| ||| తెలుగువీర లేవరా |||
ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి ||| ఈ దేశం |||
ప్రతి మనిషీ తొడలుగొట్టి, శృంఖలాలు పగులగొట్టి
చురకత్తులు పదునుబట్టి, తుదిసమరం మొదలుపెట్టి
సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి వందేమాతరం ||| తెలుగువీర లేవరా |||
అవార్డులు
[మార్చు]- ఈ పాటకు గాను శ్రీరంగం శ్రీనివాసరావు కు జాతీయ స్థాయిలో ఉత్తమ పాటల రచయిత అవార్డు లభించింది.