క్యారట్ మెంతి పచ్చడి
స్వరూపం
క్యారట్ మెంతి పచ్చడి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో ఒక పేరుపొందిన పచ్చడి. దీనిని ఇప్పుడు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
కావలసిన పదార్థాలు
[మార్చు]- క్యారెట్లు - 2
- మెంతి ఆకు - 1 కప్పు
- మినప్పప్పు, శనగపప్పు - 1 టేబుల్ స్పూను చొప్పున
- జీలకర్ర - 1 టీ స్పూను
- ఆవాలు - అర టీ స్పూను
- ఎండుమిర్చి - 2
- వెల్లుల్లి రేకలు - 5
- పచ్చిమిర్చి - 2
- బెల్లం తురుము - 1 టేబుల్ స్పూను
- ఉప్పు - రుచికి తగినంత
- నిమ్మరసం - 1 టేబుల్ స్పూను
- నూనె - 1 టేబుల్ స్పూను
- తాలింపు దినుసులు - సరిపడినన్ని.
తయారుచేసే విధానం
[మార్చు]- అర టీ స్పూను నూనెలో వెల్లుల్లి, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు దోరగా వేగించి పక్కనుంచాలి.
- అదే కడాయిలో టీ స్పూను నూనెలో పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు (పచ్చివాసన పోయేవరకు) 4 నిమిషాలు వేగించి తీసెయ్యాలి.
- మరో అర టీ స్పూను నూనెలో మెంతి ఆకులు కూడా వేగించాలి.
- వేగించుకున్న వరసలోనే మిక్సీలో పప్పులు, క్యారెట్ ముక్కలు, మెంతి ఆకులు ఒక్కొక్కటిగా వేస్తూ రుబ్బుకోవాలి.
- తర్వాత తాలింపుతో పాటు నిమ్మరసం కలుపుకోవాలి.
- వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి బాగుంటుంది.