తంబుర
స్వరూపం
తంబుర (Tambura) ఒక విధమైన తంత్రీ వాద్య పరికరం. ఇది చూడడానికి వీణ మాదిరిగా ఉంటుంది.
తంబుర అనగా ఒక తంత్రీ వాయిద్యం. ఇందులో చాల రకాలున్నాయి . సొరకాయ బుర్రతో చేసిన వాటికి రెండు లేద ఒక తంత్రి మాత్రమే వుంటుంది. వీటిని తత్వాలు పాడేవారు ఎక్కువగా వాడుతారు. దీనిని వాడటానికి ప్రక్క వాయిద్యాలతో పని లేదు. కేవలం తాళాలు మాత్రం ప్రక్క వాయిద్యంగా వుంటే సరిపోతుంది. ఇంకో రకం : దీనికి అనేక తంత్రులు కలిగి కర్రతో చేసినదై ఉంటుంది . వీటిని బుర్ర కథకులు, ఒగ్గు కథకులు ఉపయోగిస్తారు. దీనిని ప్రక్కవాయిద్యాల తోనే ఉపయోగిస్తారు. దీనికి ప్రక్కవాయిద్యం తప్పని సరిగా గుమ్మెత్త వుంటుంది.
Look up బంబుర in Wiktionary, the free dictionary.