పండిట్ రవిశంకర్
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
పండిట్ రవి శంకర్ | |
---|---|
![]() Ravi Shankar playing his sitar. | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | రవి శంకర్ |
రంగం | హిందుస్తానీ సంగీతం |
వృత్తి | కంపోజర్, సితార్ విద్వాంసుడు |
వాయిద్యాలు | సితార్ |
క్రియాశీల కాలం | 1939 – 11 డిసెంబర్ 2012 |
లేబుళ్ళు | ఏంజిల్, డార్క్ హార్స్ రికార్డ్స్, HMV, en:Private Music |
సంబంధిత చర్యలు | ఉస్తాద్ అల్లారఖా యహూదీ మెనూహిన్ |
వెబ్సైటు | రవిశంకర్.ఆర్గ్ |
ముఖ్యమైన సాధనాలు | |
సితార్ |
పండిట్ రవి శంకర్ (దేవనాగరి: रविशंकर, "పండిట్" = "learned"), ఏప్రిల్ 7, 1920లో గాజీపూర్ లో జన్మించాడు. ఇతడు అల్లాయుద్దీన్ ఖాన్, హిందూస్థానీ సంగీతంలో మైహార్ ఘరానా స్థాపకులు యొక్క శిష్యుడు.[1] సితార్ వాయిద్యం ద్వారా అనేక ప్రయోగాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంగీత కచేరీలు, ప్రదర్శనలు ఇచ్చిన సంగీతజ్ఞుడు. ఫ్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని శాండియాగోలోని స్క్రిప్స్ మెర్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 7, 1920లో వారణాసిలో జన్మించిన రవిశంకర్ హిందుస్థాని క్లాసికల్ సంగీతంలో పలు అవార్డులు అందుకున్నారు. మూడు సార్లు గ్రామీ పురస్కారం పొందారు. 1999లో రవిశంకర్‌ను ప్రభుత్వం అత్యున్నత పురస్కారం 'భారత రత్న'తో సత్కరించింది.
రవిశంకర్ అసలు పేరు రబింద్రో శౌంకోర్ చౌదురి. తన బాల్యంలో నృత్యం నేర్చుకునేందుకు సోదరుడు ఉదయ్‌శంకర్‌తో కలిసి యూరప్ వెళ్లాడు. 1938లో నృత్యాన్ని పక్కనబెట్టి సితార్ నేర్చుకోవడానికి అల్లాద్దిన్ ఖాన్ అనే విద్వాంసుడి వద్ద చేరాడు. 1944లో చదువు అనంతరం మ్యూజిక్ కంపోజర్‌గా జీవితాన్ని ప్రారంభించి సత్యజిత్‌రే 'అప్పు' చిత్రానికి పనిచేశారు. 1949 నుంచి 1956 వరకు సంగీత దర్శకునిగా ఢిల్లీ ఆల్ ఇండియా రేడియోకు సేవలు అందించారు.
1956 నుంచి యూరప్, అమెరికాలో హిందుస్థాని క్లాసికల్ సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. బోధన, పదర్శనల ద్వారా హిందుస్థాని క్లాసికల్ సంగీతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చారు. తన కూతురు అనౌష్కతో కలిసి సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. 2003లో అనౌష్క తన మ్యూజిక్ అల్బమ్ ద్వారా గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యారు.
అవార్డులు:
1975లో యునెస్కో సంగీత పురస్కారం 1981లో పద్మవిభూషణ్ పురస్కారం 1988లో కాళిదాస్ సమ్మాన్ పురస్కారం 1992లో రామన్ మెగసేసే పురస్కారం ఫండిట్
1999లో అత్యున్నత పురస్కారం భారతరత్న
1986 నుంచి 1992 వరకూ రాజ్యసభలో నామినేటెడ్ సభ్యునిగా వ్యవహరించారు
మూలాలు[మార్చు]
- ↑ "Ravi Shankar - Biography". Archived from the original on 2012-06-29. Retrieved 2008-05-20.
ఇతర విశేషాలు[మార్చు]
- ఈయనకు భారత ప్రభుత్వం 1999 లో భారతరత్న బిరుదుతో సత్కరించినది.
- ఈయనకు భారత ప్రభుత్వం 1981 లో పద్మ విభూషణ్ పురస్కారం తో సత్కరించినది.
మూలాలు[మార్చు]
- బిందు జాబితా అంశం
బయటి లింకులు[మార్చు]
- విస్తరించవలసిన వ్యాసాలు
- భారతరత్న గ్రహీతలు
- రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలు
- AC with 15 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- పశ్చిమ బెంగాల్ వ్యక్తులు
- పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు
- 1920 జననాలు
- సితార్ విద్వాంసులు
- సుప్రసిద్ద సంగీతకారులు
- కాళిదాస్ సమ్మాన్ గ్రహీతలు