మమతా శంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మమతా శంకర్
মমতা শঙ্কর
2014లో మమతా శంకర్
జననం (1955-01-07) 1955 జనవరి 7 (వయసు 69)
జాతీయతఇండియన్
వృత్తి
  • డాన్సర్
  • కొరియోగ్రాఫర్
  • యాక్టర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నటన, నృత్యం, ఉదయన్ కళాకేంద్రం
జీవిత భాగస్వామిచంద్రోదయ్ ఘోష్
పిల్లలురతుల్ శంకర్,
రజిత్ శంకర్ ఘోష్
వెబ్‌సైటుhttps://www.mamatashankardancecompany.org/
మమతా శంకర్ మృగయా సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది.[1]

మమతా శంకర్ (జననం 1955 జనవరి 7) భారతీయ నటి, నర్తకి. ఆమె బెంగాలీ సినిమాలలో నటించి ప్రసిద్ధి చెందింది. సత్యజిత్ రే, మృణాల్ సేన్, రితుపర్ణో ఘోష్, బుద్ధదేబ్ దాస్‌గుప్తా, గౌతమ్ ఘోష్‌.. ఇలా చాలమంది ప్రముఖ దర్శకుల చిత్రాలలో ఆమె నటించింది. నటిగానే కాకుండా, ఆమె నర్తకి, కొరియోగ్రాఫర్ కూడా. ఆమె సంగీత విద్వాంసుడు పండిట్ రవిశంకర్ మేనకోడలు. ఆమె సోదరుడు ఆనంద శంకర్ ఇండో-వెస్ట్రన్ ఫ్యూజన్ సంగీతకారుడు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

మమతా శంకర్ 1955 జనవరి 7న నర్తకులు ఉదయ్ శంకర్, అమలా శంకర్ దంపతులకు జన్మించింది.[2] ఆమె కలకత్తాలోని ఉదయ్ శంకర్ ఇండియా కల్చర్ సెంటర్‌లో అమల శంకర్ ఆధ్వర్యంలో డ్యాన్స్, కొరియోగ్రఫీలో శిక్షణ పొందింది.[3]

కెరీర్[మార్చు]

మమతా శంకర్ 1976లో మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన మృగయాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

ఉదయన్ - మమతా శంకర్ డ్యాన్స్ కంపెనీని 1986లో ఆమె స్థాపించింది. అలాగే 1978లో 'మమతా శంకర్ బ్యాలెట్ ట్రూప్' స్థాపించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించింది. ఈ బృందం 1979లో రవీంద్రనాథ్ ఠాగూర్ రచన చండాలికా ప్రదర్శించింది.[4] దాని తర్వాత హోరిఖేలా, ఆజ్కేర్ ఏకలాబ్య, మిలాప్, షికార్, మదర్ ఎర్త్, అమృతస్యపుత్ర, శబరి వంటివి ఎన్నో ప్రదర్శించారు.[5][6]

వ్యక్తిగత జీవితం[మార్చు]

మమతా శంకర్‌కు చంద్రోదయ్ ఘోష్ తో వివాహం జరిగింది. ఆమెకు రతుల్ శంకర్, రజిత్ శంకర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

అవార్డులు[మార్చు]

1992: జాతీయ చలనచిత్ర అవార్డు – ప్రత్యేక జ్యూరీ అవార్డు (ఫీచర్ ఫిల్మ్) - అగంతుక్

1993: BFJA అవార్డు-ఉత్తమ సహాయ నటి అవార్డు - శాఖ ప్రశాఖ

2000: BFJA అవార్డు-ఉత్తమ సహాయ నటి అవార్డు - ఉత్సాబ్

మూలాలు[మార్చు]

  1. Lokapally, Vijay (16 May 2013). "Mrigayaa (1976)". The Hindu. Retrieved 13 August 2021.
  2. She was the niece of musician Pandit Ravi Shankar. Her brother, Ananda Shankar, was an Indo-Western fusion musician.
  3. Milestones Official biography.
  4. Dialogues in dance discourse: creating dance in Asia Pacific, by Mohd. Anis Md. Nor, World Dance Alliance, Universiti Malaya. Pusat Kebudayaan. Published by Cultural Centre, University of Malaya, 2007. ISBN 983-2085-85-3. Page 63.
  5. She enjoys the reputation of a classic ‘modern’ dancer The Tribune, 27 March 2006.
  6. "Mamata Shankar". mamatashankardancecompany.org. Retrieved 1 September 2015.