Jump to content

గౌతమ్ ఘోష్

వికీపీడియా నుండి
2005 ఫిబ్రవరి 2, న్యూ ఢిల్లీలో జరిగిన 51 వ జాతీయ చలనచిత్ర అవార్డు కార్యక్రమంలో 2004 సంవత్సరానికి ఉత్తమ దర్శకత్వ అవార్డును రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం, గౌతమ్ ఘోస్ (చిత్రం అబార్ ఆరణ్యే) కు అందజేసిన చిత్రం.

గౌతమ్ ఘోష్ ప్రఖ్యాత భారతీయ సినిమా దర్శకుడు; మంచి ఫోటో జర్నలిస్ట్ కూడా. అతడు 1950 వ సంవత్సరంలో కోల్‌కతాలో జన్మించాడు. బెంగాలీలకు సహజంగా ఘోష్ ఇంటిపేరుగా ఉంటుంది.

సినిమా ప్రస్థానం

[మార్చు]

గౌతమ్ ఘోష్ కలకత్తా యునివర్సిటీ నుండి పట్టా పొంది, సినిమాలలో ప్రవేశించాడు.అతని మొదటి సినిమా- మా భూమి, తెలుగులో తీసింది. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాంకు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా చాలా రోజులు తెలుగు నాట ఆడింది. అతని సినిమాలన్నీ సామాజిక స్థితిగతులనే ప్రతిబింబిస్తుంటాయి.

ముఖ్యమైన సినిమాలు

[మార్చు]
  • మా భూమి ( 1979 )
  • దఖల్ ( 1981 )
  • పార్ ( 1984 )
  • అంతర్జలి జాత్రా ( 1987 )
  • పద్మ నాదిర్ మఝి ( 1992 )
  • పతంగ్ ( 1993 )
  • గుడియా ( 1997 )
  • అబర్ అరణ్యె ( 2003 )
  • యాత్రా ( 2006 )
  • కాల్ బేలా ( 2009 )
  • సంగెమీల్ సె ములాఖత్ ( షెహనాయ్ విద్వాంసుడు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పై తీసిన డాక్యుమెంటరీ )

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]