అమలా శంకర్
అమలా శంకర్ | |
---|---|
జననం | అమలా నంది 1919 జూన్ 27 మగురా జిల్లా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిషు భారతదేశం |
మరణం | 2020 జూలై 24 | (వయసు 101)
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నర్తకి, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1948 |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | ఆనంద శంకర్, మమతా శంకర్ |
తల్లిదండ్రులు | అఖోయ్ కుమార్ నంది (తండ్రి) |
అమలా శంకర్ (1919 జూన్ 27 - 2020 జూలై 24) [1] భారతీయ నర్తకి. [2] ఆమె నర్తకి, నృత్య రూపకర్త అయిన ఉదయ్ శంకర్ భార్య. సంగీత విద్వాంసుడు ఆనంద శంకర్, నర్తకి మమతా శంకర్ ల తల్లి.[3], సంగీతకారుడు, స్వరకర్త రవిశంకర్ వదిన.[4][5] భర్త ఉదయ్ శంకర్ రచన, సహనిర్మాత, దర్శకత్వం వహించిన కల్పన చిత్రంలో అమల శంకర్ నటించింది. ఆమె 2020 జూలై 24 న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 101 సంవత్సరాల వయస్సులో మరణించింది.[6]
జీవిత చరిత్ర
[మార్చు]అమలా శంకర్ బ్రిటిషు భారతదేశం (నేటి బంగ్లాదేశ్), బెంగాల్ ప్రెసిడెన్సీలో మగురా జిల్లాలోని బటాజోర్ గ్రామంలో 1919 జూన్ 27 న అమలా నందిగా జన్మించింది. ఆమె తండ్రి అఖోయ్ కుమార్ నంది తన పిల్లలు ప్రకృతిపై, గ్రామాలపై ఆసక్తి కలిగి ఉండాలని కోరుకున్నాడు.[7] 1931 లో, 11 సంవత్సరాల వయస్సులో ఆమె, పారిస్‌లోని అంతర్జాతీయ కలోనియల్ ఎగ్జిబిషన్‌కు వెళ్ళింది. ఇక్కడ ఆమె ఉదయ్ శంకర్‌ను, అతని కుటుంబాన్నీ కలిసింది. ఆ సమయంలో అమల ఫ్రాక్ వేసుకుంది. ఉదయ్ శంకర్ తల్లి హేమాంగినీ దేవి ఆమెకు కట్టుకోవడానికి చీరను ఇచ్చింది. ఆమె ఉదయ్ శంకర్ నృత్య బృందంలో చేరి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శన ఇచ్చింది.[3]
1939లో ఉదయ్ శంకర్ డ్యాన్స్ గ్రూప్‌తో చెన్నైలో ఉంటున్నప్పుడు, ఒకరోజు రాత్రి అమల వద్దకు వచ్చి పెళ్లి ప్రతిపాదన చేసాడు.[8] 1942 లో వాళ్ళ పెళ్ళి జరిగింది.[8] వారి మొదటి కుమారుడు ఆనంద శంకర్ 1942 డిసెంబరులో జన్మించాడు [9] కుమార్తె మమతా శంకర్ 1954 జనవరిలో జన్మించింది.[10] ఉదయ్ శంకర్, అమలా శంకర్ చాలా కాలం పాటు ప్రసిద్ధ నృత్య జంటగా వెలిగారు. కానీ, తరువాత ఉదయ్ శంకర్ తన బృందంలోని ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. అతను అమల లేకుండా చండాలికను నిర్మించాడు.[3] ఉదయ్ శంకర్ 1977 లో మరణించారు. అంతకు కొన్ని సంవత్సరాలు ముందు నుండీ, ఈ జంట విడిగా ఉన్నారు.[3] 2012 నాటికి, అమలా శంకర్ చురుకుగా కృషిచేస్తోంది. ఆమె కుమార్తె మమత, కోడలు తనుశ్రీ శంకర్‌తో కలిసి శంకర్ ఘరానాను సజీవంగా ఉంచింది.[3] ఆమె సితార వాయిద్యకారుడైన రవిశంకర్‌కి వదిన.[11] ఆమె తొంభైల వరకు చురుకుగా ఉంది. 92 సంవత్సరాల వయస్సులో తన చివరి ప్రదర్శన అయిన సీతా స్వయంవర్ అనే నృత్య నాటకంలో ఆమె రాజు జనక పాత్రను పోషించింది.[12]
అమల శంకర్ కల్పన (1948) చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి రచన, సహనిర్మాత, దర్శకుడూ అయిన ఉదయ్ శంకర్ కూడా ఈ చిత్రంలో కనిపించాడు. ఉమ పాత్రలో అమల నటించింది. 2012 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శించబడినపుడు అమలా శంకర్ హాజరయ్యారు. అమలా శంకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ– " 2012 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ... కేన్స్ ఫెస్టివల్లో నేను అతి పిన్న వయస్కురాలిని... 81 ఏళ్ల తర్వాత మళ్లీ కేన్స్‌ని సందర్శిస్తున్నాను..." [8]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | దర్శకుడు | సహనటులు |
---|---|---|---|
1948 | కల్పన | ఉదయ్ శంకర్ | లక్ష్మీకాంత, ఉదయ్ శంకర్ |
సూచనలు
[మార్చు]- ↑ Kaura, Ajīta (1976). Directory of Indian Women Today, 1976. India International Publications. p. 45.
- ↑ "Biography of Amala Shankar". Archived from the original on 26 January 2013. Retrieved 16 December 2012.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 "Amala Shankar: The Muse". March 2012. Retrieved 16 December 2012.
- ↑ "Panditji never restricted himself to his craft alone". Asian Age. 13 December 2012. Archived from the original on 31 జూలై 2019. Retrieved 16 December 2012.
- ↑ "Sitarist and composer Ravi Shankar has died near his home in southern California". Reuters. 12 December 2012. Archived from the original on 7 March 2016. Retrieved 16 December 2012.
- ↑ Singh, Shiv Sahay (24 July 2020). "Eminent danseuse Amala Shankar passes away at 101 in Kolkata". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 24 July 2020.
- ↑ "On life with a legend". The Hindu. 1 February 2009. Archived from the original on 2 February 2009. Retrieved 16 December 2012.
- ↑ 8.0 8.1 8.2 "A Romantic Forever:Amala Shankar". Magna Magazines. Archived from the original on 28 జనవరి 2013. Retrieved 16 December 2012.. Magna Magazines. Archived from the original on 28 January 2013. Retrieved 16 December 2012.
- ↑ Sruti. P.N. Sundaresan. 1999. p. 51. Retrieved 16 December 2012.
- ↑ "Mamata Shankar biography". Mamata Shankar's website. Retrieved 16 December 2012.
- ↑ Ghosh, Dibyendu (December 1983). "Ravishankar". In Ghosh, Dibyendu (ed.). The Great Shankars. Kolkata: Agee Prakashani. p. 55. OCLC 15483971.
- ↑ "Eminent danseuse Amala Shankar passes away at 101 in Kolkata". The Hindu. Retrieved 31 July 2020.