తనుశ్రీ శంకర్
తనుశ్రీ శంకర్ | |
---|---|
జననం | 1956 మార్చి 16 |
వృత్తి | నర్తకి, కొరియోగ్రాఫర్ |
తనుశ్రీ శంకర్ (జననం: 1956, మార్చి 16) [1] భారతీయ నర్తకి, కొరియోగ్రాఫర్. ఆమె కోల్‌కతాలో నివసిస్తుంది. ఆమె 1970, 1980లలో ఆనంద శంకర్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో ప్రముఖ నర్తకి. ఆమె ది నేమ్‌సేక్ వంటి వివిధ చిత్రాలలో కూడా నటించింది.
తనుశ్రీ శంకర్ ఇప్పుడు తనుశ్రీ శంకర్ డాన్స్ కంపెనీకి నేతృత్వం వహిస్తున్నారు.[2] సంప్రదాయ భారతీయ నృత్యాలను ఆధునిక పాశ్చాత్య బ్యాలెట్ వ్యక్తీకరణలతో ముడిపెట్టడం ద్వారా ఆమె తనదైన ఆధునిక పదజాలాన్ని అభివృద్ధి చేశారు. ఆమె తన వంశం నుండి భారతదేశం యొక్క జానపద, ప్రాంతీయ నృత్య రూపాల నుండి ప్రేరణ పొందింది. ఆమె "థాంగ్-తా" (మణిపురి ఖడ్గం నృత్యం) వంటి గొప్ప స్థానిక భారతీయ సంప్రదాయాల నుండి విస్తృతంగా పొందింది.
ఆమె తన బృందంతో కలిసి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ సంగీతం ఆధారంగా రూపొందిన ఉత్తరన్ (ఆత్మ ఉద్ధరణ), చిరంతన్ (శాశ్వతం) ఆమె చివరి చిత్రాలలో ముఖ్యమైనవి.
కుటుంబం
[మార్చు]కలకత్తాలో జన్మించిన తనుశ్రీ శంకర్ తండ్రి ఇండియన్ ఆర్మీలో డాక్టర్.[3] ఆమె భర్త దివంగత ఆనంద శంకర్ ఫ్యూజన్ సంగీతంలో ప్రయోగాలు చేసిన సంగీత దర్శకుడు. ఆనంద శంకర్, నృత్యకారులు పండిట్ ఉదయ్ శంకర్, అమలా శంకర్ ల కుమారుడు. సితార్ విద్వాంసుడు రవిశంకర్ అతనికి బాబాయి. ఈమెకు ఒక కుమార్తె - శ్రీనంద శంకర్.
అవార్డులు
[మార్చు]- సంగీత నాటక అకాడమీ అవార్డు, 2011 [4]
మూలాలు
[మార్చు]- ↑ "Tanushree Shankar". sangeetnatak.gov.in. Retrieved 5 March 2021.
- ↑ "TANUSREE SHANKAR DANCES DOWN MEMORY LANE". www.telegraphindia.com.
- ↑ "TANUSREE SHANKAR DANCES DOWN MEMORY LANE". telegraphindia.com. Retrieved 5 March 2021.
- ↑ "Akademi awards for 47 personalities". deccanherald.com. Retrieved 5 March 2021.