ఒకనాటి రాత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక నాటి రాత్రి
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.భానుమతి
తారాగణం పి.భానుమతి, చక్రపాణి
సంగీతం పి.భానుమతి
నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్
భాష తెలుగు

"ఒకనాతి రాత్రి" 1980లో నిర్మితమైన ఒక తెలుగు చిత్రం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం - పి.భానుమతి. ఇది ఒక అపరాధ పరిశోధన కథ.

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

ట్రెయిన్ లో ప్రయాణిస్తున్న భానుమతి అనుకోకుండా పక్కనే వెళ్తున్న మరో ట్రెయిన్ లో జరిగిన ఒక హత్య చూస్తుంది. దాన్ని గురించి అన్వేషిస్తూ, అసలా హత్య తాలూకా కుటుంబాన్ని కనిపెట్టీ, వాళ్ళింట్లో వంటమనిషిగా చేరుతుంది. తరువాత అసలా హత్యకు గురైన మనిషి ఎవరు? వాళ్ళ నేపథ్యం ఏమిటి? ఇత్యాది విషయాలు పరిశోధించి, సాధిస్తుంది.'

వనరులు[మార్చు]

"ఒక నాటి రాత్రి" చిత్ర వీసీడీ, ఆదిత్య వీడియోస్, హైదరాబాదు.