మనవడి కోసం
మనవడి కోసం (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | భానుమతీ రామకృష్ణ |
తారాగణం | భానుమతీ రామకృష్ణ, పండరీబాయి |
నిర్మాణ సంస్థ | భరణి పిక్చర్స్ |
భాష | తెలుగు |
మనవడి కోసం 1977లో విడుదలైన తెలుగు సినిమా. భరణి పిక్చర్స్ పతాకంపై భానుమతి రామకృష్ణ ఈ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించింది. భానుమతి, పండరీబాయి, రోజారమణి లు ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు భానుమతీ రామకృష్ణ సంగీతాన్నందించింది.[1]
కథ
[మార్చు]అన్నపూర్ణమ్మకు అర్జంటుగా ఒక మనవడు కావాలి. ఏకైక పుత్రరత్నం శ్రీధర్ పెళ్ళి చేసుకుంటే కాని ఈ కోర్కె తీరదు. మాట రాగానే పారిపోయే శ్రీధర్ కు ఒప్పించి పెళ్ళి చేస్తుంది. అతని భార్య లక్ష్మి మంచిదే అయినా మంగమ్మ మాటలు విని గర్భ నిరోధక మాత్రలు వేసుకుంటుంది. ఇది తెలిసి అన్నపూర్ణమ్మ కాళికావతారం ఎత్తి కోడలుని గెంటివేస్తుంది. లక్ష్మి తల్లి లక్ష్మిని చివాట్లువేసి డాక్టరు దగ్గరకు తీసుకొని వెళుతుంది. లక్ష్మికి అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదని డాక్టరు చెబుతుంది. మనవడి కోసం వేణు గోపాలునికి మొక్కుకున్న అన్నపూర్ణమ్మకు గుండెల్లో రాయి పడింది. అన్నపూర్ణమ్మ కోరిక తీరడం కోస్ం లక్ష్మి వచ్చి ఒక ఉపాయం చెబుతుంది. కొడుకుకి రెండవ పెళ్ళి చేసి మనవడిని పొందుతుంది. కానీ రెండవ కోడలు మనవడిని తాకనివ్వదు. అప్పుడు అవ్వ పడే ఆరాటం ఈ కథలో ఉంది.
తారాగణం
[మార్చు]- భానుమతి - అన్నపూర్ణాదేవి
- పండరీబాయి
- రోజారమణి - శారద
- విజయభాను
- ఛాయాదేవి
- విధుబాల (తొలిపరిచయం) - లక్ష్మి
- శ్రీధర్ - శ్రీధర్
- కాంతారావు
- త్యాగరాజు
- పద్మనాభం
- నగేష్
సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, సంగీతం, దర్శకత్వం: భానుమతి
- మాటలు: డి.వి.నరసరాజు
- పాటలు: దాశరథి, శ్రీశ్రీ, కొసరాజు
- ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
- కూర్పు: హరినారాయణ
- స్టూడియో: భరణి పిక్చర్స్
- విడుదల తేదీ: ఏప్రిల్ 1, 1977
పాటల జాబితా
[మార్చు]1 . ఆనంద భవనం యమునాతీరంలో నీ మందిరమే, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పాలువాయి భానుమతి
2.కృష్ణా ఒక వరమివ్వాలి నీవే మనవడివై మా ఇంట దోగాడాలి, రచన: దాశరథి, గానం.పి.భానుమతి
3.నీకు నేను కావాలి నాకు నీవు కావాలి, రచన: వేటూరి సుందర రామమూర్తి , గానం.బొడ్డుపల్లి బాల వసంత, ప్రతివాది భయంకర శ్రీనివాస్
4.బంగారు ఊయలలో అందాల నీ చెలితో , రచన: దాశరథి, గానం.శిష్ట్లా జానకి
5.వినరయ్యా బాబుల్లారా నామాట, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పాలువాయి భానుమతి
6.ఏమయ్యా కృష్ణయ్యా ఈ శోధన ఏలయ్యా, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పాలువాయి భానుమతి
7 . మహిళలు సుదినమాయే భూలోకం సంకల్పం శక్తిమయం, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు,గానం. పి.లీల, పాలువాయి భానుమతి
8.మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో , రచన: రాండర్ గాయ్ , గానం.ఉషా ఉతుప్, పి.భానుమతి .
బాహ్య లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Manavadi Kosam (1977)". Indiancine.ma. Retrieved 2020-08-31.
2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.