చక్రపాణి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రసిద్ధ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు, నిర్మాత గురించిన వ్యాసం కోసం "చక్రపాణి" చూడండి.

చక్రపాణి
(1954 తెలుగు సినిమా)
Chakrapani poster.jpg
దర్శకత్వం పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాణం పి.ఎస్.రామకృష్ణారావు,
భానుమతి
తారాగణం చిలకలపూడి సీతారామాంజనేయులు,
అక్కినేని నాగేశ్వర రావు,
పి.భానుమతి,
ఎస్.వి.రంగారావు,
సి.ఎస్ రాజకుమారి,
సూర్యకాంతం,
అమర్‌నాథ్,
కంచి నరసింహారావు,
టి.జి.కమలాదేవి
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
భానుమతి
సంభాషణలు రావూరి వెంకట సత్యనారాయణరావు
నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్
నిడివి 171 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

చక్రపాణి మంచి హాస్యభరితమైన తెలుగు సినిమా. దీనిని భరణీ పిక్చర్స్ పతాకంపై భానుమతీ రామకృష్ణారావులు నిర్మాతలుగా నిర్మించారు. ప్రధాన పాత్రల్ని అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి పోషించారు.

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

చక్రపాణి (సి.ఎస్.ఆర్.) కి ఒక మనవడు, ముగ్గురు మనవరాళ్ళు. మనవడు ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. పెళ్ళైన ఇద్దరు మనవరాళ్ళలో ఎవరు ముందుగా మనవణ్ణి ఇస్తే వారికి లక్ష రూపాయలు ఇస్తానని చక్రపాణి ప్రకటిస్తాడు. అతని మొదటి మనవరాలికి ఆడపిల్ల. రెండవ మనవరాలు మాలతి (భానుమతి), ఆమె భర్త చలం (అక్కినేని). మాలతి ఎలాగైనా లక్ష రూపాయలు సంపాదించాలని స్నేహితురాలు మనోరమ (సూర్యకాంతం) సలహాపై ఎదురింట్లో ఉన్న బాబును తీసుకొచ్చి తాతకు తన కొడుకుగా చెబుతుంది. భర్త పొరుగూరు వెళ్ళి తిరిగి వచ్చేలోగా మరొకర్ని (అమర్ నాథ్) భర్తగా కుదురుస్తుంది. అసలు భర్త చలం వచ్చాక అతన్ని వంటవానిగా పరిచయం చేస్తుంది. ఇద్దరు భర్తలకు మధ్య గందరగోళం, ఘర్షణ మూలంగా లక్ష కోసం కొంతకాలం ఓర్చుకోమని చలాన్ని కోరుతుంది. ఇంతలో చక్రపాణికి ఆ పసివాడు ఆమె కొడుకు కాదని, ఏనాడో దూరమైన తన మనవడి సంతానం అని తెలుస్తుంది. కథంతా కామెడీగా కొనసాగుతుంది.

పాటలు[మార్చు]

  1. మీనాక్షీ మే ముదం దేహి - పి. భానుమతి
  2. మెల్లమెల్లగా చల్లచల్లగా రావే నిదుర హాయిగ - పి. భానుమతి
  3. నగుమోము గనలేని నా జాలి తెలిపి - పి. భానుమతి
  4. నన్నుజూచి ఇంత జాలి ఏలనమ్మ మాలతి - పి. భానుమతి
  5. ఓ ప్రియురాల ఓ జవరాల పలుకవేలనే - ఎ. ఎమ్. రాజా
  6. ప్రక్కల నిలబడి కొలిచేవు జాడ బాగా - పి. భానుమతి
  7. ఉయ్యాల జంపాల లూగరావయా - పి. భానుమతి