భానుమతీ రామకృష్ణ

వికీపీడియా నుండి
(పి. భానుమతి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భానుమతీ రామకృష్ణ
భానుమతీ రామకృష్ణ
జననం
భానుమతీ రామకృష్ణ

సెప్టెంబరు 7, 1926
మరణండిసెంబరు 24, 2005
చెన్నై
ఇతర పేర్లుభానుమతి
వృత్తిసినిమా నటి,
నిర్మాత,
దర్శకురాలు,
స్టూడియో అధినేత్రి,
రచయిత్రి,
గాయని
సంగీత దర్శకురాలు.
జీవిత భాగస్వామిపి.యస్. రామకృష్ణారావు
పిల్లలుభరణి (కుమారుడు)
తల్లిదండ్రులు
  • బొమ్మరాజు వెంకటసుబ్బయ్య (తండ్రి)

భానుమతీ రామకృష్ణ (సెప్టెంబరు 7, 1926 - డిసెంబరు 24, 2005) దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. మల్లీశ్వరి, సారంగధర,విప్రనారాయణ, బొబ్బిలి యుధ్ధం, మంగమ్మ గారి మనవడు , పెళ్ళికానుక వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఈమె ఒంగోలులో జన్మించింది. ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది. తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటరు అయిన పి. ఎస్. రామకృష్ణారావును వివాహమాడింది. తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారీ దంపతులు. భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. కళారంగానికి ఆమె అందించిన సేవలకుగాను 1966 లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం 2001 లో పద్మభూషణ్ పురస్కారం అందుకుంది.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

భానుమతి 1926 వ సంవత్సరం సెప్టెంబరు 7 ప్రకాశం జిల్లా, ఒంగోలులో జన్మించింది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య, శాస్త్రీయ సంగీత ప్రియుడు, కళావిశారదుడు.[2] భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరు ప్రాయంనాడే 1939 లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడు. హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.

ఆమె 1943, ఆగష్టు 8 న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటర్ పి.యస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడింది. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.

చదువు పై ఆసక్తి తో భానుమతి 40 సంవత్సరాల వయస్సు దాటాక మెట్రిక్, పి.యు.సి మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలు అయింది. భానుమతి అభిమాని అయిన నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్] ఆమెను లోకసభకు పోటీ చేయమని సూచన చేశారు, రాజకీయాలు తమకు పడవని భానుమతి దంపతులు సున్నితంగా తిరస్కరించారు.ఉల్లేఖన లోపం: <ref> ట్యాగుకు, మూసే </ref> లేదు..

భానుమతి కేవలము నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నది. ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్ధవంతంగా నిర్వర్తించింది. దక్షిణాది నుంచి హిందీ చిత్రసీమకు వెళ్లిన తొలి సినీతార భానుమతి. ఆ రోజుల్లోనే పాన్ ఇండియా ఘనత సాధించింది. అపూర్వ సహోదరులు, మంగళ, చండీరాణి లాంటి చిత్రాలు ఏక కాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో త్రిభాషా చిత్రాలుగా రూపొంది ఘన విజయం సాధించాయి.[3]

అవార్డులు

[మార్చు]
పద్మశ్రీ పురస్కారం
భానుమతి కుమారుడు భరణి, భానుమతి 1999 హైదరాబాదులో అంతర్జాతీయ చిత్రోత్సవం సమయములో పత్రికా సమావేశం నందు తీసిన చిత్రం
  • 1956లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ పురస్కారము
  • మూడు సార్లు జాతీయ అవార్డులు (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు, పల్నాటి యుద్ధం అను తెలుగు సినిమాలకు)
  • అన్నాదురై నడిప్పుకు ఇళక్కనం (నటనకు వ్యాకరణం) అని బిరుదు ఇచ్చి గౌరవించాడు.
  • తమిళ అభిమానులు అష్టావధాని అని కీర్తిస్తూ, ఈమె బహుముఖ ప్రజ్ఞను తలచుకుంటూ ఉంటారు
  • 1966లో ఆమె వ్రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి, భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది.
  • ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.
  • 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది.
  • 1984లో కలైమామణి బిరుదుతో తమిళనాడు లోని ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది.
  • బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో 1984 ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది.
  • 1984లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
  • 1986లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది.
  • 1986లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది.
  • 2001 లో పద్మ భూషణ్ పురస్కారం [1]
  • 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలయిన 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలాబిళ్ళలలో ఒకటి భానుమతి ది.
భానుమతి జ్ఞాపకార్ధం విడుదలయిన తపాలాబిళ్ళ

భానుమతి రచనలు

[మార్చు]

భానుమతి సినిమాల జాబితా

[మార్చు]
  1. పెళ్ళికానుక (1998) .... సావిత్రమ్మ
  2. చామంతి (1992)
  3. చెంబరుతి (1992)
  4. పెద్దరికం (1992) .... అడుసుమిల్లి బసవపున్నమ్మ
  5. సామ్రాట్ అశోక్ (1992)
  6. బామ్మ మాట బంగారు బాట (1990)
  7. అన్నపూర్ణమ్మగారి అల్లుడు (1988)
  8. అత్తగారూ స్వాగతం (1988)
  9. ముద్దుల మనవరాలు (1986)
  10. మంగమ్మగారి మనవడు (1984) .... మంగమ్మ
  11. గడసరి అత్త సొగసరి కోడలు (1981)
  12. మనవడి కోసం (1977)
  13. అమ్మాయి పెళ్ళి (1974)
  14. తాతమ్మ కల (1974)
  15. విచిత్ర వివాహం (1973)
  16. అంతా మన మంచికే (1972)
  17. మట్టిలో మాణిక్యం (1971)
  18. గృహలక్ష్మి (1967)
  19. పల్నాటి యుధ్ధం (1966) .... నాగమ్మ
  20. అంతస్తులు (1965)
  21. తోడు నీడ (1965)
  22. బొబ్బిలి యుధ్ధం (1964) .... మల్లమ్మ
  23. వివాహ బంధం (1964) .... భారతి
  24. పెంచిన ప్రేమ (1963)
  25. బాటసారి (1961)
  26. అంబికాపతి (1957) .... రాకుమారి అమరావతి
  27. నలదమయంతి (1957) .... దమయంతి
  28. సారంగధర (1957) .... చిత్రాంగి
  29. వరుడు కావాలి (1957)
  30. తెనాలి రామకృష్ణ (1956/I) .... రంగసాని
  31. చింతామణి (1956) .... చింతామణి
  32. మధురై వీరన్ (1956) .... రాకుమారి
  33. రంగూన్ రాధ (1956) ....
  34. తెనాలి రామన్ (1956) .... రంగసాని
  35. అలీబాబావుమ్ నార్పతు తిరుడర్‌గలుమ్ (1955)
  36. కల్వనిన్ కథలి (1955) .... కళ్యాణి
  37. విప్రనారాయణ (1954) .... దేవదేవి
  38. అగ్గి రాముడు (1954)
  39. చక్రపాణి (1954)
  40. మలైకళ్ళన్ (1954)
  41. చండీరాణి (1953/I)
  42. చండీరాణి (1953/II)
  43. ప్రేమ (1952) .... మోతి
  44. మల్లీశ్వరి (1951) .... మల్లీశ్వరి
  45. మంగళ (1951) .... మంగళ
  46. మాయా రంభ (1950)
  47. అపూర్వ సహోదరులు (1950) .... రంజన
  48. లైలామజ్ఞు (1949/I) .... లైల
  49. రక్షరేఖ (1949) .... రాకుమారి కళావతి
  50. నల్లతంబి (1949) .... పుష్ప
  51. రత్నమాల (1948) .... రత్నమాల
  52. గృహప్రవేశం (1946) .... జానకి
  53. స్వర్గసీమ (1945) .... సుబ్బి/సుజాత దేవి
  54. తాసీల్దార్ (1944) .... కమల
  55. గరుడ గర్వభంగం (1943)
  56. కృష్ణ ప్రేమ (1943) .... చంద్రవల్లి
  57. భక్తిమాల (1941) .... రాధ
  58. ధర్మపత్ని (1941/I)
  59. ధర్మపత్ని (1941/II)
  60. మాలతీమాధవం (1940)
  61. వర విక్రయం (1939) .... కాళింది

గాయనిగా

[మార్చు]

గాయనిగా భానుమతి ఎంతో పేరుప్రతిష్టలు సంపాదించుకుంది. సినిమా పాటలే కాక రేడియోలోనూ, రికార్డుల్లోనూ ఆమె పాడిన పాటలు వినవచ్చాయి. విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైనప్పుడు వినిపించిన ప్రారంభగీతం పసిడి మెరుంగుల తళతళలు బాలాంత్రపు రజనీకాంతరావుతో కలిసి ఆమె పాడినదే.[4] [[దస్త్రంపసిడిమెరుంగుల తళతళలు - గానం – భానుమతి , రజని గార్లు.ogg|thumb|విజయవాడ కేంద్రం ప్రారంభ గీతికగా బాలాంత్రపు రజనీకాంత రావు, భానుమతీ రామకృష్ణ పాడిన "పసిడి మెరుంగుల తళతళలు" ప్రసారం చేశారు.]] గానం అంటే భానుమతికి చాలా ఇష్టం. వీణా వాదనం లోనూ ఆమెకు ప్రావీణ్యత ఉంది. పండిట్ రవిశంకర్ సితార్ సంగీతాన్ని ఆమె ఇష్టపడేది. తమిళనాడు ప్రభుత్వం ఒక సంగీత కళాశాలకు భానుమతిని ప్రధానాచార్యులు గా నియమించింది. దాదాపు ప్రతి రోజు కళాశాలకు వెళ్లి శాస్త్రోక్తంగా సంగీతం నేర్పించేవారు. ఆమెకు తెలుగు భాష అంటే మక్కువ, తమిళ భాష మీద పట్టు వుండేది. ఆంగ్ల పదాలను అవసరమైతే తప్ప ఉపయోగించేది కాదు.[1]

దర్శకురాలిగా

[మార్చు]
  1. అసాధ్యురాలు (1993)
  2. పెరియమ్మ (తమిళం) (1992)
  3. భక్త ధృవ మార్కండేయ (1982/I)
  4. భక్త ధృవ మార్కండేయ (1982/II)
  5. ఒకనాటి రాత్రి (1980)
  6. రచయిత్రి (1980)
  7. మనవడి కోసం (1977)
  8. వాంగ సంభందీ వాంగ (తమిళం) (1976)
  9. ఇప్పడియుమ్ ఒరు పెన్ (తమిళం) (1975)
  10. అమ్మాయి పెళ్ళి (1974)
  11. విచిత్ర వివాహం (1973)
  12. అంతా మన మంచికే (1972)
  13. గృహలక్ష్మి (1967)
  14. చండీరాణి (1953/I)

నిర్మాతగా

[మార్చు]
  1. బాటసారి (1961)
  2. వరుడు కావాలి (1957)
  3. చింతామణి (1956)
  4. విప్రనారాయణ (1954)
  5. చక్రపాణి (1954)
  6. చండీరాణి (1953/I)
  7. చండీరాణి (1953/II)
  8. ప్రేమ (1952)
  9. లైలామజ్ఞు (1949/I)
  10. రత్నమాల (1947)

సంగీత దర్శకురాలిగా

[మార్చు]

రచయిత్రిగా

[మార్చు]
  1. ప్రేమ (1952) (కథ)
  2. అత్తగారి కథలు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 శారదా అశోకవర్ధన్. కళాసరస్వతి భానుమతి. ఈనాడు. 2024-09-07
  2. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 120.
  3. జమీర్ హుసేన్, జి.ఎస్. మనసున మల్లెల మాలలూపిన . . . మల్లీశ్వరి: శత వసంతాల భానుమతి. ఈనాడు సినిమా.2024-09-07
  4. [http//eemaata.com/em/issues/200101/616.html తెలుగు సంగీతంలో రజనీ - పరుచూరి శ్రీనివాస్ - ఈమాట]

ఇవి కూడా చూడండి[మార్చు]

[మార్చు]
  1. సరస్వతీ దేవి, ఖోర్షెడ్ మినోచెర్-హోమ్జీ: భారతీయ సంగీతంలో హిందీ చలన చిత్ర మొదటి సంగీత దర్శకురాలు, స్కోర్ కంపోజర్

బయటి లింకులు

[మార్చు]