Jump to content

అగ్ని ప్రమాదాలు

వికీపీడియా నుండి
అడవులలో యాదృచ్చికంగా జరిగే అగ్న ప్రమాదాలు దృశ్య చిత్రం

అగ్ని వలన జరిగే ప్రమాదాలను అగ్ని ప్రమాదాలు (Fire accidents) అంటారు. ఇవి వేడి ఎక్కువగా ఉండే వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రమాదాల వలన ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. దీపావళి పండగలో కాల్చే బాణాసంచా మూలంగా ఇంట్లో సామాన్యంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. వీటిలో ఎక్కువగా పిల్లలు తొందరలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, పెద్దల సహాయం లేకుండా ప్రమాదంలో ఇరుక్కుంటారు.

అగ్నిమాపక శాఖ

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ పేరు విపత్తుల స్పందన, అగ్నిమాపక సర్వీసుల శాఖ 'గా మార్చారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అత్యధికులకు గుర్తుకు వచ్చే అగ్నిమాపక శాఖను ప్రజలను మరింత చేరువచేయడానికి ప్రభుత్వం దాని పేరును మార్చింది. ఎలాంటి అత్యవసర సమయాల్లోనైనా ఆ శాఖ నుంచి సేవలు విధంగా ఆదేశాలు జారీ చేశారు. కేవలం అగ్నిప్రమాదాలకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు, రైలు ప్రమాదాలు, వానలు, వరదలు, భూకంపాలు... ఇతర ప్రాణాపాయ పరిస్థితులు ప్రజలకు ఏర్పడినప్పుడు విపత్తుల శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగాలి. బాధితులు, ఆర్తులకు అవసరమైన సేవలు అందించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడానికి ప్రయత్నించాలి. అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో సమర్థంగా విధులు నిర్వర్తించడానికి ఉపయోగపడే అగ్ని నిరోధక దుస్తులు, కళ్లజోళ్లు, ఎత్త్తెన క్రేన్లు ఇంకా కావాలి. వరదలొస్తే వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి 'విపత్తుల స్పందన, అగ్నిమాపకశాఖ' అధికారుల వద్ద కొన్ని పరికరాలున్నాయి. వాటి సాయంతో రంగంలోకి దిగి బాధితులను ఆదుకోవాలి. ఆపదలో ఉన్నవారు నీటమునగకుండా 'లైఫ్‌బోయ్‌లు కాపాడాలి. 'లైఫ్ సేవింగ్ జాకెట్ల ప్రజలకివ్వాలి. గజ ఈతగాళ్లను నియమించాలి. 101 నెంబరుకు ఫోన్ చేస్తే శాఖాపరంగా బాధితులకు అవసరమైన సేవలు అందిస్తారు

పాటించాల్సిన నిబంధనలు

[మార్చు]
  • ఆసుపత్రులు, హోటళ్ళు, షాపింగ్‌ కాంప్లెక్సుల చుట్టు ఫైర్‌ ఇంజన్‌ తిరుగాదేందుకు వీలుగా నాలుగు మీటర్లు ఖాళీ స్థలం ఉండాలి.
  • భవనాలు చుట్టూ పైపు లైన్లతో కూడి హాజరీలు అమర్చాలి. ఆయా భవనాల ముందు భాగంలో డెక్‌రేటివ్‌ గ్లాస్‌లతో మూసివేయకుండా గాలి వెలుతురు వచ్చే కిటికీలు ఏర్పాటు చేయాలి.
  • ఆయా భవనాలు ముందు పెద్ద సైజ్‌ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయకూడదు.
  • 10 వేల మీటర్ల నీటి సామర్థ్యం గల ట్యాంకులను అమర్చుకోవాలి. నీళ్ళు తోడటానికి అనువుగా మోటార్‌ను అమర్చాలి.
  • భవనాలు వద్ద ట్రాన్సుఫార్మర్‌ ఉంటే దాని చుట్టూ సేఫ్టీ పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి. 45 లీటర్ల ఫోమ్‌ట్రాలీ, కంకరతో సోఫ్‌పిట్‌ ఏర్పాటు చేసుకోవాలి.
  • భవనాలకు ఒకే స్టెయిర్‌ కేసు కాకుండా అత్యవసర సందర్భాల్లో ఉపయోగించటానికి మరో స్టెయిర్‌కేస్‌ సౌకర్యం సమకూర్చుకోవాలి.
  • ఎమర్జెన్సీ లైట్లు, అధిక విద్యుత్తు సరఫరా అయినప్పడు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయేలా సర్క్యూట్‌ బ్రేకర్లు అమర్చుకోవాలి.
  • ఆసుపత్రులు, షాపింగ్‌ కాంప్లెక్సులు, హోటళ్ళులో పనిచేసే సిబ్బంది కోసం ఆరు నెలలకో ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించాలి. అగ్నిప్రమాదం జరిగితే ఏవిధంగా బయటపడాలి. వినియోగదారులు, రోగులను ఎలా రక్షించాలి అనే అంశాలపై ఆరు నెలలకు ఒకసారి సిబ్బంది అందరూ రిహార్సిల్‌ చేయాలి.

ఇవి కూడా చూడండి

[మార్చు]