భూపతిరాజు సోమరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భూపతిరాజు సోమరాజు ప్రసిద్ధిచెందిన గుండె వ్యాధి నిపుణుడు.

ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో సెప్టెంబరు 25, 1948లో జన్మించాడు. గ్రామంలోని ప్రాథమిక విద్యానంతరం, ఈయన గుంటూరు వైద్య కళాశాల నుండి 1970 లో వైద్య విద్యలో పట్టా పొందాడు. ఈయన చదువులోనే కాకుండా ఆటలలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించాడు. ఈయన 1974 లో పి.జి.ఐ., చండీఘర్ నుండి ఎమ్.డి. తరువాత 1977లో డి.ఎమ్. (కార్డియాలజీ) సంపాదించాడు.

ఈయన ఆంధ్ర ప్రదేశ్ వైద్య సర్వీసులో కార్డియాలజీలో అసిస్టెంటు ప్రొఫెసర్ గా చేరాడు. ఉస్మానియా వైద్య కళాశాల మరియు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో 1983 వరకు పనిచేశాడు. ఈయనకు వైద్య విద్యార్థులకు బోధించడం చాలా ఇష్టమైన విషయం మరియు చాలా మంది విద్యార్థులు ఈయన నైపుణ్యానికి ముగ్ధులయ్యేవారు. తరువాత ఈయన నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో చేరాడు. నైపుణ్యత ఆధారంగా ఈయన ఎన్.టి.రామారావు కాలంలో కార్డియాలజీ ప్రొఫెసరుగా 1987 లో పదోన్నతి పొందాడు.

ప్రస్తుతం సోమరాజు కేర్ హాస్పిటల్ హెడ్ మరియు ఛైర్మన్. ఈయన ముఖ్యమైన ఉద్దేశం పేదవారికి కూడా అత్యుత్తమ వైద్య సేవలకు అందజేయడం. ఈ సంస్థలో ఇంతవరకు ఇలాంటి సేవలు చాలా మందికి అందించి, ఉన్నతమైన సేవలందిస్తున్నాడు.

ఈయన సేవలకు గాను భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.

బయటి లింకులు[మార్చు]