మదనపల్లి పురపాలక సంఘం
Jump to navigation
Jump to search
మదనపల్లి | |
స్థాపన | 1961 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
మదనపల్లి పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,చిత్తూరుకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం చిత్తూరు లోకసభ నియోజకవర్గం లోని,మదనపల్లె శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర[మార్చు]
మదనపల్లి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుకు చెందిన పురపాలక సంఘం.ఇది 1961 సంవత్సరంలో మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 14.20.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.పురపాలక సంఘం పరిధి 35 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]
జనాభా గణాంకాలు[మార్చు]
మదనపల్లె (పట్టణ) | మొత్తం | పురుషులు | స్త్రీలు |
---|---|---|---|
జనాభా | 184,267 | 92,692 | 91,575 |
అక్షరాస్యులు | 128,467 | 69,340 | 59,127 |
పిల్లలు (0-6) | 18,062 | 9,312 | 8,750 |
సరాసరి అక్షరాస్యత (%) | 79.69 | 86.27 | 73.15 |
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]
ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా కె.శివప్రసాద్,[2]వైస్ చైర్మన్‌గా జె. భవాని ప్రసాద్.[2]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
- హార్సిలీ హిల్స్- ఆంధ్రరాష్ట్రంలో ప్రసిధ్ధి చెందిన(ఆంధ్రా ఊటీ అని పిలువబడే) వేసవి విడిది ప్రాంతము. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి అధికారిక వేసవి విడిది కేంద్రము.
- బసిని కొండ- వెంకటేశ్వర స్వామి గుడి కలిగిన ఒక కొండ. గుడి సమీపంలో వెంకటేశ్వరస్వామి పాదాలు కూడా (రాతిలో చెక్కబడి)ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రతి శనివారం ఈ కొండను ఎక్కి గుడిలో పూజలు చేయడం మదనపల్లెవాసులకు ఆనవాయితీ. హార్సిలీహిల్స్ నుంచి బసినికొండ దూరదర్శినిలో కనిపిస్తుంది
ఇతర వివరాలు[మార్చు]
ఈ పురపాలక సంఘం 14.20.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.17 రెవెన్యూ వార్డులు,36 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 42 మురికివాడలు ఉండగా అందులో జనాభా 36575 ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి,87 ప్రభుత్వ పాఠశాలలు, ఒక కూరగాయల మార్కెట్ ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబర్ 2019. Retrieved 13 May 2016.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help)