శ్రీకాళహస్తి పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీకాళహస్తి పురపాలక సంఘం
శ్రీకాళహస్తి
స్థాపన1970
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

శ్రీకాళహస్తి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని, శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 371 కి.మీ దూరంలో ఉంది.1970 లో సంవత్సరంలో 2 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 35 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం 19805 గా ఉన్న పట్టణ జనాభా 2011 లో 22288 కు పెరిగింది. గత దశాబ్దంలో 11.70% పెరిగింది.2011 భారత జనాభా లెక్కల ప్రకారం 80,056 జనాభా ఉండగా అందులో పురుషులు 38,995, మహిళలు 41,061 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 85.15%, ఉండగా స్త్రీ జనాభాలో 72.57% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 8224 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 19619 గృహాలు ఉన్నాయి.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా పి. రాధా రెడ్డి, [2] వైస్ చైర్మన్‌గా ముత్యాల శరధి పనిచేస్తున్నారు.[2]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

భక్త కన్నప్ప కొండ నుండి శ్రీకాళహస్తి దృశ్యము

ఇతర వివరాలు[మార్చు]

ఈ పురపాలక సంఘం 24.5 చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.17 రెవెన్యూ వార్డులు,35 ఎన్నికల వార్డులు ఉన్నాయి. 1 ప్రభుత్వ ఆసుపత్రి,2 కూరగాయల మార్కెట్లు,21 ప్రాథమిక పాఠశాలలు, 6 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు,3 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Srikalahasti Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2019-12-31. Retrieved 2020-07-03.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]