పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం
పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక పురపాలక సంఘం.
ఇక్కడ ప్రధాన పరిశ్రమ జీడి.సుమారు. 160 ప్రోసెసింగు కేంద్రాలు ఉన్నాయి. సుమారు 15,000 మందికి ఉపాధి లభిస్తోంది
చరిత్ర[మార్చు]
ఈ పలాస పది సంవత్సరముల కిందట ఒక పెద్ద గ్రామం. జీడి పరిశ్రమ ఇక్కడ బాగా వృద్దిచెంది, జనాభా పెరగడంవలన పట్టణ వాతావరం ఏర్పడింది.1995 వరకు ఇది గ్రామ పంచాయతీగా ఉండేది.తరువాత దీన్ని 1996 నవంబరు 22న నగరపంచాయతీగా ఏర్పాటు చేసారు. ఆదాయ వనరులు పెరగడం వలన, జనాభా పెరుగుదలను దృష్ఠిలో పెట్టుకొని చుట్టుప్రక్కల గ్రామాలు కొన్నింటిని కలిపి 2002 లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేసారు.అప్పట్లో 21 వార్డులుండేవి.2019 ఎన్నికలు వరకు 25 ప్రస్తుతం 31 ఉన్నాయి.
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 97,551 - పురుషులు 47,915 - స్త్రీలు 49,636;
ఎన్నికల ఫలితాలు[మార్చు]
మొత్తము వార్డులు | కాంగ్రెస్ గెలిసినవి | తెదేపా గెలిచినవి | స్వతంత్రులు |
25 | 14 | 7 | 4 |
కాంగ్రెస్ కు చెందిన "కోట్నిలక్ష్మి" స్త్రీ జనరల్ కేటగిరీ క్రింద ఛైర్మన్ పదవికి ఎన్నికైంది.
ఇప్పటివరకు ఏన్నికైన పురపాలక సంఘం అధ్యక్షులు[మార్చు]
సంవత్సరము | అధ్యక్షులు | పార్టీ |
2002 | వజ్జబాబూరావు | కాంగ్రెస్ |
2007 | కోట్నిలక్ష్మి | కాంగ్రెస్ |
2014 | కోత
పూర్ణ చంద్ర రావు |
తెలుగుదేశం |
2021 | బల్ల గిరిబాబు | వై.యస్.ఆర్. కాంగ్రెస్ |
2014 ఎన్నికలు[మార్చు]
- మొత్తం ఓటర్లు : 40,048
- పోలయిన ఓట్లు : 30,208
2014 ఎన్నికలలో బలాబలాలు
ఇతర సమాచారం[మార్చు]
- అర్.డి.ఓ - ఆఫీసు, టెక్కలి.
- వార్త వార్తాపత్రిక, శ్రీకాకుళం