Jump to content

నందికొట్కూరు పురపాలక సంఘం

వికీపీడియా నుండి
నందికొట్కూరు పురపాలక సంఘం
నందికొట్కూరు
స్థాపన2012
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

నందికొట్కూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం లోని, నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర

[మార్చు]

నందికొట్కూరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఇది 2012 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.పురపాలక సంఘం పరిధి 23 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]

జనాభా గణాంకాలు

[మార్చు]

2001 లో 40210 గా ఉన్న పట్టణ జనాభా 2011 లో 46953 కు పెరిగింది. దశాబ్దంలో 16.77% పెరిగింది.

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా సుబ్బమ్మ, [2] వైస్ చైర్మన్‌గా షేక్ అబ్దుల్ మునాఫ్ పనిచేస్తున్నారు.[2]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  1. వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము:- నందికొట్కూరు పట్టణం నుంచి కొణిదేల గ్రామంనకు వెళ్ళే దారిలో అతి సుందరమైన, ప్రాచీనమైన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము ఉంది.
  2. శ్రీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయం.

ఇతర వివరాలు

[మార్చు]

ఈ పురపాలక సంఘం 23.85.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.16 రెవెన్యూ వార్డులు,23 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 25 మురికివాడలు ఉండగా అందులో జనాభా 17200 ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఒక కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]