మడకశిర నగరపంచాయితీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మడకశిర నగర పంచాయతీ
మడకశిర
స్థాపన2011
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంనగర పంచాయతీ
జాలగూడుఅధికార వెబ్ సైట్

మడకశిర నగర పంచాయతీ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,అనంతపురంజిల్లాకు చెందింది.ఈ నగర పంచాయతీ హిందూపురం లోకసభ నియోజకవర్గం లోని,మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధికి చెందింది.

చరిత్ర[మార్చు]

మడకశిర నగరపంచాయితీ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన పట్టణ స్థానిక సంస్థలకు చెందిన ఒక నగర పంచాయితీ.ఇది నగర పంచాయితీగా 2011 లో ఏర్పడింది.ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 467 కి.మీ దూరంలోనూ, జిల్లా ప్రధాన కేంద్రం 130 కి.మీ. దూరంలో ఉంది.[1]

జనాభా గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం 20205 ఉన్న పట్టణ జనాభా 2011 లో 21695 కు పెరిగింది. గత దశాబ్దంలో 7.37% పెరిగింది. లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 981 స్త్రీలు ఉన్నారు. అక్షరాస్యత రేటు 71.38% ఉండగా పురుష జనాభాలో 79.07%, స్త్రీ జనాభాలో 63.53% అక్షరాస్యులు ఉన్నారు.[2]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా పి. ప్రకాష్,[3]వైస్ చైర్మన్‌గా బి.ఒబాన్న పనిచేస్తున్నారు.[3]

ఇతర వివరాలు[మార్చు]

ఈ పురపాలక సంఘంలో 20 రెవెన్యూ వార్డులు, 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 35 మురికివాడలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి, 2 ఉన్నత పాఠశాలలు,15 ప్రాథమిక పాఠశాలలు,21 ప్రభుత్వ పాఠశాలలు,1 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. https://madakasira.cdma.ap.gov.in/en/about-us-20
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-07-29.
  3. 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]