Jump to content

పాలకొల్లు పురపాలక సంఘం

వికీపీడియా నుండి
పాలకొల్లు పురపాలక సంస్థ
స్థాపన1919
రకంప్రభుత్వేతర సంస్థ
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన సంస్థ
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
పాలకొల్లు
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
చైర్మన్వల్లభనేని నారాయణ మూర్తి
వైస్ చైర్పర్సన్కరినేని రోజా రమణి
మునిసిపల్ కమిషనర్రామ్మోహన్ రావు
ప్రధానభాగంకమిటీ
జాలగూడుఅధికార వెబ్ సైట్

పాలకొల్లు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరికి చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ.ఈ పురపాలక సంఘం నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం లోని, పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.[1]

చరిత్ర

[మార్చు]

పాలకొల్లు 1919 ఏప్రియల్ లో 3 గ్రేడ్ తో పురపాలక సంస్థగా ఏర్పడింది.1965 ఆగస్టులో మొదటి గ్రేడ్ పురపాలక సంస్థగా ఏర్పడింది.2019 పురపాలక సంఘం ఎన్నికలకు పులపల్లి గ్రామ పంచాయతీ, ఉల్లంపర్రు గ్రామ పంచాయతీ, పాలకొల్లు రూరల్ ఏరియాలు నగరంలో విలీనం చేయాలని ప్రతిపాదనలు అమలులో ఉన్నాయి.[2][3] పాలకొల్లు పట్టణం మునిసిపాలిటిలో 2020 జనవరి 7లో ఐదు గ్రామ పంచాయతీలలో ఉన్న ఏడు గ్రామాలను పాలకొల్లులో విలీనం చేసారు. పాలకొల్లులో గ్రామాలను విలీనం చేయక ముందు 4.68 కిలోమీటర్ల పరిధిలో 31 వార్డులతో 61284 (2011 జనాభా లెక్కల ప్రకారం) జనాభా ఉండే వాళ్ళు ప్రస్తుతం 7 గ్రామాల విలీనం చేయడం వలన ఈ ఏడూ గ్రామాల విస్తీర్ణం 20.08 కిలోమీటర్లలో ఉన్న 42,932 జనాభా పాలకొల్లు మునిసిపాలిటి పరిధిలోకి వచ్చారు ప్రస్తుతం పాలకొల్లు మునిసిపాలిటి 7 గ్రామాల విలీనం తరువాత 24.68 కిలోమీటర్ల విస్తీర్ణంలో 35 వార్డులతో 104216 (2011 జనాభా లెక్కల ప్రకారం) జనాభా ఉన్నారు. లక్ష జనాభా దాటడం వలన పాలకొల్లు అమృత్ పదకానికి ఎంపిక అయ్యి నగరాల జాబితాలోకి అడుగుపెట్టింది. పాలకొల్లు మునిసిపలిటీలో 100 సంవత్సరాలలో మొదటిసారిగా విలీనం ప్రక్రియ జరిగింది.[4] పశ్చిమగోదావరి జిల్లలో ప్రస్తుతం ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం తరువాత పాలకొల్లు నాల్గవ అతిపెద్ద నగరంగా ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం 57,317 గా ఉన్న పట్టణ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 61,284 కు పెరిగింది. గత దశాబ్దంలో 0.93% పెరిగింది. లింగ నిష్పత్తి 1000 మగవారికి 1024 స్త్రీలు. అక్షరాస్యత రేటు 100% ఉంది. పురుష జనాభాలో 51% ఉండగా స్త్రీ జనాభాలో 49% అక్షరాస్యులు ఉన్నారు.

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా వల్లభనేని నారాయణ మూర్తి, [5] వైస్ చైర్మన్‌గా కరినేని రోజా రమణి పనిచేస్తున్నారు.[5]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయము లోపల

ఆంధ్ర ప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్ఠితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో, నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే ఈ చెరువు (ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు). ఆంధ్ర ప్రదేశ్‌లో ఎత్తయిన, చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.

ఇతర వివరాలు

[మార్చు]

ఈ పురపాలక సంఘం 4.75.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.17 రెవెన్యూ వార్డులు,31 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 16752 గృహాలు ఉన్నాయి.1 ప్రభుత్వ ఆసుపత్రి, 2 మార్కెట్లు, 2 ఇ సేవా కేంద్రాలు,6 ఉన్నత పాఠశాలలు,22 ప్రాథమిక పాఠశాలలు,1పబ్లిక్ పార్క్ ఉంది.

పురస్కారాలు, విజయాలు

[మార్చు]
  • నాణ్యత నిర్వహణ వ్యవస్థ కోసం ISO 9001 సర్టిఫైడ్

మూలాలు

[మార్చు]
  1. "Palakollu Municipal Corporation". Official website of Palakollu Municipality. Archived from the original on 12 జనవరి 2017. Retrieved 29 March 2016.
  2. "Administration". Palakollu Municipality. Archived from the original on 12 జూన్ 2017. Retrieved 29 March 2016.
  3. "Palakollu Municipal corporation". PMC Urban Development Authority. Retrieved 17 June 2014.[permanent dead link]
  4. "Palakollu municipality official relesed G.O merged Seven villages of five panchayat". Eenadu News Paper. Archived from the original on 9 జనవరి 2020. Retrieved 29 December 2019.
  5. 5.0 5.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]