సామర్లకోట పురపాలక సంఘం
సామర్లకోట | |
స్థాపన | 1956 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
సామర్లకోట పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం లోని, పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర
[మార్చు]సామర్లకోట పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఇది 1956 సంవత్సరంలో III వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 14.88.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.పురపాలక సంఘం పరిధి 30 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం 56,864 జనాభా ఉండగా అందులో పురుషులు 28,115, మహిళలు 28,749 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 74.58% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 78.77% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 70.51%.అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5793 ఉన్నారు.[2]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా గంగిరెడ్డి అరుణ, [3] వైస్ చైర్మన్‌గా ఉభా జాన్ మోజేస్ పనిచేస్తున్నారు.[3]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- కుమారభీమారామం:పంచారామాలలో ఒకటయిన ఈ కుమారభీమారామం క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు ఒక కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడ శివలింగం 60 అడుగుల ఎత్తులో రెండంతస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం.
- శ్రీ మాండవ్య నారాయణస్వామి దేవాలయం: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ప్రసిద్ధి గాంచిన దేవాలయం.ప్రాచీన సంస్కృతీ వైభవానికి అద్దం పడుతున్న శ్రీ మాండవ్యనారాయణ స్వామి ఆలయం పవిత్రతకు, ప్రశాంతతకు నిలయంగా భాసిల్లుతోంది.
ఇతర వివరాలు
[మార్చు]ఈ పురపాలక సంఘం 38.77.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.18 రెవెన్యూ వార్డులు,31 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 32 మురికివాడలు ఉండగా అందులో జనాభా 29258 ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి,19 ప్రభుత్వ పాఠశాలలు, ఒక కూరగాయల మార్కెట్ ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ "Samalkot Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-10.
- ↑ 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.