ఎలమంచిలి పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎలమంచిలి పురపాలక సంఘం
ఎలమంచిలి
Yelamanchili Municipality logo.png
ఎలమంచిలి పురపాలక సంఘం
స్థాపన2012
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

ఎలమంచిలి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,విశాఖపట్నంజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం అనకాపల్లి లోకసభ నియోజకవర్గంలోని,ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

ఎలమంచిలి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 341 కి.మీ దూరంలో ఉంది.2012 సంవత్సరంలో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 24 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 27,265 జనాభా ఉండగా అందులో పురుషులు 13,365 ,మహిళలు 13,900 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 83.52% ,ఉండగా స్త్రీ జనాభాలో 71.07% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2587 ఉన్నారు.ఈ పురపాలక సంఘం లో మొత్తం 7,375 గృహాలు ఉన్నాయి.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా రామ కుమారి,[2]వైస్ చైర్మన్‌గా సాంబశివరావు పనిచేస్తున్నారు.[2]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • పంచదార్ల ధర్మలింగేశ్వరాలయం
  • వీరభద్రస్వామి దేవాలయం
  • వేణుగోపాలస్వామి దేవాలయం
  • కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం
  • రామచంద్రమ్మ అమ్మవారి దేవాలయం
  • భూలోకమాంబ అమ్మవారి దేవాలయం
  • సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం

ఇతర వివరాలు[మార్చు]

ఈ పురపాలక సంఘం 39 చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.17 రెవెన్యూ వార్డులు,24 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘం లో 1 ప్రభుత్వ ఆసుపత్రి,3 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Yelamanchili Census Town City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-03.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]