మాచర్ల పురపాలక సంఘం
మాచర్ల | |
స్థాపన | 1983 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | మాచర్ల |
కార్యస్థానం |
|
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
మాచర్ల పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం గుంటూరు లోకసభ నియోజకవర్గంలోని,మాచర్ల శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర[మార్చు]
మాచర్ల పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 127 కి.మీ దూరంలో ఉంది.1983 లో మునిసిపాలిటీగా స్థాపించబడింది. ఈ పురపాలక సంఘంలో 28 ఎన్నికల వార్డులు ఉన్నాయి. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.
జనాభా గణాంకాలు[మార్చు]
ఈ పురపాలక సంఘం పరిధిలో 2001 నాటికి 49221 జనాభా ఉండగా, 2011 నాటికి 57,290 మందికి పెరిగారు.2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పురపాలక సంఘ జనాభా 57,290 మంది జనాభా ఉండగా, అందులో పురుషుల సంఖ్య 28,454 కాగా, స్త్రీలు 28,836 మంది ఉన్నారు.పట్టణ పరిధి 10.58 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది.పురపాలక సంఘం పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6430 మంది ఉన్నారు. మాచర్ల నగర అక్షరాస్యత రేటు రాష్ట్ర 71.13% ఉండగా అందులో పురుషుల అక్షరాస్యత 80.37%, స్త్రీల అక్షరాస్యత 62.09%.గా ఉంది.[1]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]
ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా గోపవరపు శ్రీదేవి పనిచేస్తుంది.[2]వైస్ చైర్మన్‌గా నెల్లూరి మంగమ్మ పనిచేస్తుంది.[2]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

- లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయం.
- వేంకటేశ్వరస్వామి దేవాలయం
- ఆదిలక్ష్మమ్మ అమ్మవారి దేవాలయం
- ముత్యాలమ్మతల్లి దేవాలయం
- ఎత్తిపోతల జలపాతం :ఇక్కడకి 11 కి.మీ. దూరంలో తాళ్ళపల్లె వద్ద ఉంది.[3]
ఇతర వివరాలు[మార్చు]
ఈ పురపాలక సంఘంలో 14605 గృహాల ఉన్నాయి.15 రెవెన్యూ వార్డులు,29 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీ పరిధిలో 26 మురికివాడలు ఉండగా, అందులో జనాభా 21070 ఉన్నారు.పురపాలక సంఘం పరిధిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి,7ప్రభుత్వ పాఠశాలు,2 ఉన్నత పాఠశాలలు, 2 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు,5 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "Macherla Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-28.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.
- ↑ https://books.google.co.in/books?id=nxtnsT8CdZ4C&pg=PA65&dq=thallapalle&redir_esc=y#v=onepage&q=thallapalle&f=false