తాడిపత్రి పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడిపత్రి పురపాలక సంఘం
తాడిపత్రి
తాడిపత్రి పురపాలక సంఘం
స్థాపన1920
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

తాడిపత్రి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలోని, తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

తాడిపత్రి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 527 కి.మీ దూరంలో ఉంది. ఈ పురపాలక సంఘాన్ని 1920లో మునిసిపాలిటీగా స్థాపించబడింది.[1]

జనాభా గణాంకాలు[మార్చు]

తాడిపత్రి పురపాలక సంఘంలో 40 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2011 భారత జనాభా లెక్కల ప్రకారం 108,171 జనాభా ఉండగా అందులో పురుషులు 54,015, మహిళలు 54,156 మంది ఉన్నారు.అక్షరాస్యత 79.31% ఉండగా అందులో పురుష జనాభాలో 80.87%, స్త్రీ జనాభాలో 62.00% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 11,869 ఉన్నారు.

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా వెంకటలక్ష్మి, [2] వైస్ చైర్మన్‌గా బి. జిలాన్ పనిచేస్తున్నారు.[2]

ఇతర వివరాలు[మార్చు]

ఈ పురపాలక సంఘం7.49.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.16 రెవెన్యూ వార్డులు,34 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 33 మురికివాడలు ఉండగా ఈ మురికివాడలో 33538 జనాభా ఉన్నారు.1ప్రభుత్వ ఆసుపత్రులు,1 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

  • తాడిపత్రి పురపాలక సంఘం కార్యాలయం రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. కార్పొరేట్ కార్యాలయం తరహాలో సెంట్రల్ ఏసీతో నిర్మించారు. దీన్ని చూసినవారు ఇది ప్రభుత్వ కార్యాలయమా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దారు. వీధుల్లో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేస్తున్నారు.
  • 2006లో తాడిపత్రి పురపాలక సంఘం పాలకవర్గం తాడిపత్రిలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించింది. దశలవారీగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాలకవర్గ కృషితో నేడు ప్లాస్టిక్ కవర్ల వినియోగం వందశాతం తగ్గింది. ఇంటర్ పాఠ్యాంశాల్లోనూ తాడిపత్రిలో ప్లాస్టిక్ నిషేధం గురించి చేర్చారు.
  • తాడిపత్రిలో భూగర్భ డ్రైనేజీ పథకం అమలు అవుతోంది. అయితే పట్టణంలో 25444 నివాస గృహాలు ఉండగా 13వేల ఇళ్లకు భూగర్భ డ్రైనేజీ పథకం అనుసంధానం కాగా ఇంకా మిగిలిన ఇళ్లను పూర్తి చేయడానికి పురపాలక సంఘం కృషి చేస్తోంది. ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
  • పట్టణంలో సుమారు 5వేల మంది విద్యార్థులకు ఒకేచోట పరిశుభ్రమైన ప్రదేశంలో స్టీమ్ సిస్టం ద్వారా మధ్యాహ్న భోజనం తయారు చేసి మెనూతోపాటు పెరగన్నం ఇస్తున్నారు.
  • పట్టణంలో వీధి కుక్కలకు యాంటీ రేబీస్ ఇంజక్షన్ వేయించారు.
  • చెత్తను తడి, పొడి చెత్తగా విభజిస్తున్నారు. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేయగా పొడి చెత్తను మార్కెట్‌లో విక్రయించి మున్సిపాలిటీకి ఆదాయ వనరుగా మార్చుకొంటున్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 8 ఆగస్టు 2016. Retrieved 23 June 2016.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.
  3. "TOP TOURIST PLACES IN ANANTAPURAMU DISTRICT". Archived from the original on 2017-03-05. Retrieved 2017-02-18.

వెలుపలి లంకెలు[మార్చు]