Jump to content

జగ్గయ్యపేట పురపాలక సంఘం

వికీపీడియా నుండి
జగ్గయ్యపేట పురపాలక సంఘం
జగ్గయ్యపేట
స్థాపన1982
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
జగ్గయ్యపేట
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

జగ్గయ్యపేట పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మున్సిపాలిటీ. ఇది జగ్గయ్యపేట పట్టణానికి పరిపాలన సంస్థ. ఈ పురపాలక సంఘం విజయవాడ లోక్‌సభ నియోజకవర్గంలోని, జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర

[మార్చు]

1982 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మున్సిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 27 ఎన్నికల వార్డులు ఉన్నాయి. దీని పూర్వనామము బేతవోలు. రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు తన తండ్రి పేర కట్టించిన పట్టణమిది. ఈయన గొప్ప శివ భక్తుడు. నేటికి దాదాపు 180 ఏళ్ళ క్రితం, ఈ ప్రదేశాన్ని రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పరిపాలించేవాడు.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 53,530 జనాభా ఉండగా అందులో పురుషులు 26,484, మహిళలు 27,046 మంది ఉన్నారు.అక్షరాస్యత 79.15% ఉండగా అందులో పురుష జనాభాలో 84.88%, స్త్రీ జనాభాలో 73.59% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5533 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 13,670 గృహాలు ఉన్నాయి.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా తన్నేరు నరసింహారావు పనిచేస్తున్నాడు.[2] వైస్ చైర్మన్‌గా మహ్మద్ అక్బర్ పనిచేస్తున్నాడు.[2]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • వరసిద్ధి విఘ్నేశ్వరస్వామివారి దేవాలయం
  • చంద్రమౌళీశ్వరస్వామివారి దేవాలయం (పెద్ద శివాలయం).
  • దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవాలయం.

మూలాలు

[మార్చు]
  1. "Jaggaiahpet Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2019-12-31. Retrieved 2020-07-01.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]