న్యాయస్థానం
Jump to navigation
Jump to search
న్యాయస్థానం పక్షాల మధ్య వివాదాలను చర్చించి న్యాయం చెప్పే ప్రదేశం. ఇవి చాలా వరకు ప్రభుత్వానికి చెందినవిగా ఉంటాయి. ఈ వివాదాలు సివిల్, క్రిమినల్ లేదా అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినవిగా ఉండవచ్చును.[1] ఇవి ఆయా ప్రాంతాలకు లేదా దేశాలకు చెందిన న్యాయశాస్త్ర విధానాల్ని పాటిస్తాయి. ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యత కూడా న్యాయస్థానాలు చేపడతాయి. ఒక న్యాయస్థానములో ఒకరు లేదా కొందరు న్యాయమూర్తులు కలిసికట్టుగా తీర్పు చెప్తారు. వివిధ పక్షాల తరపున న్యాయవాదులు వారి వారి వాదనలు వినిపిస్తారు.
వివిధ స్థాయిలు
[మార్చు]- గ్రామ న్యాయస్థానాలు
- జిల్లా న్యాయస్థానాలు
- హైకోర్టు లేదా ఉన్నత న్యాయస్థానం
- సుప్రీంకోర్టు లేదా అత్యున్నత న్యాయస్థానం
- అంతర్జాతీయ న్యాయస్థానం
న్యాయస్థానాల పరిధి
[మార్చు]ప్రతి న్యాయస్థానానికి ఒక పరిధి (Jurisdiction) ఉంటుంది. దీనిని ఆ దేశ లేదా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు నిర్దేశిస్తాయి. ఉదాహరణకు: జిల్లా న్యాయస్థానాలు ఆ జిల్లాకు సంబంధించినంత వరకు వివాదాలను స్వీకరిస్తాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Walker, David (1980). The Oxford companion to law. Oxford: Oxford University Press. p. 301. ISBN 019866110X.