భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు

వికీపీడియా నుండి
(ప్రాథమిక హక్కు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

భారతదేశంలో ప్రాథమిక హక్కులు

ప్రాముఖ్యత, లక్షణాలు[మార్చు]

ప్రాథమిక హక్కులు, పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకొనుటకు, బాధ్యతగలిగిన పౌరులుగా హుందాగా జీవించుటకు, ప్రభుత్వపరంగా, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. ఇక్కడ ప్రభుత్వమనగా, భారతదేశంలో అధికారంగల అన్ని రంగాలు. వీటిలో భారత ప్రభుత్వం, పార్లమెంటు, భారతదేశంలోని రాష్ట్రాలూ, రాష్ట్రాలలో గల, జిల్లాపరిషత్తులూ, కార్పొరేషన్లు, పురపాలకసంఘాలు, గ్రామ పంచాయతీలు వగైరా.

సమానత్వపు హక్కు[మార్చు]

సమానత్వపు హక్కు, రాజ్యాంగం అధికరణలు 14, 15, 16, 17, 18 ల ప్రకారం ప్రసాదించబడింది. ఈ హక్కు చాలా ప్రధానమైనది, స్వేచ్ఛా సమానత్వాలు ప్రసాదించే ఈ హక్కు, క్రింది విషయాల గ్యారంటీనిస్తుంది :

  • చట్టం ముందు సమానత్వం : రాజ్యాంగ అధికరణ (ఆర్టికల్) 14 ప్రకారం, భారత భూభాగంలో ఉన్న వ్యక్తులందరూ సమానంగా, భారతచట్టాల ప్రకారం కాపాడబడవలెను. అనగా ప్రభుత్వం [1] వ్యక్తుల పట్ల కుల, మత, వర్గ, వర్ణ, లింగ, పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఏలాంటి వివక్ష చూపరాదు.[2]
  • పౌరప్రదేశాలలో సామాజిక సమానత్వం, సమాన ప్రవేశాలు : అధికరణ 15 ప్రకారం, పౌరులు పౌర (పబ్లిక్) ప్రదేశాలయిన, పార్కులు, మ్యూజియంలు, బావులు, స్నానఘాట్‌లు, దేవాలయాలు మొదలగు చోట్ల ప్రవేశించుటకు సమాన హక్కులు కలిగి ఉన్నారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. కానీ కొన్ని సందర్భాలలో ప్రభుత్వం, స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చు. అలాగే సామాజికంగా వెనుకబడినవారికి ప్రత్యేక సదుపాయాలు, ప్రభుత్వాలు కలుగజేయవచ్చు.</ref>
  • పౌర ఉద్యోగాల విషయాలలో సమానత్వం : అధికరణ 16 ప్రకారం, ఉద్యోగాలు పొందేందుకు, ప్రభుత్వాలు పౌరులందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పించవలెను. ప్రభుత్వాలు, పౌరులకు ఏలాంటి వివక్షలూ చూపరాదు. 2003 'పౌర (సవరణ) బిల్లు' ప్రకారం, ఈ హక్కు, ఇతర దేశాల పౌరసత్వాలు పొందిన భారతీయులకు వర్తించదు.[3]
  • అంటరానితనం నిషేధాలు : అధికరణ 17 ప్రకారం, అంటరానితనాన్ని ఎవరైనా అవలంబిస్తూవుంటే చట్టం ప్రకారం శిక్షార్హులు.[4] అంటరానితనం నేర చట్టం (1955), 1976లో పౌరహక్కుల పరిరక్షణా చట్టం పేరుమార్పు పొందింది.
  • బిరుదుల నిషేధాలు : అధికరణ 18 ప్రకారం, భారత పౌరులు, ఏలాంటి బిరుదులూ పొందరాదు. ఇతరదేశాలనుండి కూడా ఏలాంటి బిరుదులు పొందరాదు.[5] ఉదాహరణకు బ్రిటిష్ ప్రభుత్వం, రాయ్ బహాదుర్, ఖాన్ బహాదుర్ లాంటి, "ప్రభుత్వ లేక రాజ్య సంబంధ బిరుదులు", సైన్యపరమైన బిరుదులూ ప్రకటించేది, ఇలాంటివి నిషేధం. కానీ విద్య, సంస్కృతీ, కళలు, శాస్త్రాలు మొదలగువాటి బిరుదులు ప్రసాదించనూవచ్చు, పొందనూ వచ్చు. భారత రత్న, పద్మ విభూషణ్ లాంటి వాటిని పొందినవారు, వీటిన తమ "గౌరవాలు"గా పరిగణించవచ్చుగాని, 'బిరుదులు'గా పరగణించరాదు.[6] 1995, 15 డిసెంబరుసుప్రీంకోర్టు, ఇలాంటి బిరుదుల విలువలను నిలుపుదలచేసింది.

స్వాతంత్ర్యపు హక్కు[మార్చు]

భారత రాజ్యాంగము, తన అధికరణలు 19, 20, 21, 22, ల ద్వారా స్వాతంత్ర్యపు హక్కును ఇస్తున్నది. ఇది వైయుక్తిక హక్కు. ప్రతి పౌరుడూ ఈ హక్కును కలిగివుండడం, రాజ్యాంగ రచనకర్తల అసలు అభిలాష. అధికరణ 19, క్రింది ఆరు స్వేచ్ఛలను పౌరులకు ఇస్తున్నది :[7]

  1. వాక్-స్వాతంత్ర్యపు హక్కు, భావవ్యక్తీకరణ స్వాతంత్ర్యం,
  2. సమావేశాలకు స్వేచ్ఛ, ఈ సమావేశాలు శాంతియుతంగా, ఆయుధాలు కలిగివుండరాదు. దేశం, ప్రజా శ్రేయస్సులను దృష్టిలో వుంచుకుని, ప్రభుత్వాలు వీటి అనుమతులు నియంత్రించనూవచ్చు.
  3. సంస్థలు, సొసైటీలు స్థాపించే హక్కు. దేశ, ప్రజా శ్రేయస్సుల దృష్ట్యా ప్రభుత్వం వీటిని నియంత్రించనూ వచ్చు లేదా నిషేధించనూ వచ్చు.
  4. భారత పౌరుడు, భారతదేశం అంతర్భాగంలో ఏప్రాంతంలోనైనా పర్యటించవచ్చు. కాని కొన్నిసార్లు ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అంటురోగం గల సమయాలలో వాటిని అరికట్టే ప్రయత్నాలలో, పౌరుల ప్రయాణాలను నిషేధించవచ్చు.
  5. భారత అంతర్భాగంలో ఏప్రదేశంలోనైనా, పౌరులు, నివాసాన్ని ఏర్పరచుకోవచ్చు. కానీ, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్ తెగల పరిరక్షణ దృష్ట్యా, ప్రభుత్వం కొన్ని నియంత్రణలు చేయవచ్చును.[8]
  6. భారతదేశంలోని ఏప్రాంతంలోనైనా, పౌరులు వ్యాపారాలు, వర్తకాలూ, ఉద్యోగాలూ చేపట్టవచ్చును. కానీ, నేరాలుగల వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు, నీతిబాహ్య వ్యాపారాలు చేపట్టరాదు.
  • ఏ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించ కూడదు. అక్రమ నిర్బంధం నుండి వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యలకు రక్షణ కల్పించడం కోసం 20 వ అధికరణ ఉద్దేశించబడినది
  • ప్రాణాలు కాపాడుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ క్రిందనే పరిగణింపబడుతుంది. అధికరణ 21 ప్రకారం, ఏ పౌరుడూ తన స్వేచ్ఛనూ, జీవితాన్ని కోల్పోయే హక్కు కలిగిలేడు, చట్టాన్ని తప్పించి.
  • 22 వా అధికరణ నిర్బంధ నివారణ చట్టం. అధికరణ ప్రకార ఏ ఒక్క వ్యక్తిని కారణం లేకుండా నిర్బంధంలోకి తీసుకొనరాదు. నిర్బంధంలోకి తీసుకున్న 24 గంటల్లోపు సమీప న్యాయం మూర్తి ఎదుట హాజరు పరచాలి.[9]

దోపిడిని నివారించే హక్కు[మార్చు]

బాలకార్మికుడు, 'స్వేచ్ఛారహిత కార్మికులు' (కట్టు బానిసలు) గల విధానం నిషేధం.

The right against exploitation, అధికరణలు 23, 24 ల ప్రకారం, కట్టు బానిసత్వం, బాలకార్మిక విధానాలు నిషేధం.[10], 14 సంవత్సరాలకు లోబడి గల బాలబాలికలకు అపాయకరమైన పనులు (కర్మాగారాలలో, గనులలో) చేయించుట నిషేధం. బాలకార్మిక విధానం, రాజ్యాంగ ఊపిరికే విఘాతం లాంటిది.[11] కట్టు బానిసత్వం, విధానంలో భూస్వాములు లేదా పెత్తందార్లు, మానవహక్కులకు విఘాతాలు కలుగజేసేవారు. మానవులకు కట్టుబానిసలుగా ఉంచుకుని, తరతరాల స్వాతంత్ర్యాన్ని హరించివేసేవారు. ఈ దురాగతాన్ని మాన్పించడానికే ఈ హక్కు కల్పించబడింది. మానవులకు 'బానిస వర్తకాలు', 'వ్యభిచారం' లాంటి అశ్లీల వృత్తులయందు బలవంతంగా ప్రవేశించేలా చేయువారికి చట్టప్రకారం కఠిన శిక్షలున్నాయి. కానీ కొన్ని అత్యవసర సమయాలలో ప్రభుత్వాలు, జీతభత్యాలు లేని ఉద్యోగాలు,, తప్పనిసరి సైనిక భర్తీలను చేపట్టుట, లాంటి వాటిని, ప్రత్యేక పరిస్థితులలో అనుమతించవచ్చును.[10]

మతస్వాతంత్రపు హక్కు[మార్చు]

భారతదేశంలో పౌరులందరికీ మతస్వాతంత్ర్యపు హక్కును, అధికరణలు (ఆర్టికల్స్) 25, 26, 27, 28 ల ప్రకారం ఇవ్వబడింది. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం సెక్యులరిజం సూత్రాలను స్థాపించుటకు ఉద్ద్యేశించినవి. భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలోని అన్ని మతాలు సమానమే, ఏమతమూ ఇతర మతంపై ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడు తన ఇష్టానుసారం మతాన్ని అవలంబించుటకు స్వేచ్ఛ కల్పింపబడ్డాడు. పౌరులు తమ మతాలగూర్చి ఉపన్యసించవచ్చు, అవలంబించవచ్చు, మతవ్యాప్తికొరకు పాటుపడవచ్చు. అలాగే, మతపరమైన సంప్రదాయాలను ఉదాహరణకు సిక్కులు కిర్పాన్ లను తమ ఉద్యోగాలు చేయు సమయాన ధరించడానికి, ప్రజల శ్రేయస్సును, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి, నిరోధించవచ్చు.[12]

ధార్మిక సంస్థలు, ప్రజాపయోగ స్వచ్ఛంద సంస్థలను స్థాపించుకొనవచ్చు. ఇతరత్రా, మతసంబంధం కాని కార్యకలాపాలను, ప్రభుత్వం నిర్దేశించిన చట్టాల ప్రకారం చేపట్టవచ్చు. చారిటబుల్ సంస్థలను కూడా ప్రజాపయోగం, సుహృద్భావన, నియమాలను పునస్కరించుకొని, తమ కార్యకలాపాలు చేయునట్లుగా ప్రభుత్వం నిర్దేశించవచ్చును.[13] మతపరమైన కార్యకలాపాల కొరకు ఏలాంటి పన్నులను విధించగూడదు, నిర్దేశించగూడదు.[14] ప్రభుత్వాలు నడిపే విద్యాసంస్థలలో, ప్రత్యేక మతాన్ని రుద్దే బోధనలు చేపట్టకూడదు.[15] అలాగే, ఈ ఆర్టికల్స్ లోని విషయాలు, ప్రభుత్వాలు చేపట్టే ప్రజోపయోగ కార్యక్రమాలపై ఏలాంటి విఘాతాలు కలిగించగూడదు. ప్రభుత్వాలు చేపట్టే ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలలో, ధార్మిక సంస్థల కార్యకలాపాలు అడ్డంకులుగా వుండరాదు.

25 వ అధికరణ ప్రకారం ప్రతిిిి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు.

26 వ అధికరణ ప్రకారం మత అభివృద్ధికిిి అవసరమైన ధార్మిక సంస్థలను స్థాపించుకోవచ్చు.

27 వ అధికరణ ప్రకారం మతపరంగా ఏ వ్యక్తి పై ఏ విధమైన పన్నులు విధించరాదు.

•28 వ అధికరణ ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థల యందు మత ప్రబోధం చేయరాదు.[12]

సాంస్కృతిక, విద్యాహక్కులు[మార్చు]

భారత జాతీయపతాకం

భారతదేశం, అనేక మతాలకు, భాషలకు, సంస్కృతులకు నిలయం. రాజ్యాంగం వీరికి కొన్ని ప్రత్యేక హక్కులను ఇస్తూంది. అధికరణ 29, 30 ల ప్రకారం, మైనారిటీలకు కొన్ని హక్కులు ఇవ్వబడినవి. ఏ మైనారిటీలకు చెందినవాడైననూ, ప్రభుత్వం వీరికి, ప్రభుత్వ, ప్రభుత్వసహాయం పొందిన సంస్థలలో ప్రవేశానికి నిషేధించరాదు.[16]

మైనారిటీలు, అనగా మతం, భాష, సాంస్కృతిక పరమైన మైనారిటీలు, తమ మతాన్ని, భాషలనూ, సంస్కృతినీ రక్షించుకొనుటకు, మైనారిటీ సంస్థలు స్థాపించుకొనవచ్చును. ఆ సంస్థలద్వారా వారు, తమ అభ్యున్నతికి పాటుపడవచ్చును.[17] ఈ సంస్థలలో దుర్వినియోగాలు జరుగుతున్న సమయాన ప్రభుత్వాలు తమ ప్రమేయాలు కలుగజేసుకోవచ్చును.

29 వ అధికరణ భారతదేశంలోని ప్రతి పౌరుడు తమ స్వీయ భాషను , లిపిని, సంస్కృతిని సంరక్షించుకోవచ్చు.

•30 వ అధికరణదేశంలోని ఏ ప్రాంతం వారైనా తమ భాష, లిపి, సంస్కృతిని సంరక్షించుకోవడానికి అవసరమైన విద్యాసంస్థలను స్థాపించి నిర్వహించు కొనవచ్చు.

రాజ్యాంగ పరిహారపు హక్కు[మార్చు]

32 వ అధికరణ రాజ్యాంగ పరిహారపు హక్కు.ప్రాథమికిక హక్కులకు ఏపాటియైనా భంగం కలిగితే, రాజ్యాంగ పరిహారపు హక్కును కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఉదాహరణకు, పౌరుడు, జైలు శిక్షను పొందితే, ఆ వ్యక్తి, న్యాయస్థానాలను ఆశ్రయించి, ఇది దేశచట్టాలనుసారంగా వున్నదా లేదా అని ప్రశ్నించే హక్కును కలిగి ఉన్నాడు. ఒకవేళ, న్యాయస్థానం నుండి జవాబు "కాదు" అని వస్తే, ఆవ్యక్తికి తక్షణమే విడుదలచేయవలసి వస్తుంది. పౌరుల హక్కులను వాటి సంరక్షణలను గూర్చి న్యాయస్థానాలను అడిగే విధానాలు కొన్ని ఉన్నాయి. న్యాయస్థానాలు కొన్ని దావాలను ప్రవేశపెట్టవచ్చు. ఆ దావాలు, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంటో, సెర్టియోరారి. ఒక వేళ దేశంలో అత్యవసర పరిస్థితి యేర్పడితే, ఈ హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వంచే 'సస్పెండు' చేయబడుతాయి.[18]

ఆస్తి హక్కు - క్రిత ప్రాథమిక హక్కు[మార్చు]

భారత రాజ్యాంగం, ఆర్టికల్ 19, 31 వరకు గల విషయాలలో ఆస్తి హక్కును పౌరుల ప్రాథమిక హక్కుగా పరిగణించింది. ఆర్టికల్ 19, పౌరులందరికీ, ఆస్తులను సంపాదించడం, వుంచుకొనడం, అమ్మడం లాంటి హక్కులను కలుగజేసింది. ఆర్టికల్ 31 'పౌరులెవ్వరూ తమ ఆస్తి హక్కును, ప్రభుత్వాల ద్వారా కోల్పోగూడదు'. ప్రభుత్వం ప్రజల అవసరాల రీత్యా పౌరుల ఆస్తిని గైకొన్న యెడల, ఆ ఆస్తిదారునికి 'కాంపెన్‌జేషన్' చెల్లించవలెనని కూడా నొక్కి వక్కాణిస్తుంది.

కానీ భారత రాజ్యాంగ 44వ సవరణ ద్వారా, 1978 లో ఈ ఆస్తి హక్కును, ప్రాథమిక హక్కుల జాబితానుండి తొలగించింది.[19] ఓ క్రొత్త ఆర్టికల్ 300-ఏ, సృష్టింపబడింది. ఈ ఆర్టికల్ ప్రకారం "చట్టం ప్రకారం, పౌరుడు పొందిన ఆస్తిని, భంగం కలిగించరాదు". ఆస్తి హక్కు రాజ్యాంగపరమైన హక్కుగా పరిగణించబడుతున్ననూ, ప్రాథమిక హక్కు హోదాను కోల్పోయింది.[20]

విమర్శాత్మక విశ్లేషణ[మార్చు]

ఈ ప్రాథమిక హక్కులను చాలా మంది పలువిధాలుగా విమర్శించారు. రాజకీయ సముదాయాలు, ప్రాథమిక హక్కులలో పని హక్కు, నిరుద్యోగస్థితి, వయసు మీరిన స్థితులలో ఆర్థికసహాయ హక్కు, మున్నగునవి చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి.[20] ఈ హక్కులన్నీ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులులో క్రోడీకరించియున్నవి.[21] స్వాతంత్ర్యపు హక్కు, స్వీయస్వతంత్రం కూడా కొన్నిసార్లు విమర్శలకు లోనైనవి. ఇవి పరిధులకు మించి స్వేచ్ఛలు కలిగివున్నవని విమర్శింపబడినవి.[20] ఈ పౌరహక్కులు ఎమర్జన్సీ యందు, నిలుపుదల చేయబడుతాయి, ఇలా నిలుపుదల చేసే చట్టాలకు ఉదాహరణ; 'మీసా' (MISA Maintenance of Internal Security Act), జాతీయ రక్షణా చట్టం ఎన్.ఎస్.ఏ. NSA (National Security Act).[20] జాతీయ విపత్తుల (దేశ రాజకీయ అంతర్గత సంక్షోభం) సమయాలలో 'అత్యవసర పరిస్థితి' ని ప్రకటించి, ఈ కాలంలో పౌరహక్కులను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటారు.[20][22][23]

"పత్రికా స్వేచ్ఛ" స్వాతంత్ర్యపు హక్కులలో మిళితం చేయబడలేదు, ప్రజల ఉద్దేశ్యాల ప్రకటన, భావ ప్రకటనా స్వాతంత్ర్యం మున్నగు విషయాల కొరకు పత్రికాస్వేచ్ఛ అవసరం.[20] అపాయకర పనులలో బాలల చాకిరి కొంచెం తగ్గుముఖం పట్టినా, అపాయాలులేని పనులలో బాలల చాకిరి (Child Labour) అనేవి, భారతరాజ్యాంగ విలువలను కాలరాస్తున్నాయి. 1.65 కోట్లమంది బాలబాలికలు నేటికీ భారతదేశంలో వివిధ పనులలో ఉద్యోగాలు చేస్తున్నారు.[24] 2005 'ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్' అనే పత్రిక ప్రచురించిన ప్రచురణల ఆధారంగా, ప్రపంచంలో లంచగొండితనం గల 159 దేశాల జాబితాలో భారత్ 88వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. ఈ లంచగొండులలో అధికారులు, రాజకీయనాయకులూ ఉన్నారు.[25] 2003 'పౌర బిల్లు' (సవరణ) ప్రకారం, ఉద్యోగ ప్రయత్నాలు చేసేందుకు సమాన హక్కులు పొందివుంటారు గాని, ఉద్యోగాలు పొందే విధానంలో సమానత్వపు హక్కు పరిగణలోకి రాదు. పోటీలో నెగ్గినవారే ఉద్యోగాలు పొందే అర్హత గలిగి వుంటారు.[3]

సవరణలు[మార్చు]

ప్రాథమిక హక్కులలో మార్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. ఈ రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఆమోదం పొందాలి. పార్లమెంటు ఆమోదానికి మూడింట రెండొంతుల పార్లమెంటు సభ్యుల ఆమోదం అవసరం. ఈ ఆమోదానికి పార్లమెంటులో ఓటింగ్ అవసరం.

  • ఆస్తి హక్కు ప్రథమ దశలో ప్రాథమిక హక్కుగా పరిగణింపబడింది. కాని 1978 లో జరిగిన భారత రాజ్యాంగ 44వ సవరణ ప్రకారం దీనిని ఓహక్కుగా కాకుండా, ప్రతి పౌరుడు తన ఆస్తిని కాపాడుకోవడానికి చట్టం ప్రకారం హక్కును కలిగి వున్నాడని చట్టం చేయబడింది. ఈ చట్టం, ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి సామ్యవాద ఉద్దేశాలు సాధించడానికి, చేయబడింది.[19]
  • విద్యా హక్కు ను, 2002 లో, భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం ప్రాథమికహక్కుగా చేయబడింది. ఈ హక్కు ప్రకారం, ప్రతి బాలురు/బాలికలు, పౌరులు, ఎలిమెంటరీ స్థాయిలో ప్రాథమిక విద్యను ఓ హక్కుగా కలిగివుంటారు.[26]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

ఫుట్ నోట్స్[మార్చు]

  1. The term "State" includes all authorities within the territory of India. It includes the Government of India, the Parliament of India, the governments and legislatures of the states of India. It also includes all local or other authorities such as Municipal Corporations, Municipal Boards, District Boards, Panchayats etc. To avoid confusion with the term states and territories of India, State (encompassing all the authorities in India) has been capitalised and the term state (referring to the state governments) is in lowercase.
  2. Constitution of India-Part III Article 14 Fundamental Rights.
  3. 3.0 3.1 "Citizenship (Amendment) Bill, 2003" (PDF) (in English). rajyasabha.nic.in/ Rajya Sabha]. p. 5. Archived from the original (PDF) on 2006-04-25. Retrieved 2006-05-25.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. Constitution of India-Part III Article 17 Fundamental Rights.
  5. Constitution of India-Part III Article 18 Fundamental Rights.
  6. Basu, Durga Das (1988). Shorter Constitution of India. New Delhi: Prentice Hall of India. Basu, Durga Das (1993). Introduction to the Constitution of India. New Delhi: Prentice Hall of India.
  7. Constitution of India-Part III Article 19 Fundamental Rights.
  8. Pylee, M.V. (1999). India’s Constitution. New Delhi: S. Chand and Company. ISBN 81-219-1907-X.
  9. Constitution of India-Part III Article 21 Fundamental Rights.
  10. 10.0 10.1 Constitution of India-Part III Article 23 Fundamental Rights.
  11. Constitution of India-Part III Article 24 Fundamental Rights.
  12. 12.0 12.1 Constitution of India-Part III Article 25 Fundamental Rights.
  13. Constitution of India-Part III Article 26 Fundamental Rights.
  14. Constitution of India-Part III Article 27 Fundamental Rights.
  15. Constitution of India-Part III Article 28 Fundamental Rights.
  16. Constitution of India-Part III Article 29 Fundamental Rights.
  17. Constitution of India-Part III Article 30 Fundamental Rights.
  18. Constitution of India-Part III Article 32 Fundamental Rights.
  19. 19.0 19.1 44th Amendment Act, 1978 Archived 2018-08-24 at the Wayback Machine.
  20. 20.0 20.1 20.2 20.3 20.4 20.5 Tayal, B.B. & Jacob, A. (2005), Indian History, World Developments and Civics, pg. A-33
  21. Constitution of India-Part IV Article 41 Directive Principles of State Policy.
  22. Senior Inspector justifies lathi-charge[permanent dead link] during the 2006 Indian anti-reservation protests
  23. Lathi Charge in Mumbai during the 2006 Indian anti-reservation protests
  24. "Child labour in India" (in English). indiatogether.org India Together]. Archived from the original (HTML) on 2014-07-12. Retrieved 2006-06-27.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  25. Index of perception of corruption, published by Transparency International.
  26. 86th Amendment Act, 2002 Archived 9 డిసెంబరు 2011 at the Wayback Machine.

వెలుపలి లంకెలు[మార్చు]

[[వర్గం:భారత రాజ్యాంగం hggghjc]]