అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమలాపురం
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లాకోనసీమ
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలుఅమలాపురం
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1962
ప్రస్తుత పార్టీతెలుగు దేశం పార్టీ
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులుగంటి హరీష్ (బాలయోగి)
మొదటి సభ్యులుబయ్యా సూర్యనారాయణ మూర్తి

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. అదే సమయంలో ఈ నియోజకవర్గం పలు మార్పులకు గురైనది. పునర్విభజనకు పూర్వం ఈ లోక్‌సభ నియోజకవర్గంలో తాళ్ళరేవు, ముమ్మిడివరం, అల్లవరం, అమలాపురం, నగరం, రాజోలు, కొత్తపేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన గన్నవరంతో పాటు రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న రామచంద్రాపురం సెగ్మెంట్లు ఇందులో చేర్చబడింది.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]
  1. అమలాపురం
  2. కొత్తపేట
  3. పి. గన్నవరం
  4. ముమ్మిడివరం (ఎస్.సి) (పాక్షికం) మిగిలిన భాగం కాకినాడ జిల్లాలో ఉంది.
  5. మండపేట
  6. రాజోలు
  7. రామచంద్రపురం

నియోజకవర్గపు గణాంకాలు

[మార్చు]
  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 18, 32, 830 [1]
  • ఓటర్ల సంఖ్య:12, 38, 690
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 23.65%, 0.66%.

నియోజకవర్గపు ప్రత్యేకతలు

[మార్చు]
  • దేశంలోనే ఎస్సీలు అత్యధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో ఇది ఒకటి.
  • ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన దివంగత జి.ఎం.సి.బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశాడు.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
లోక్‌సభపదవీకాలంసభ్యుని పేరుఎన్నికైన పార్టీ
మూడవ1962-67బయ్యా సూర్యనారాయణ మూర్తిభారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ1967-71బయ్యా సూర్యనారాయణ మూర్తిభారత జాతీయ కాంగ్రెసు
ఐదవ1971-77బయ్యా సూర్యనారాయణ మూర్తిభారత జాతీయ కాంగ్రెసు
ఆరవ1977-80కుసుమ కృష్ణమూర్తిభారత జాతీయ కాంగ్రెసు
ఏడవ1980-84కుసుమ కృష్ణమూర్తిభారత జాతీయ కాంగ్రెసు
ఎనిమదవ1984-89ఎ.జె.వెంకట బుచ్చిమహేశ్వరరావుతెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ1989-91కుసుమ కృష్ణమూర్తిభారత జాతీయ కాంగ్రెసు
పదవ1991-96గంటి మోహనచంద్ర బాలయోగితెలుగుదేశం పార్టీ
పదకొండవ1996-98కె.ఎస్.ఆర్.మూర్తిభారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ1998-99గంటి మోహనచంద్ర బాలయోగితెలుగుదేశం పార్టీ
పదమూడవ1999-04గంటి మోహనచంద్ర బాలయోగితెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ2004-2009జి.వి.హర్షకుమార్భారత జాతీయ కాంగ్రెసు
15వ2009-2014జి.వి.హర్షకుమార్భారత జాతీయ కాంగ్రెసు
16వ2014- 2019పండుల రవీంద్రబాబుతెలుగుదేశం పార్టీ
17వ2019 - 2024చింతా అనురాధవైఎస్‌ఆర్‌సీపీ
18వ[2]2024 -జి.ఎం. హరీష్తెలుగుదేశం పార్టీ

2024 ఎన్నికల ఫలితాలు

[మార్చు]

2024 ఎన్నికల ఫలితాలు

  రాపాకవరప్రసాదరావు (34.95%)
  గౌతం జంగా (1.16%)
  ఇతరులు (2.64%)

2019 ఎన్నికల ఫలితాలు

[మార్చు]

2019 ఎన్నికల ఫలితాలు [3]

  గంటి హరీష్ (36.18%)
  డి.ఎం.ఆర్.శేఖర్ (20.7%)
  ఇతరులు (3.69%)
సార్వత్రిక ఎన్నికలు, 2019: అమలాపురం
Party Candidate Votes % ±%
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చింతా అనూరాధ 485313 39.43 -2.85
తెలుగుదేశం పార్టీ గంటి హరీష్ మాథుర్ 445347 36.18 -16.86
జనసేన పార్టీ డి.ఎం.ఆర్.శేఖర్ 254848 20.7 N/A
భారత జాతీయ కాంగ్రెస్ జంగా గౌతమ్ 7878 1.09 0.64 -0.45
భారతీయ జనతా పార్టీ మానేపల్లి అయ్యజీవేమ 11516 0.94 +0.3
NOTA నోటా 16449 1.34 +0.79
మెజారిటీ 39966 +3.25 -3.61
మొత్తం పోలైన ఓట్లు 1230903 82.55 +2.27
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ gain from తెలుగుదేశం పార్టీ Swing

2014 ఎన్నికల ఫలితాలు

[మార్చు]

2014 ఎన్నికల ఫలితాలు

  పి.విశ్వరూప్ (42.28%)
  ఇతరులు (4.68%)
సార్వత్రిక ఎన్నికలు, 2014: అమలాపురం
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ పండుల రవీంద్రబాబు 594,547 53.04 +27.20
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పినిపె విశ్వరూప్ 473,971 42.28 N/A
భారత జాతీయ కాంగ్రెస్ ఐతాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు 12,182 1.09 -34.90
జై సమైక్యాంధ్ర పార్టీ జి.వి.హర్షకుమార్ 9,931 0.89 N/A
బహుజన సమాజ్ పార్టీ గెడ్డం సంతాదరావు 7,219 0.64 N/A
NOTA None of the Above 6,141 0.55 N/A
మెజారిటీ 120,576 10.76 +6.86
మొత్తం పోలైన ఓట్లు 1,120,927 82.55 +2.27
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing +9.75

మూలాలు

[మార్చు]
  1. సాక్షి దినపత్రిక
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Amalapuram". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  3. "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2019".