కుసుమ కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుసుమ కృష్ణమూర్తి
లోక్‌సభ సభ్యుడు
In office
1989–1991
నియోజకవర్గంఅమలాపురం
In office
1980–1984
నియోజకవర్గంఅమలాపురం
In office
1977–1979
నియోజకవర్గంఅమలాపురం
వ్యక్తిగత వివరాలు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్[1]
చదువుఎం.ఏ
కళాశాలనాగపూరు విశ్వవిద్యాలయం

కుసుమ కృష్ణమూర్తి భారత జాతీయ కాంగ్రేసు పార్టీ రాజకీయనాయకుడు. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి, అమలాపురానికి 6వ, 7వ, 9వ లోక్‌సభల్లో ప్రాతినిధ్యం వహించాడు.

కృష్ణమూర్తి 1940, సెప్టెంబరు 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం శ్రీ కోనసీమ భానోజి రామరు కళాశాలలో సాగింది. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగపూరు విశ్వవిద్యాలయాల్లో ఉన్నతవిద్యను అభ్యసించాడు.[2]

ఈయన రాజకీయ జీవితంలో అనేక పదవులలో సేవలందించాడు. అందులో 1980 నుండి 1982 వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ జాయింట్ సెలక్షన్ కమిటీ కన్వీనరుగా. 1990లో కేంద్రమంత్రివర్గంలో పెట్రోలియం, రసాయనాల శాఖామంత్రిగాను పనిచేశాడు. 1982 నుండి 1985 జనవరి వరకు అఖిల భారత కాంగ్రేసు కమిటీ సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Kusuma Krishna Murty,Amalapuram Lok Sabha 1977". latestly.com. Retrieved 2021-09-16.
  2. 2.0 2.1 "Members Bioprofile". Parliament of India, Lok Sabha. 1940-09-11. Retrieved 2021-09-16.