Jump to content

పినిపె విశ్వరూప్

వికీపీడియా నుండి
పినిపె విశ్వరూప్

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
08 జూన్ 2019[1] – 2022 ఏప్రిల్ 10[2]

పశుసంవర్ధక శాఖ
పదవీ కాలం
2011 – 2014
పదవీ కాలం
2009 – 2010

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019
ముందు అయితాబత్తుల ఆనందరావు
నియోజకవర్గం అమలాపురం
పదవీ కాలం
2009 – 2014
ముందు చిట్టబ్బాయి కుడుపూడి
తరువాత అయితాబత్తుల ఆనందరావు
నియోజకవర్గం అమలాపురం
పదవీ కాలం
2004 – 2009
ముందు చెల్లి వివేకానంద
తరువాత పొన్నాడ వెంకట సతీష్ కుమార్
నియోజకవర్గం ముమ్మిడివరం

వ్యక్తిగత వివరాలు

జననం (1962-10-02) 1962 అక్టోబరు 2 (వయసు 62)
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ

పినిపె విశ్వరూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి, [3] 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[4][5]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పినిపె విశ్వరూప్ 1962 అక్టోబరు 2లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోన మండలం, నడవపల్లి గ్రామంలో రెడ్డి పంతులు, సీతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి 1983లో బీఎస్సీ, 1986లో బీఈడీ పూర్తి చేశాడు.[6][7]

రాజకీయ జీవితం

[మార్చు]

పినిపె విశ్వరూప్ 1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అరంగ్రేటం చేశారు. 1998లో జరిగిన ముమ్మిడివరం నియోజకవర్గం ఉపఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో ముమ్మిడివరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. విశ్వరూప్ 2004లో జరిగిన ఎన్నికల్లో ముమ్మిడివరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చెల్లి శేషకుమారి పై 15357 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

పినిపె విశ్వరూప్ 2009లో జరిగిన ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసి రాష్ట్ర విభజనకు వ్యరితేకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.[8]

పినిపె విశ్వరూప్ 2013 అక్టోబరు 19న కాంగ్రెస్ పార్టీని వీడి హైదరాబాద్ లోటస్ పాండులో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలై, 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి టిడిపి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు పై 25654 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[9] ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాడు.[10][11]

పినిపె విశ్వరూప్ 2024 సెప్టెంబర్ 27న కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[12]

మూలాలు

[మార్చు]
  1. TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Prajasakti (10 April 2022). "రాజీనామాలను ఆమోదించిన గవర్నర్". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  3. The Hindu (8 June 2019). "Andhra Pradesh Ministers: Portfolios and profiles" (in Indian English). Archived from the original on 16 August 2021. Retrieved 16 August 2021.
  4. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  5. 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  7. Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  8. Sakshi (28 September 2013). "విశ్వరూప్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  9. Sakshi (2019). "Amalapuram Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  10. Mana Telangana (8 June 2019). "కొలువుదీరిన ఎపి కొత్త మంత్రులు..." Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  11. Sakshi (8 June 2019). "'తూర్పు'కే పెద్దపీఠం". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
  12. Sakshi (28 September 2024). "రెండు జిల్లాలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుల నియామకం". Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.