ఆర్టోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆర్టోస్ ఒక ప్రాంతీయ శీతల పానీయం, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి త్రాగునీటి శీతల పానీయం.

ఆర్టోస్

చరిత్ర[మార్చు]

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన అడ్డూరి రామచంద్ర రాజు, జగన్నాథ రాజు అన్నదమ్ములు. 1911 లో రామచంద్ర రాజు రోడ్ కాంట్రాక్టర్ ఉద్యోగం చేసేవారు . రోడ్డు పనుల నిమిత్తం కాకినాడ లోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ పాడై ఉన్న సోడా మెషీన్ కనిపించింది. ఈ మెషీన్ అక్కడ పనిచేసిన బ్రిటిష్ అధికారి దాన్ని వదిలేసి వెళ్లినట్టు సిబ్బంది చెప్పారు. దానిలో నీళ్లు పోసి ఏదో తయారు చేసుకుని తాగేవారు అని అక్కడ సిబ్బంది చెప్పడంతో రామచంద్ర రాజు ఆ మెషీన్ కోరి, దానికి కొంత ధర చెల్లించి తన ఇంటికి తెచ్చుకున్నారు.1919లో ఏ.ఆర్.రాజు అనే పేరుతో డ్రింక్స్ అమ్మారు. ఆ తర్వాత 1955లో ఆర్టోస్ గా పేరు మార్చారు. అప్పట్లో దీనినే ‘రాజు గారి కలర్ కాయ్’ అని ప్రజలు పిలుచుకునే వారు.కానీ అప్పటికి భారతీయులకు సోడా కొత్త కావడంతో అంతగా ఆదరణ రాలేదు. సోడా సీసా చేసే శబ్దం, అందులో నుంచి వచ్చే పొగ ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది[1][2]

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో[మార్చు]

1914 ప్రాంతంలో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాకినాడ పరిసరాల మీదుగా వెళ్తున్న బ్రిటిష్ సైనికులు ఈ సోడాలను చూసి తాగడం ప్రారంభించారు. అది చూసిన స్థానిక ప్రజలు , సోడాలు చెడు కాదని గుర్తించి, వారు కూడా తాగడం మొదలుపెట్టారు.

ఆర్టోస్ పరిమిత మార్కెట్[మార్చు]

ప్రస్తుతం ఆర్టోస్ తూర్పుగోదావరి జిల్లానే ప్రధాన మార్కెట్. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో కొద్దిగా విస్తరించింది. 1960లలో ఈ సంస్థ శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకూ విస్తరించింది. 1960లో విశాఖపట్నంలో ఒక యూనిట్ కూడా పెట్టారు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్టోస్&oldid=2696094" నుండి వెలికితీశారు