మెల్లెంపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెల్లెంపూడి
—  రెవిన్యూ గ్రామం  —
మెల్లెంపూడి is located in Andhra Pradesh
మెల్లెంపూడి
మెల్లెంపూడి
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°25′32″N 80°37′35″E / 16.425678°N 80.626448°E / 16.425678; 80.626448
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తాడేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి పుష్పరాణి
పిన్ కోడ్ 522303
ఎస్.టి.డి కోడ్ 08645

మెల్లెంపూడి, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 303., ఎస్.టి.డి.కోడ్ = 08645.

గ్రామ చరిత్ర[మార్చు]

సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామ పంచాయతీ 1968లో ఏర్పడింది. అప్పుడు ఇప్పటం గ్రామం గూడా ఈ గ్రామ పంచతీ పరిధిలో ఉండేది.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తుమ్మపూడి పుష్పరాణి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ శివరామిరెడ్డి ఎన్నికైనారు.[2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయ వార్షికోత్సవాన్ని, 2017, ఫిబ్రవరి-15వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వాణిజ్య పంటలకు కేంద్రమైన మెల్లెంపూడిని ఒకప్పుడు మినీ బొంబాయి అని పిలిచేవారు. ఇక్కడ పండే పంటలను జలరవాణా ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతిచేశేవారు. ఒకప్పుడు వ్యాపారాలతో కళకళలాడిన గ్రామం నేడు సమస్యల వలయంలో ఉంది. తాగేందుకు మంచినీరు లేదు. మురుగు కాలువలు ఏర్పాటు చేయలేదు. గ్రంథాలయానికి ఆలనాపాలనా లేదు. శ్మశానం లేదు. [1]

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

శ్రీ ఆరుమళ్ళ శంకరరెడ్డి, పోలీసుశాఖ అత్యున్నత పురస్కారం ఇండియన్ పోలీస్ మెడల్ పురస్కార గ్రహీత. [4]

గణాంకాలు[మార్చు]

మెల్లెంపూడి గ్రామ జనాభా=2231., ఓటర్లు=1636.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.