మంగళగిరి పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగళగిరి పురపాలక సంఘం
మంగళగిరి
స్థాపన1959
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
మంగళగిరి
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

మంగళగిరి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఇది రాష్ట్ర రాజధానికి అమరావతికి 14 కి.మీ. దూరంలో ఉందిఈ పురపాలక సంఘం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలోని, మంగళగిరి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

మంగళగిరి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్టం, గుంటూరు జిల్లా లోని మునిసిపాలిటీ. దీనిని ప్రకటన గ్రామ పంచాయితీ స్థాయి నుండి 1969 లో మునిసిపాలిటీగా స్థాపించబడింది.[1]

జనాభా గణాంకాలు[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం 61,981 ఉండగా 2011 జనాభా లెక్కల్లో 73,613 మంది జనాభాకు పెరిగింది.ఈ ప్రాంతం 10.58 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది.పరపాలక సంఘ పరిధిలో 19137 గృహాహలు, 11 రెవెన్యూ వార్డులు, 32 ఎన్నికల వార్డులు, 29 మురికివాడలు ఉన్నాయి. మురికివాడలలో 43180 జనాభా ఉన్నారు.ఒక ప్రభుత్వ ఆసుపత్రి, 18 ప్రభుత్వపాఠశాలలు, 1 ఉన్నత పాఠశాల, 4 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు,13 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.[2]

చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

చైర్‌పర్సన్‌గా జి. చిరంజీవి పనిచేస్తున్నాడు.[3] వైస్ చైర్మన్‌గా బాలాజీ గుప్తా పనిచేస్తున్నాడు.[3]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం
  • గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి దేవాలయం.
  • కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం
  • అఖిలాండేశ్వరీ అమ్మవారి దేవాలయం *పోలేరమ్మ తల్లి దేవాలయం

విలీనం లేదా రద్దు చేసిన పురపాలక సంఘం[మార్చు]

1969లో మంగళగిరి పురపాలక సంఘం ఏర్పడింది. 2021 మార్చి 23న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, మంగళగిరి మున్సిపాలిటీతోపాటు మంగళగిరి మండలంలోని ఆత్మకూరు, నూతక్కి, పెదవడ్లపూడి, రామచంద్రాపురం, ఎర్రబాలెం, కాజ, చినకాకాని, నవులూరు, చినవడ్లపూడి, నిడమర్రు గ్రామపంచాయితీలను మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4][5]

మూలాలు[మార్చు]

  1. "Wayback Machine" (PDF). web.archive.org. 2016-01-28. Archived from the original on 2016-01-28. Retrieved 2022-08-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  3. 3.0 3.1 "Wayback Machine" (PDF). web.archive.org. 2019-09-06. Archived from the original on 2019-09-06. Retrieved 2022-08-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "AP: Merger of villages to boost Mangalagiri as model town". Vijayawada: Times of India. Retrieved 4 January 2021.
  5. "AP: Merger of villages to boost Mangalagiri as model town | Vijayawada News - Times of India". web.archive.org. 2022-06-23. Archived from the original on 2022-06-23. Retrieved 2022-06-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు[మార్చు]