Jump to content

పెరుగు రామకృష్ణ (కవి)

వికీపీడియా నుండి
పెరుగు రామకృష్ణ
పెరుగు రామకృష్ణ
జననం(1960-05-27)1960 మే 27
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
వృత్తిసహాయ వాణిజ్యపన్నుల శాఖాధికారి
ప్రసిద్ధిభారతీయ రచయిత, కవి
మతంహిందూ
భార్య / భర్తసుజనారామం (కవయిత్రి)
పిల్లలుసాహిత్య కళ్యాణచక్రవర్తి , శ్రీనిధి
తండ్రిపెరుగు వెంకటేశ్వర్లు
తల్లికమలమ్మ

పెరుగు రామకృష్ణ (జననం 27 మే 1960), ప్రముఖ రచయిత, కవి. ఈయన ఇప్పటివరకూ 4 కవిత్త్వం పుస్తకాలు, 2 చిన్ని కథల పుస్తకాలు ప్రచురించారు. ఇతని కవితల్లో ఆంగ్లంలోని FLAMINGO అనే కవితల సంకలనం ప్రముఖమైనది. ఈయన UWA వారి Outstanding Intellectual of 21st Century ఇంకా రంజనీ కుందుర్తి నేషనల్ అవార్డ్, కజకిస్థాన్‌ సాహిత్య పురస్కారం తదితర బహుమానాలు కూడా గెలుచుకున్నారు.[1][2] వీరు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసారే కాని, వీరికి ప్రవృత్తిగా ఉన్న సాహిత్య రచన నుండి మాత్రం కాదు. పదవీ విరమణ సందర్భంగా (2018 నుంచి 2020) వీరు రాసిన కవిత్వాన్ని “దూదిపింజల వాన” శీర్షికతో కవితా సంపుటిని వెలువరిస్తున్నారు.[3] అతను రచించిన ‘ఒక పరిమళభరిత కాంతిదీపం’ అనే కవితా సంపుటి మానవతావాద కవిత్వ విభాగంలో బ్రెజిల్ పురస్కారం లభించింది.[4]

జీవిత విశేషాలు

[మార్చు]

పెరుగు రామకృష్ణ 27 మే 1960 న నెల్లూరు జిల్లాలో కమలమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు జన్మించారు.[5] ఆయన తండ్రి పెరుగు వెంకటేశ్వర్లు పద్యకవి. ఆయన సోదరుడు ఫణికుమార్ కూడా ఆంగ్లం, తెలుగు భాషల్లో కవి.ఫణికుమార్ తన 27వ యేట మరణించాడు. రామకృష్ణ నెల్లూరు జిల్లా లోని జయంపు అనే చిన్న గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేసారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఎ (ఆంగ్ల లిటరేచర్) ను, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) లను పూర్తి చేసారు. పి.జి.డి.సి.ఎ కూడా చదివారు. నాన్నగారి చంధస్సు పద్యాలు, భావ కవితలు, ఆన్నయ్య పణికుమార్‌ మదిలో మెదలి అక్షర రూపం దాల్చిన కవితలతో ఉత్తేజితుడై చదువుకునే రోజులలో తెలుగు ఉపాధ్యాయులు రంగారెడ్డి ప్రోత్సాహంతో కలం పట్టారు. పదిహేనేళ్ల చిరు ప్రాయంలోనే ఆయన కలం నుండి వెలుబడిన తొలికవిత ‘విలువ‘ . ఈ విలువ కవితలు ప్రజా హృదయాల్లోకి దూసుకుపోయాయి.[6]

అచ్చ తెలుగు కవిత్వంలో దూసుకు పోతున్న రామకృష్ణ వృత్తిరీత్యా సహాయ వాణిజ్యపన్నుల శాఖాధికారి. ఆయన కవితలు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉంటాయి.[7]

ఆయన హైకూ కవి, అనువాదకుడు. ఆయన నెల్లూరు జిల్లా లోని పులికాట్ సరస్సు నకు వలస వచ్చిన పక్షుల గూర్చి ఆంగ్ల కవిత్వం ద్వారా తెలియజేసి ప్రసిధ్దుడైనాడు. ఆయన వ్రాసిన అనేక కవితలు, హైకూలు తెలుగు వార్తాపత్రికలు, జర్నల్స్ లో ప్రచురితమైనాయి. ఆయన చేసిన అనువాదాలు 21 అంతర్జాల జర్నల్స్, అంతర్జాల సైట్స్ లో ప్రచురితమైనాయి.

రచనలు

[మార్చు]

గుంటూరు శేషేంద్ర శర్మ, నాగభైరవ కోటేశ్వరరావు, అద్దేపల్లి రామమెహన్‌రావులను గురుతుల్యుగా భావించే రామకృష్ణ ఎన్నో రచనలు చేశారు.

  • వెన్నెల జలపాతం (కవిత) (1996)[8]
  • శ్వేత సంతకాలు (1999) (ఆరుగురు రచయిత ల కవితా సంకలనం)
  • నువ్వెళ్ళిపోయాక (దీర్ఘ కవిత) (2003)
  • కథాకళి పేరుతో నెల్లూరు కథలకు సంపాదీయకత్వం. (2004)
  • ప్లెమింగో (దీర్ఘ కవిత): (2006):సూళ్లూరుపేట ప్రాంతంలో వలస వచ్చి విడిదిచేసే సైబీరియా, నైజీరియా పక్షులను కవితావస్తువుగా తీసుకుకొని పక్షలను వలచి, మలచి వ్రాసిన ఆ కవితా హృదయాలను వోలాలడించింది. 2022-23 సంవత్సరము నుండి 9 వ తరగతి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తెలుగు పాఠ్య పుస్తకము లో పాఠ్యాంశంగా చేర్చబడినది.
  • ప్లెమింగో (2007), ఆంగ్లం,హిందీ,మలయాళం,కన్నడం.. భాషల్లో అనువాదం.[9]
  • నానీల మినీ కవిత్వం. (2007)
  • పరావర్తనం (ఆడియో పోయిట్రీ బుక్)
  • ముంజలు (బిలింగుల్ మిని పోయిట్రీ కలక్షన్)
  • పూల అమ్మిన ఊరు (2013)[8]
  • ఒకపరిమళ భరిత కాంతి దీపం (2017) [8]
  • దూది పెంజల వాన (2020)[8]
  • వర్ణలిపి (2022) వచనకవిత్వం

గౌరవ పదవులు

[మార్చు]
  • నాగపూర్ లోని ఇంటర్నేషనల్ బెనొవెలెంట్ రీసెర్చి ఫోరం సభ్యులు.
  • నెల్లూరు జిల్లా అధికార భాషా కమిటీ సభ్యులు.
  • చెన్నై లోని యునైటెడ్ రైటర్స్ అసోసియేషన్ సభ్యులు.
  • నెల్లూరు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ( 1998-2008)
  • డా.సి.నారాయణరెడ్డి గారిచే రంజని-కుందుర్తి నేషనల్ పోయట్రీ అవార్డును 2003 లో అందుకున్నారు.
  • అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ సంస్థ, భోపాల్, మధ్యప్రదేశ్ జాతీయ సంస్థకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు.
  • జీవిత సభ్యుడు -  వరల్డ్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అంద్‌ కల్చర్‌ (అమెరికా) 2013 నుండి
  • మెంబర్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీసు, డి.కె.ప్రభుత్వ కళాశాల, నెల్లూరు
  • అభ్యుదయ రచయితల సంఘము - రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షులు.
  • లఘురూప కవితా వేదిక, కోస్తాంధ్ర ప్రదేశ్ - అధ్యక్షులు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

పెరుగు రామకృష్ణకి సుజనారామంతో వివాహం జరిగింది . ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు శ్రీమతి సాహిత్య కళ్యాణచక్రవర్తి కాగా మరొకరు కుమారి శ్రీనిధి. ఈయన సతీమణి సుజనా కూడా కవయిత్రి, ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయిని. మహిళల సమస్యలపైన గళం విప్పే ఆమె కలం మహిళలకు చేదోడు వాదోడుగా పనిచేస్తుంది. వృత్తిరీత్యా ఆమె నెల్లూరు జిల్లా రూరల్‌ మండలం ఆమంచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశా లలో తెలుగుబాషా పండితులుగా పనిచేస్తున్నారు. ఆమె కలం నుండి జాలువారిన పసిపిల్లల మనోవికాసం, నడవడిక కోసం మల్లెమెగ్గలు, మౌనబాష్పం, శ్వేత సంతకాలు అందరినీ ఆకట్టు కుంటాయి. ఆమె జాతీయ స్థాయి అవార్డులు కూడా అందుకున్నారు. వీరిద్దరూ కలిసి సాహితీ ప్రపంచంలో తారా జువ్వల్లా దూసుకు పోతున్నారు.

అవార్డులు,రివార్డులు[10]

[మార్చు]
  • UWA అవుట్ స్టాండింగ్ ఇంతలెక్చుయల్ ఆఫ్ 21 సెంచరీ అవార్డు, చెన్నై.
  • 2000లో మిలీనియం ఎక్స్‌రే ప్రధాన అవార్డును ప్రముఖ కవి జ్వాలముఖి చేతుల మీదగా అందుకున్నారు.
  • 2003లో రంజనీ కుందుర్తి జాతీయ ప్రధాన అవార్డును జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి. నారాయణరెడ్డి చేతులమీదుగా అందుకున్నారు.
  • 2007లో అవుట్‌స్టాడింగ్‌ ఇంటలె క్చువల్‌ ఆఫ్‌ ట్వంటీపస్ట్‌ సెంచరీ అవార్డును యుజిసి చైర్మన్‌ సుఖ్‌దేవ్‌ థొరాటే చేతులు మీదుగా అందుకున్నారు.
  • 2007లో అటా వేడుకల పురస్కారాన్ని మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
  • 2007 లో నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రశంసా పత్రాన్ని పొందారు.
  • 2007 లో అమెరికా వారి నుండి ప్రతిష్ఠాత్మక ఎడిటర్స్‌ ఛాయిస్‌ అవార్డు పొందడం జరిగింది.
  • 2008లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విశిష్ట కవి పురస్కరాన్ని (స్వరధారి ఉగాది ) అనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
  • 2008లో అదే సంవత్సరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదగా మహాత్మ జ్యోతిరావు పూలే విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు.
  • 2023 ఫిబ్రవరి 17 తేదీన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ సంస్థచే "సరస్వతీ సమ్మాన్" పురస్కారం అందుకొన్నారు.
  • 2023 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే "మాతృభాషా సేవా శిరోమణి" పురస్కారం  తెలుగు అధికారా భాషా సంఘం అధ్యక్షుల చేతులమీదుగా అందుకొన్నారు.
  • 2024: వచన కవిత విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారం (2022)[11]
  • గౌరవ డాక్టరేట్‌ అవార్డ్‌ 1. ప్రేగ్‌ నగరం, చెక్‌ రిపబ్లిక్‌ (2016), 2.మెక్సికో (2019), 3. పెరు (2021).
  • ముఖ్య విదేశీ అవార్డులు: 1. ఎక్సెలెన్సీ ఇన్‌ పొయిట్రీ, గ్రీస్‌. యునైటెడ్‌ పొయిట్‌ లారేట్‌ ఇంటర్నేషనల్‌  ఎక్సెలెన్సీ ఇన్‌    పొయిట్రీ, జపాన్‌, పులారా ఎక్సెలెన్సీ ఇన్‌ పొయిట్రీ మెడలియన్‌ అవార్డ్‌, మలేసియా,  ప్లాటినం క్రాస్‌, ఇటలీ,   లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌  అవార్డ్‌, ఫిలిప్పీన్స్‌, మానవతావాద కవితా పురస్కారం,  బెల్జియం, విశ్వ సాహిత్య సామ్రాట్‌,  కజికిస్థాన్‌, పొయిట్‌ లారియేట్‌ మొరాకో, లాటిన్‌ అమెరికన్‌ గౌరవ పురస్కారం, మెక్సికో, ఎక్సెలెన్సీ ఇన్‌  పొయిట్రీ,సింగపూర్‌, పనోరమా ఇండో-గ్రీక్‌ గ్లోబల్‌ ఐకాన్‌ అవార్డు,                         వరల్డ్‌ ఐకాన్‌ ఆఫ్‌ పీస్‌, ఘన, గోల్డెన్‌ హార్ట్‌   అవార్డ్‌, రష్యా.
  • ఇవేగాకుండా ఎన్నో అవార్డులు, రివార్డులను ఆయన అందుకున్నారు.
  • నెల్లూరు లోని స్థానిక టెలివిజన్ ఛానెల్‌లో మై ఫేవరేట్‌ బుక్‌ పేరుతో ప్రతి శని, ఆది వారలలో ఉదయం 7.30నిమిషలకు శుభోదయం కార్యక్రమంలో యువతను ప్రభావితం చేసే అంశాలతో కార్యక్రమం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సినారే, అద్దేపల్లి శివారెడ్డి, డాక్టర్‌ గోపికృష్ణ వంటి గొప్ప గొప్ప రచయితల పుస్తకలను పరిచయం చేశారు.
  • డా.పెరుగు రామకృష్ణ రచనలపై పరిశోధనలు:

1.పూలమ్మిన ఊరు పై 2017లో  మదురై కామరాజు  విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్‌., 2.ఒక పరిమళ భరిత కాంతిదీపం పై 2018లో మదరాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్‌., 3. డా.పెరుగు కవిత్వం -  సామాజిక పరిశీలన ( మదరాసు విశ్వవిద్యాలయం)

  • డా.పెరుగు రామకృష్ణ పాల్గొన్న సెమినార్లు/సదస్సులు:  

సాహిత్య అకాడెమీ సదస్సులు - 12, సార్క్‌ దేశాల రచయితల సదస్సులు - 16, వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ పొయిట్రీ - 5, దక్షిణాసియా రచయితల సదస్సు (భారత ప్రభుత్వం) - 1, కాఫ్లా              ఇంటర్‌ కాంటినెంటల్‌ లిటరరీ ఫెస్టివల్‌ - 5, పొయిటికి ప్రిజం (అంతర్జాతీయ  బహుభాషా కవి సమ్మేళనం) - 8, యు.జి.సి సదస్సులు - వదోదర, గౌహతి, తుంచన్‌ ఫెస్టివల్‌ (కేరళ)-1. యు.జి.సి సదస్సులు - వదోదర,  గౌహతి. ఆకాశవాణి, దూర్‌దర్శన్‌, వివిధ మాధ్యమాలలో కవితా పఠనం.

  • డా.పెరుగు రామకృష్ణ పర్యటించిన దేశాలు: మలేసియా, గ్రీస్‌, జపాన్‌, పెరు, సింగపూర్‌, అమెరికా, చెక్‌ రిపబ్లిక్‌,  స్లొవేకియా, దోహా, దుబాయ్‌.
  • డా.పెరుగు రామకృష్ణ కవిత్వం ఇతర భారతీయ భాషలలోకి అనువాదం: తమిళం, కన్నడ, బెంగాళి, మలయాళం, హిందీ, ఆంగ్లం.
  • డా.పెరుగు రామకృష్ణ ఇతరదేశ భాషలలోకి అనువాదం: అల్బేనియా, జపాన్‌, రుమేనియా, అరబిక్‌, రష్యా, చైనా, ఫ్రెంచ్‌, స్పానిష్‌ మరియూ గ్రీక్‌ భాష.

ప్రముఖుల అభిప్రాయాలు:




మూలాలు

[మార్చు]
  1. "Perugu Ramakrishna biography". Archived from the original on 13 అక్టోబరు 2008. Retrieved 28 జూన్ 2015.
  2. "Perugu Ramakrishna". www.boloji.com. Retrieved 2022-05-28.
  3. "కవితల మీగడ - పెరుగు రామకృష్ణ -". web.archive.org. 2022-05-28. Archived from the original on 2022-05-28. Retrieved 2022-05-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "award-for-poet-perugu-ramakrishna". nri.andhrajyothy.com. Retrieved 2022-05-28.
  5. "PERUGU RAMAKRISHNA, Poet, Haiku Poet and Translator". Archived from the original on 2016-03-04. Retrieved 2015-06-28.
  6. కవిత్వ పంట పండిస్తున్న సాహితీ కుటుంబం[permanent dead link]
  7. Nadadhur, Srivathsan (2016-12-01). "Perugu Ramakrishna: Poetry on a global frontier". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-05-28.
  8. 8.0 8.1 8.2 8.3 "పెరుగు రామకృష్ణ కవిత్వం-దూదిపింజలవాన | సోపతి | www.NavaTelangana.com". web.archive.org. 2022-05-28. Archived from the original on 2022-05-28. Retrieved 2022-05-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. "Perugu Ramakrishna biography". Archived from the original on 13 October 2008. Retrieved 20 August 2012.
  10. "Perugu Ramakrishna, Author at Sakalam". web.archive.org. 2022-05-28. Archived from the original on 2022-05-28. Retrieved 2022-05-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  11. "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2024-03-21. Archived from the original on 2024-03-20. Retrieved 2024-03-21.

ఇతర లింకులు

[మార్చు]