మంత్రి కృష్ణమోహన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంత్రి కృష్ణమోహన్
జననం
మంత్రి మాల్యాద్రి కృష్ణమోహన్

(1978-08-16) 1978 ఆగస్టు 16 (వయసు 46)
విద్యఎం.ఎ. (తెలుగు);ఎం.ఎ.(ఇంగ్లీషు); బి.ఇడి.
వృత్తిఉపాధ్యాయుడు
ఉద్యోగంమునిసిపల్ ప్రాథమిక పాఠశాల, మార్కాపురం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి
జీవిత భాగస్వామినాగమణి
తల్లిదండ్రులు
  • యోగీశ్వరరావు (తండ్రి)
  • సత్యవతి (తల్లి)
నోట్సు

మంత్రి మాల్యాద్రి కృష్ణమోహన్ ప్రకాశం జిల్లా, మార్కాపురంకు చెందిన యువకవి. ఇతని కవితా సంపుటం ప్రవహించే పాదాలుకు 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారం[1] లభించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1978వ సంవత్సరం ఆగష్టు 16వ తేదీన ప్రకాశం జిల్లా, మార్కాపురంలో సత్యవతి, యోగీశ్వరరావు దంపతులకు జన్మించాడు. ఇతని ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసము దొనకొండలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఆర్.ఎస్) లో గడిచింది. తర్వాత మార్కాపురంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి సిల్వర్ జూబ్లీ కళాశాల కర్నూలులో డిగ్రీ చేశాడు. అటు పిమ్మట గిద్దలూరులో బి.ఇడి చదివాడు. మార్కాపురంలోని మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ దూరవిద్య ద్వారా కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. (ఇంగ్లీషు), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. (తెలుగు) పూర్తి చేశాడు.

ఇతడు పాల్గొన్న కొన్ని కార్యక్రమాలు:

  • 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మధురైలో జరిగిన ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల రచయితల సదస్సులో పాల్గొన్నాడు.
  • పొయెటిక్ ప్రిజమ్‌ కల్చరల్ సెంటర్ విజయవాడ వారు 2015లో నిర్వహించిన బహుభాషాకవుల సమ్మేళనంలో పాల్గొన్నాడు.
  • కేంద్ర సాహిత్య అకాడమీ ఒంగోలులో 2014లో తెలుగు సాహిత్యంలో వర్తమాన ధోరణులపై నిర్వహించిన సింపోజియంలో లఘుకవితారూపాలు అనే అంశంపై పత్రసమర్పణ చేశాడు.
  • 2015లో కొత్త ఢిల్లీలో జరిగిన యువరచయితల సమావేశానికి ప్రతినిధిగా హాజరయ్యాడు.

రచనలు

[మార్చు]
  • మట్టిపలకలు (నానీల సంపుటం)
  • ప్రవహించే పాదాలు (కవితాసంపుటం)

పురస్కారాలు, సత్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]