ప్రవహించే పాదాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రవహించే పాదాలు
అవుటాఫ్ కవరేజ్ ఏరియా
కృతికర్త: మంత్రి కృష్ణమోహన్
ముఖచిత్ర కళాకారుడు: నివాస్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: వచన కవితా సంపుటి
ప్రచురణ: చందు ప్రచురణలు, మార్కాపురం
విడుదల: డిసెంబర్, 2012
పేజీలు: xii+96


ప్రవహించే పాదాలు వచన కవితల సంపుటాన్ని మంత్రి కృష్ణమోహన్ రచించాడు. కవి ఈ గ్రంథాన్ని తన తల్లిదండ్రులైన సత్యవతి, యోగీశ్వరరావులకు అంకితం చేశాడు. ఈ పుస్తకానికి ప్రముఖ కవి ఎన్.గోపి నడిచే కవిత్వం పేరుతో ముందుమాట వ్రాశాడు.[1]

రచయిత గురించి[మార్చు]

మంత్రి కృష్ణమోహన్ 1978వ సంవత్సరం ఆగష్టు 16వ తేదీన ప్రకాశం జిల్లా, మార్కాపురం[2]లో సత్యవతి, యోగీశ్వరరావు దంపతులకు జన్మించాడు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ దూరవిద్య ద్వారా కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. (ఇంగ్లీషు), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. (తెలుగు) పూర్తి చేశాడు. ఇతని కవితలకు అనేక బహుమతులు లభించాయి. ఇతడు ఈ పుస్తకంతో పాటుగా మట్టి పలకలు అనే పేరుతో 365 నానీలతో ఒక పుస్తకం వెలువరించాడు.

ఈ పుస్తకంలో[మార్చు]

ఈ పుస్తకంలో 45 కవితలు ఉన్నాయి. ఈ కవితలు చినుకు, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, పినాకిని, నవ్యవీక్లీ, పాలపిట్ట, లాయర్, ఈవారం, విశాలాంధ్ర్ర, సాహిత్యప్రస్థానం, ఆంధ్రప్రభ, నేటినిజం, ప్రజాశక్తి, వార్త, మల్లెతీగ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. రెండు బహుమతి పొందిన కవితలు వీటిలో ఉన్నాయి. ఈ పుస్తకంలోని కవితలు వరుసగా:

 1. శిలాగీతం
 2. ఎ విజిట్ టు వృద్ధాశ్రమం
 3. ప్రవహించే పాదాలు
 4. మనసైన పుస్తకం
 5. ప్రేమ
 6. శ్రీకారం
 7. చెట్టు పోయిన తర్వాత
 8. డైరీలో ఒక పేజీ
 9. ముకురం ముందు
 10. నన్ను నేను
 11. ఇద్దరి మధ్య
 12. రాత్రి
 13. ఏకవాక్యం
 14. వాళ్లు చల్లబడరు
 15. జరిగింది చాలు
 16. అంతరం
 17. మౌనమూ మాట్లాడుతుంది
 18. ఆశ
 19. చలన చిత్రాలు
 20. తిరిగిరాని వెన్నెల
 21. ఒక నిట్టూర్పు
 22. ఖబడ్దార్
 23. కవ్వం
 24. సూక్తి
 25. దయావర్షం
 26. ఓ లోతట్టు దృశ్యం
 27. హంపి కవితలు
 28. బొమ్మా బొరుసూ
 29. యుద్ధసముద్రం
 30. సమాధానముందా?
 31. ఒక కవిత్వ పుస్తకమూ - కొన్ని ఆకుపచ్చని మాటలూ
 32. ముద్దుపేరు
 33. రెండు జీతాలు
 34. దుఃఖగీతం
 35. దాహం
 36. తడి ఆరని రాగాన్ని
 37. కథాయానం
 38. నాన్నమ్మ కళ్ళద్దాలు
 39. గుండె పండు
 40. మైదానంలోకి
 41. ఆత్మని చూడు
 42. గాయం నా గురువు
 43. మట్టిమనసుకు నీరాజనం
 44. నాన్నకు క్షమాపణ
 45. పోయమే రాయనక్కర్లేదు

పురస్కారాలు[మార్చు]

ప్రముఖుల అభిప్రాయాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 'ప్రవహించే పాదాలు'
 2. మంత్రి కృష్ణమోహన్‌కు పురస్కారం
 3. మంత్రి కృష్ణమోహన్ కవిత్వం :మనిషికోసం అక్షరం ఆర్తనాదం
 4. "sahitya academy yuva puraskara 2013" (PDF). మూలం (PDF) నుండి 2016-03-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-06-26. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]