ఆంధ్రప్రదేశ్ (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ పత్రిక
ఆంధ్రప్రదేశ్ పత్రిక ముఖచిత్రం
మాజీ సంపాదకులుకందుల రమేష్
వర్గాలుప్రభుత్వ పత్రికలు
తరచుదనంనెల
రూపంముద్రణ
ముద్రణకర్తఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ
మొదటి సంచికమార్చి 1, 1957; 67 సంవత్సరాల క్రితం (1957-03-01)
ఆఖరి సంచికజూన్ 1, 2019 (2019-06-01)
భాషతెలుగు, ఇంగ్లీషు (కొంత కాలం ఉర్దూ)

ఆంధ్రప్రదేశ్ సమాచార, ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే తెలుగు, ఇంగ్లీషు భాషలలో ప్రచురింపబడే మాసపత్రిక.[1][2] తొలిగా 1957 మార్చిలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కలసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వెలువడింది[3] ఆ తర్వాత ఉర్దూ భాషలో కూడా ప్రచురించబడిన తెలంగాణ తిరిగి వేరైన తరువాత ఉర్దూ భాషలో ప్రచురణ నిలిపివేయబడింది. 2019 జూన్ సంచికతో పత్రిక విడుదల ఆగిపోయింది. దీనికి కారణం జగన్ ప్రభుత్వ అధికారం చేపట్టిన వివరాలు తొలిగా రూపొందించిన 2019 జూన్ సంచికలో దోషాలుండటంగా చెప్పబడింది. తరువాత కొద్ది సవరణలు చేసిన పత్రికను వెబ్సైట్లో చేర్చారు.[4]

ప్రతి సంచికలో ప్రభుత్వ సమాచారంతో పాటు, కథలు, కవిత్వం, వ్యంగచిత్రాలు వుండేవి.

ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళేందుకు ప్రారంభించిన పత్రిక. ఎప్పటి కప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలోని పంచాయితీ కార్యాలయాలు మొదలుకొని మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపాలిటీలో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృతంగా ప్రచారం కలిపించేది.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆంధ్రప్రదేశ్ (మాస పత్రిక)". Retrieved 2020-01-18.
  2. "Andhrapradesh patrika online monthly Telugu News edition". ipr.ap.nic.in. Retrieved 2020-08-25.
  3. "ఆంధ్రప్రదేశ్ పత్రిక మొదటి సంపుటి, మొదటి సంచిక మార్చి 1957(ఆర్కైవ్ లో)". Retrieved 2020-01-18.
  4. "Why editor of AP official magazine was sacked!". greatandhra.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-08-25. Retrieved 2020-08-26.