Jump to content

చింతామణి (పత్రిక)

వికీపీడియా నుండి
చింతామణి
1898 లో వచ్చిన ఒక సంచిక
సంపాదకులుకందుకూరి వీరేశలింగం పంతులు
ఎన్. బ్రహ్మానందం నాయుడు
స్థాపకులున్యాపతి సుబ్బారావు
కందుకూరి వీరేశలింగం పంతులు
మొదటి సంచిక1881
దేశంబ్రిటిషు భారతదేశం
కేంద్రస్థానంరాజమహేంద్రవరం
మద్రాసు
భాషతెలుగు

చింతామణి తెలుగు మాసపత్రిక. తొలుత 1891 లో రాజమహేంద్రి నుండి, ఆ తరువాత 1897 నుండి మద్రాసు నుండీ ప్రచురితమైన పత్రిక.

అముద్రిత గ్రంథ చింతామణి వలె ప్రాచీన సాహిత్యాన్ని ప్రచురిస్తూ ఆధునిక సాహిత్య ప్రచురణను ప్రోత్సహించడం చింతామణి ప్రత్యేకత.[1]

ప్రారంభంలో చింతామణి పత్రిక వివేకవర్ధనికి అనుబంధంగా ప్రచురించబడేది.

1891 లో న్యాపతి సుబ్బారావు చింతామణిని స్థాపించారు. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహం అతనికి సహాయం చేశారు.

నవలల పోటీ

[మార్చు]

చింతామణి, 1892 లోనే నవలల పోటీకి శ్రీకారం చుట్టింది. పత్రికా సాహిత్యంలో తెలుగు నవలా రచన పోటీలను తొలిసారిగా ప్రారంభించిన ఘనత చింతామణిదే. ఆయితే ఆ రోజుల్లో ఈ ప్రక్రియకు నవల అన్న పేరు రూఢి కాలేదు. దీనిని వచన ప్రబంధమని వ్యవహరించేవారు. నవలా పోటీలు నిర్వహించి, ఉత్తమ నవలలుగా ఎంపికైన వాటికి బహుమతులివ్వటం అనే సాంప్రదాయాన్ని మొదటగా ఏర్పరచింది చింతామణి పత్రికే.[2] ఈ పోటీల్లో ఒక విశేషం - రచయిత తన పేరును దానిపై రాయకుండా, ఏదో ఒక గుర్తును తన రచనపై పెట్టి పంపాలి. ఆ గుర్తు గురించిన వివరాలను వేరే ఒక ఉత్తరంలో రాసి పంపాలి. తద్వారా బహుమతుల నిర్ణయంలో రచయిత ప్రభావితం చెయ్యలేరని బహుశా పత్రిక ఉద్దేశం అయి ఉంటుంది.[3]

మొదటి బహుమతి 75 రూపాయలు, రెండవబహుమతి 50 రూపాయలతో తొలిపోటీని నిర్వహించారు. ఈ పోటీలో మొదటి బహుమతి ఖండవిల్లి రానుచంద్రుడు (ధర్మవతీవిలాసము)కు, రెండవ బహుమతి తల్లాప్రగడ నూర్యనారాయణ (సంజీవరాయచరితము) కు ఇచ్చారు.[4] 1893 లో ప్రకటించిన రెండవ పోటీకి బహుమతి మొత్తాలను 125, 75 రూపాయలకు పెంచారు. ఈసారి చిలకమర్తి లక్ష్మీనరసింహం, గోటేటి కనకరాజులు పంపిన రామచంద్రవిజయము, వివేకవిజయము నవలలు రెండూ సమాన స్థాయిలో ఉన్నందున మొత్తం బహుమానాన్ని చెరి సగం పంచి ఇచ్చారు.[5]

మూడవ సంవత్సరం పోటీల్లో, బహుమతులకు అర్హమైన నవలలేమీ రాలేదనీ, అయినా రెండింటికి బహుమతులు ఇస్తామని ప్రకటించాం కాబట్టి, ఉన్నవాటిలోనే ఒక రెంటిని ఎంచుకున్నాము అని ప్రకటించారు. టేకుమళ్ళ రాజగోపాలరావు రాసిన త్రివిక్రమ విలాసము, ఖండవిల్లి రామచంద్రుడు రాసిన మాలతీరాఘవీయములకు రెండు బహుమతుల మొత్తాన్ని సమానంగా పంచి ఇచ్చారు.[6]

ఆ తరువాత పెట్టిన పోటీల్లో, పోటీలకు పంపే రచనలు ఏయే అంశాలపై రాయాలో కూడా చెప్పారు.

పత్రికను మొదట నిర్వహించిన వావిలాల వాసుదేవశాస్త్రి, కందుకూరి సుబ్బారావు కలసి పోటీకి వచ్చిన నవలలను చదివి బహుమతులకు యోగ్యమైన వాటిని ఎంపిక చేసేవారు.

రచనలు

[మార్చు]

గ్రంథ సమీక్షలు, సాటి పత్రికల పరిచయం, భౌగోళికాంశాలపై వ్యాసాలు, సైన్సు వ్యాసాలు, చరిత్ర వ్యాసాలు వంటివి ఈ పత్రికలో తరచూ ప్రచురించేవారు. ఆగష్టు 1892 న ప్రచురించిన చింతామణి పత్రిక సంపుటము రెండులో ఈ క్రింది శీర్షికలు ఉన్నాయి.[7]

  • ఆతిథ్యము
  • అలంకార గ్రంథ తత్త్వము
  • భారత ప్రయోగములు
  • సాహిత్యము - శాస్త్రము
  • కృతి నామకరణము
  • చిత్రం
  • పండిత పుత్త్రుడు
  • ఓట్ల దయ్యము
  • మిత్ర హితోపదేశము
  • అవి యుద్ధపురోజులు
  • ప్రభావతి

చింతామణిలో తరచూ బ్రిటిషు సామ్రాజ్ఞి విక్టోరియా మహారాణిని ప్రశంసిస్తూ వ్యాసాలు, పద్య ఖండికలూ ప్రచురించేవారు. స్వయంగా వీరేశలింగం కూడా ఒక సంచికలో వ్యాసం రాసాడు. 1893 జనవరిలో కందుకూరి వీరేశలింగంల్కు రావు బహదూర్ బిరుదు వచ్చిన సంగతిని 1893 ఫిబ్రవరి సంచికలో ప్రచురించారు.

పూర్వాచారము

[మార్చు]

01 జులై 1899 వికారి నామ సంవత్సర ఆషాడ మాసంలో ప్రచురించిన చింతామణి పత్రికలో పూర్వాచారము శీర్షిక లో ఉన్న విషయము.

పూర్వాచారము.

మన దేశమునందు సామాన్య జనుల మనస్సులలో నెల్లను పూర్వాచారము నాజరా దన్న యభిప్రాయము దృఢముగా నాటుకొని యున్నది. ఆటివారికిఁ బూర్వాచారము సందున్నంత గౌరవము మతి దేనియందును లేదు. అణుమాత్రమును మేర మీజ పూ ర్వులు నడిచినట్లే మనము సమస్తవిషయములయందును నడపవలెనని బోధించుచు, తమ మేలుకొలకయి యించుక కొత్తవారిని దొక్కినవారి నందతిని పతికులనుగా భావించి పూర్వాచార పరాయణులు గరించుచుందురు. అట్టివారు. పూర్వకాలము ధర్తము నాలుగు పాదములను నడ చెడి సత్యయుగ మనియు, అప్పటివారు సమస్తాను భవములను గలిగిన సర్వత్రా లనియు, ఇది పాపభూయిష్టమై యధర్మ బహుళ మయినకలియుగ మని యు, ఇప్పటివా రనుభవశూన్యు లయిన యజ్ఞు లనియు, సముదురు. ఆయినను వారి నమకము సత్యమునకు మిక్కిలి దూర మయినదని కొంచె మాలోచించినవా రెలను సుల భముగాఁ దెలిసికొనవచ్చును. నిజము విచారింపఁగా నిప్పటి కాలమే పూర్వకాలమున కంటే జ్ఞానాధిక్యమును గలిగి యుండ వలసినదిగా సున్నది. పూర్వపు ప్రపంచము | యొక్క బాల్యద : ఇప్పుడు వచ్చుచున్నది ప్రపంచము యొక్క యాసపడత, కాలుని గంటే యావన పురుషుఁడు జ్ఞానాధికుఁ డగుట స్వాభావికము , ఆట్లు కాకపోవుట య స్వాభావికము. అది కాలమునం బెల్లవారును స్వాముధవను చేతి జ్ఞాన సంపాదనము చేయవలసియున్నది; అటుతరు వాలి వచ్చినవారికి స్వానుభవము చేత వచ్చినది మాత్రమే కాక తమపూర్వులు సంపాదించి యిచ్చిన జ్ఞానము కూడ హస్తగత మగును

బయటి లింకులు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగు వికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-01-16.
  2. కె., రామదాస్ (2012). తెలుగు దినపత్రికలు సాహిత్య సేవ. హైదరాబాదు: తెలుగు అకాడమీ. p. 3.
  3. కందుకూరి వీరేశలింగం పంతులు (1899). Chintamani Magazine చింతామణి పత్రిక.
  4. కందుకూరి వీరేశలింగం పంతులు (1899). Chintamani Magazine చింతామణి పత్రిక.
  5. కందుకూరి వీరేశలింగం పంతులు (1899). Chintamani Magazine చింతామణి పత్రిక.
  6. కందుకూరి వీరేశలింగం పంతులు (1899). Chintamani Magazine చింతామణి పత్రిక.
  7. "చింతామణి మాసపత్రిక/సంపుటము 2 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-08-31.