Jump to content

పాడిపంటలు (పత్రిక)

వికీపీడియా నుండి
పాడిపంటలు

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రచురించే తెలుగు మాసపత్రిక పాడిపంటలు. ఇది 1952 లో మొదలైంది. జూలై 1993 న 50 ఏళ్ల ప్రత్యేక సంచిక వెలువడింది. 2015 జనవరి నుండి సంచికలు వెబ్ లో అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ పాడిపంటలు ప్రస్తుతపేరు.[1] అయితే 2025 అక్టోబరు నాటి సంచికలో పత్రిక పేరును "పాడిపంటలు" గానే ప్రచురించారు.[2]

రైతాంగానికి సలహాలు, సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు వ్యవసాయరంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు, అభివృద్ధి గురించి తెలియచేయటం, ప్రభుత్వ పథకాలు, రాయితీల సమాచారం ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశ్యం.

వ్యవసాయ శాఖ కమీషనర్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ పత్రిక వెలువడుతుంది. ప్రతి నెల సంచికలో ఆ నెలలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి జిల్లా అనుబంధంలో వివరిస్తారు.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "వ్యవసాయ పాడిపంటలు జాలస్థలి". Archived from the original on 2019-12-07. Retrieved 2020-01-18.
  2. https://agriculture.ap.gov.in/farmers-corners/e-magazine?year=2025[permanent dead link]