పాలపిట్ట మాసపత్రిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాలపిట్ట
పాలపిట్ట ముఖచిత్రం
రకంమాసపత్రిక
రూపం తీరుజర్నల్
యాజమాన్యంగుడిపాటి వెంకటేశ్వర్లు
ప్రచురణకర్తగుడిపాటి వెంకటేశ్వర్లు
సంపాదకులుగుడిపాటి వెంకటేశ్వర్లు
స్థాపించినది2010 ఫిబ్రవరి
కేంద్రంహైదరాబాదు

ఉన్నతమైన ఆశయాలతో, ప్రమాణాలతో పాలపిట్ట మాసపత్రిక ప్రారంభించబడింది. ఈ పత్రిక తొలి సంచిక 2010, ఫిబ్రవరి నెలలో వెలువడింది. పాలపిట్ట బుక్స్ తరఫున నడుపబడుతున్న ఈ పత్రికకు గుడిపాటి వెంకటేశ్వర్లు సంపాదకుడు, ప్రచురణకర్త.

ఆశయాలు[మార్చు]

ఈ పత్రిక తొలి సంచికలోని సంపాదకీయంలో పత్రిక దశ దిశ ఇలా పేర్కొన్నారు[1].

  1. సృజనాత్మక వ్యక్తీకరణలకు అనువైన వేదిక
  2. సర్వకళలకీ చోటు కల్పించే విస్తృతీ, వైశాల్యం ప్రత్యేకత
  3. ప్రధాన స్రవంతి ధోరణికి భిన్నంగా సరికొత్త ఆలోచననీ, దృక్పథాన్నీ, అవగాహననీ అందించటమే ప్రాతిపదిక
  4. తెలుగు రచనలకే కాదు అనువాదాలకు, డయాస్పోరా వ్యక్తీకరణలకు సమప్రాధాన్యం
  5. రచనను ఎవరు రాసారన్నది కాదు, దానిలోని అసలుసిసలుతనం ఎంతన్నదే ప్రమాణం.
  6. సాహిత్య కళారంగాలలో ప్రజాస్వామిక చర్చలకు వేదిక.

పైన పేర్కొన్న ఆశయాలకు అనుగుణంగా పత్రిక వెలువడుతున్నది.

విశేషాలు[మార్చు]

ఈ సాహిత్య పత్రికలో కథ, కవిత, నవల, విమర్శ వంటి ప్రక్రియలలో రచనలు వెలువడుతున్నాయి. తెలుగు రచనలే కాక అనువాద రచనలకూ ప్రాధాన్యత లభిస్తోంది. ప్రతి సంచికా ఒక ప్రముఖుని గురించిన విశేషాలతో ఒక ప్రత్యేక సంచికగా వెలువడుతున్నది. దాశరథి రంగాచార్య, దామెర రాములు, కాళోజీ నారాయణరావు, అమ్మంగి వేణుగోపాల్, అట్టాడ అప్పల్నాయుడు, బండి నారాయణస్వామి, గోరటి వెంకన్న, శాంతి నారాయణ, కె.వి. రమణాచారి, మామిడి హరికృష్ణ, పొట్లపల్లి రామారావు, ఎల్.ఆర్.స్వామి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ మొదలైన ఎందరో ప్రముఖుల ప్రత్యేక సంచికగా ఈ పత్రిక వెలువడింది.

కొన్ని రచనలు[మార్చు]

రచయితలు[మార్చు]

ముకుంద రామారావు, గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి, ఎమ్వీ రామిరెడ్డి, రూప్‌కుమార్ డబ్బీకార్, పెన్నా శివరామకృష్ణ, అఫ్సర్, కస్తూరి మురళీకృష్ణ, కె.పి.అశోక్‌కుమార్, వి.చంద్రశేఖరరావు, మునిమడుగుల రాజారావు, దాసరి అమరేంద్ర, రామా చంద్రమౌళి, అయినంపూడి శ్రీలక్ష్మి, ఎం.నారాయణశర్మ, విహారి, చింతపట్ల సుదర్శన్, పత్తిపాక మోహన్ మొదలైనవారు.

మూలాలు[మార్చు]

  1. బొల్లోజు బాబా. "సిసలయిన సృజనకు వేదిక – "పాలపిట్ట" మాస పత్రిక". పుస్తకం.కామ్. Retrieved 24 December 2019.